‘ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఓ కుర్రాడు తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఏం చేశాడన్నదే ‘జవాన్’ కథ. మంచి లవ్ అండ్ ఎంటర్‌టైనర్ మూవీ. ఇది దేశానికి సంబంధించిన కథ కాదు.. ఓ కుర్రాడి కుటుంబానికి చెందిన కథ. మా ప్రయత్నం డిసెంబర్ 1న ‘జవాన్’ రూపంలో విడుదలవుతుంది’’ అని చిత్ర సమర్పకుడు ‘దిల్’ రాజు అన్నారు. సాయిధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా బీవీయస్ రవి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జవాన్’. ‘దిల్’ రాజు సమర్పణలో కృష్ణ నిర్మించిన ఈ సినిమాలోని ఒక పాటని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. బీవీయస్ రవి మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు ఇటీవల చనిపోయారు.
ఆయన తర్వాత నన్ను అలా గైడ్ చేసిన ‘దిల్’ రాజుగారికి థ్యాంక్స్. చాలా గ్యాప్ తర్వాత ‘జవాన్’ సినిమా డైరెక్ట్ చేయడానికి సాయిధరమ్ కూడా ఓ కారణం. కథ వినగానే ‘మీరు డైరెక్ట్ చేయండి, నేను సినిమా చేస్తా’ అన్నారు. తమన్ ఈ సినిమాకి ప్రత్యేక శ్రద్ధతో ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ అందించాడు’’ అన్నారు. ‘‘రాజుగారు, కృష్ణగారు అవసరమైనవి యూనిట్‌కి సకాలంలో అందించి ఓ మంచి సినిమా చేయడానికి అందర్నీ ముందుకు నడిపారు’’ అని సాయిధరమ్ తేజ్ అన్నారు. ‘‘కృష్ణ అన్న తొలి సినిమాకు నేను సంగీతం అందించడం ఆనందంగా ఉంది. తమ్ముడు తేజూతో నాకిది నాలుగో సినిమా. పాటలు, సినిమా... ప్రేక్షకులను అలరిస్తాయి’’ అన్నారు తమన్.
Comments
Please login to add a commentAdd a comment