పవన్ బర్త్‌డే కానుకగా.. జవాన్ టైటిల్ సాంగ్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'జవాన్' టైటిల్ సాంగ్ టీజర్‌ను శనివారం విడుదల చేశారు. మెగా ఫ్యామిలీ హీరో, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ యూనిట్ టీజర్ విడుదల చేసింది. టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తుందని దర్శకుడు బివిఎస్ రవి చెప్పారు. ఎస్.ఎస్ థమన్ అందించిన సంగీతం మూవీకి ప్లస్ పాయింట్ కానుంది. సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో భారీ హైప్స్ క్రియేట్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
దేశానికి జవాన్ ఎంత అవసరమో... ప్రతీ ఇంటికి జవాన్ లోని హీరో లాంటి వ్యక్తి ఉండాలని దర్శకుడు రవి చెబుతుండగా ఈ మూవీ తేజూకి మంచి పేరు తీసుకొస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేం మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇన్నాళ్లు బబ్లీ హీరోగా కనిపించిన సాయిధరమ్ ఈ సినిమాలో కాస్త హుందాగా కనిపిస్తున్నాడు. దిల్ రాజు సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.