
‘ఛలోనా..’ (పద) అంటూ షారుక్ ఖాన్, నయనతార ప్రేమ పాట పాడుకోనున్నారు. షారుక్ ఖాన్ టైటిల్ రోల్‌లో నయనతార కథానాయికగా నటించిన చిత్రం ‘జవాన్’. ఇప్పటివరకూ ఈ చిత్రం నుంచి విడుదలైన షారుక్, నయనతార లుక్స్ యాక్షన్ సీన్స్‌కి సంబంధించినవి. అలాగే పాటల విషయానికి వస్తే.. షారుక్, ప్రియమణి, డ్యాన్సర్స్‌పై చిత్రీకరించిన మాస్ సాంగ్ ‘దుమ్మే దులిపేలా..’ ఇటీవల విడుదలైంది.
సోమవారం షారుక్, నయనతారల రొమాంటిక్ సాంగ్‌ని, ΄పోస్టర్‌ని విడుదల చేయనున్నారు. ‘ఛలోనా..’ అంటూ సాగే ఈ పాట షారుక్ కెరీర్‌లోని బెస్ట్ రొమాంటిక్ సాంగ్స్‌లో ఒకటి అవుతుందని యూనిట్ పేర్కొంది. అనిరుధ్ రవిచందర్ స్వరపరచిన ఈ పాటను ఆదిత్య ఆర్.కె., ప్రియా మాలి పాడారు. ‘ఛలోనా..’ని హిందీ, తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నారు. అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్ నిర్మించిన ‘జవాన్’ సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment