
సాక్షి, హైదరాబాద్: ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా మెగా మేనల్లుడు సోషల్ మీడియాలో ఉంటాడు. సినీ అభిమానులను అలరిస్తాడు. తాజాగా పలు విషయాల గురించి ఫేస్‌బుక్‌లో అభిమానులతో ముచ్చటించాడు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. అంతేకాకుండా చాలా విషయాలను బయట పెట్టాడు.
తాను సినిమాల్లోకి రావడానికి ప్రధాన కారణం నిరుద్యోగమని చెప్పాడు. ప్రస్తుతం జవాను చిత్రంలో చేస్తున్నానని త్వరలోనే విడుదల తేదీని మీడియా సమావేశం నిర్వహించి ప్రకటిస్తాని తెలిపాడు. ఇతర హీరోలతో మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి తనకు అభ్యంతరం లేదన్నాడు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ చిత్రంలో చిన్న పాత్ర ఇచ్చినా చేస్తానన్నాడు. మహేష్‌బాబును ఈ తరానికి సూపర్‌స్టార్ అంటూ పొగిడాడు. ఏదన్నా కొత్తగా చేయాలనుకుంటారు అని చెప్పాడు.
తొలి ప్రేమ మళ్లీ రీమేక్ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు, అలాంటి క్లాసిక్ సినిమాలు నేను చేయలేను అని సమాధానమిచ్చాడు. కథ నచ్చితే విలన్ పాత్రల్లో నటిస్తానన్నాడు. వివి వినాయక్ సినిమాలో డ్యూయల్ రోల్ అంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశాడు. రవితేజ, ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని, రాజా ది గ్రేట్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాని వచ్చిన వార్తల్లో నిజం లేదని తేజ్ క్లారిటీ ఇచ్చాడు. వెన్నెల కిశోర్, సత్య, వైవా హర్ష అంటే చాలా ఇష్టమని తెలిపాడు. చిరంజీవి వల్లే బతికి ఉన్నానని, తనకు దేవుడితో సమానమని ఆయన వల్లే చిత్రపరిశ్రమకు వచ్చానన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment