ఇంటికొక్కడు
‘‘దేశ రక్షణ కోసం జవాన్ కావాలి. ఒక్కో ఇంటికి జవాన్ లాంటి కొడుకు ఒకడు ఉండాలి. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ యువకుడు కష్టాలను ఎదురొడ్డి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడన్నదే ‘జవాన్’ కథ. అందుకే ‘ఇంటికొక్కడు’ అనే క్యాప్షన్ పెట్టాం. ఇది పక్కా ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్‌టైనర్’’ అన్నారు దర్శకుడు బీవీయస్ రవి.
సాయిధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా ఆయన దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై కృష్ణ నిర్మిస్తున్న ‘జవాన్’ టాకీపార్ట్ పూర్తయింది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్’ చిత్రాలతో తేజూకు మా బ్యానర్‌తో మంచి రిలేషన్ ఏర్పడింది. రవి జవాన్ స్టోరీ చెప్పినప్పుడు తేజూకు కరెక్ట్‌గా సరిపోతుంద నిపించింది. ఈ చిత్రంతో మా సన్నిహితుడు కృష్ణను నిర్మాతగా పరిచయం చేస్తున్నాం’’ అన్నారు. ‘‘రవి చెప్పిన యూనిక్, ఎంగేజింగ్, ఎంటర్‌టైనింగ్ స్టోరీ చాలా బాగా నచ్చింది’’ అని సాయిధరమ్ తేజ్ అన్నారు. ‘‘సాయిధరమ్ తేజ్ బాడీ లాంగ్వేజ్‌కి, ఇమేజ్‌కి సరిగ్గా సరిపోయే కథ ఇది’’ అన్నారు కృష్ణ.