Mehrine
-
తేజ్ ఏ రోజూ సెకండ్ టేక్ తీసుకోలేదు – వీవీ వినాయక్
‘‘చిరంజీవి, పవన్‌కల్యాణ్ కలిస్తే సాయిధరమ్ తేజ్. మా సినిమా కోసం 40 రోజులు షూటింగ్ చేశాం. ఏ రోజూ తను సెకండ్ టేక్ తీసుకోలేదు. అంత ఫోకస్‌గా ఉన్నాడు’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. సాయిధరమ్ తేజ్, మెహరీన్ జంటగా బీవీయస్ రవి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జవాన్’. ‘దిల్’ రాజు సమర్పణలో కృష్ణ నిర్మించారు. ఈ సినిమా ప్రీ–రిలీజ్, పాటల విడుదల వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఖుషి, బద్రి’ సినిమాల ఇన్స్పిరేషనే ‘జవాన్’ టైటిల్ సాంగ్. రవి మంచి రచయిత. స్నేహితుడు రవి కోసం స్క్రిప్ట్ విషయంలో కొరటాల శివ సపోర్ట్ చేయడం హ్యాపీ. తేజ్, నేను చేసిన సినిమాలన్నీ మంచి సక్సెస్ అయ్యాయి. ఆ సక్సెస్ జర్నీ ‘జవాన్’తో మరోసారి కంటిన్యూ అవుతుంది. తమన్ ఎక్స్ట్రార్డినరీ రీ–రికార్డింగ్ ఇచ్చాడు. డిఫరెంట్ అప్రోచ్‌తో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. ‘‘బీవీయస్ రవి నా కాలేజ్‌మేట్. కృష్ణ కూడా నాకు ఎంతో కావాల్సిన వ్యక్తి. తేజ్ చాలా పాజిటివ్ హీరో. నాకు కావాల్సిన వీరందరూ కలిసి చేస్తున్న ‘జవాన్’ హిట్ అవ్వాలి’’ అన్నారు దర్శకుడు కొరటాల శివ. బీవీయస్ రవి మాట్లాడుతూ– ‘‘తేజ్‌కి ఈ కథ చెప్పగానే సినిమా చేస్తానన్నాడు. నేను ఎంతో నిజాయతీతో, నిక్కచ్చిగా తయారు చేసుకున్న పాత్ర ఇది. అంతే నిజాయతీగా తేజ్ కష్టపడ్డాడు. ఇంటికో జవాన్ ఉండాలని చెప్పే సినిమా ఇది. డిసెంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది’’ అన్నారు. సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ– ‘‘నేను తినే ప్రతి మెతుకుపైనా మా మావయ్యల (చిరంజీవి, నాగబాబు, పవన్‌కల్యాణ్) పేర్లు ఉంటాయి. మా ఫ్యామిలీకి చిరంజీవి, పవన్ మావయ్యలు ఎలా జవాన్లుగా నిలబడ్డారో, అలా ప్రతి ఫ్యామిలీకి ఓ జవాన్ అండగా ఉంటాడు. కృష్ణగారు మేకింగ్‌లో రాజీపడలేదు’’ అన్నారు. -
ఓ కుర్రాడి కథ ఇది – ‘దిల్’ రాజు
‘ఆర్ఎస్ఎస్కు చెందిన ఓ కుర్రాడు తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఏం చేశాడన్నదే ‘జవాన్’ కథ. మంచి లవ్ అండ్ ఎంటర్టైనర్ మూవీ. ఇది దేశానికి సంబంధించిన కథ కాదు.. ఓ కుర్రాడి కుటుంబానికి చెందిన కథ. మా ప్రయత్నం డిసెంబర్ 1న ‘జవాన్’ రూపంలో విడుదలవుతుంది’’ అని చిత్ర సమర్పకుడు ‘దిల్’ రాజు అన్నారు. సాయిధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా బీవీయస్ రవి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జవాన్’. ‘దిల్’ రాజు సమర్పణలో కృష్ణ నిర్మించిన ఈ సినిమాలోని ఒక పాటని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. బీవీయస్ రవి మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు ఇటీవల చనిపోయారు. ఆయన తర్వాత నన్ను అలా గైడ్ చేసిన ‘దిల్’ రాజుగారికి థ్యాంక్స్. చాలా గ్యాప్ తర్వాత ‘జవాన్’ సినిమా డైరెక్ట్ చేయడానికి సాయిధరమ్ కూడా ఓ కారణం. కథ వినగానే ‘మీరు డైరెక్ట్ చేయండి, నేను సినిమా చేస్తా’ అన్నారు. తమన్ ఈ సినిమాకి ప్రత్యేక శ్రద్ధతో ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ అందించాడు’’ అన్నారు. ‘‘రాజుగారు, కృష్ణగారు అవసరమైనవి యూనిట్‌కి సకాలంలో అందించి ఓ మంచి సినిమా చేయడానికి అందర్నీ ముందుకు నడిపారు’’ అని సాయిధరమ్ తేజ్ అన్నారు. ‘‘కృష్ణ అన్న తొలి సినిమాకు నేను సంగీతం అందించడం ఆనందంగా ఉంది. తమ్ముడు తేజూతో నాకిది నాలుగో సినిమా. పాటలు, సినిమా... ప్రేక్షకులను అలరిస్తాయి’’ అన్నారు తమన్. -
ఇంటికొక్కడు
‘‘దేశ రక్షణ కోసం జవాన్ కావాలి. ఒక్కో ఇంటికి జవాన్ లాంటి కొడుకు ఒకడు ఉండాలి. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ యువకుడు కష్టాలను ఎదురొడ్డి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడన్నదే ‘జవాన్’ కథ. అందుకే ‘ఇంటికొక్కడు’ అనే క్యాప్షన్ పెట్టాం. ఇది పక్కా ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్’’ అన్నారు దర్శకుడు బీవీయస్ రవి. సాయిధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా ఆయన దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై కృష్ణ నిర్మిస్తున్న ‘జవాన్’ టాకీపార్ట్ పూర్తయింది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్’ చిత్రాలతో తేజూకు మా బ్యానర్‌తో మంచి రిలేషన్ ఏర్పడింది. రవి జవాన్ స్టోరీ చెప్పినప్పుడు తేజూకు కరెక్ట్‌గా సరిపోతుంద నిపించింది. ఈ చిత్రంతో మా సన్నిహితుడు కృష్ణను నిర్మాతగా పరిచయం చేస్తున్నాం’’ అన్నారు. ‘‘రవి చెప్పిన యూనిక్, ఎంగేజింగ్, ఎంటర్టైనింగ్ స్టోరీ చాలా బాగా నచ్చింది’’ అని సాయిధరమ్ తేజ్ అన్నారు. ‘‘సాయిధరమ్ తేజ్ బాడీ లాంగ్వేజ్‌కి, ఇమేజ్‌కి సరిగ్గా సరిపోయే కథ ఇది’’ అన్నారు కృష్ణ.