saidharamtej
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం
టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ మంచి మనసు చాటుకున్నారు. సీనియర్ నటి పావలా శ్యామల కష్టాల్లో ఉన్నట్లు తెలుసుకున్న ఆయన చలించిపోయారు. సాయం చేస్తానని గతంలో ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పలు ఆరోగ్య సమస్యల వల్ల వైద్య ఖర్చులకు ఇబ్బందులు పడుతున్న పావలా శ్యామాలకు రూ. లక్ష సాయం చేశారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా ఆ డబ్బును ఆమెకు అందించారు.పావలా శ్యామలతో సాయిధరమ్ తేజ్ కూడా వీడియో కాల్లో మాట్లాడారు. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. దీంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. 'గతంలో మా అమ్మాయికి ఆపరేషన్ అయిన సమయంలో సాయిధరమ్ తేజ్ నాకు ఫోన్ చేసి చాలా ధైర్యం చెప్పారు. త్వరలో వచ్చి కలుస్తానని చెప్పారు. కానీ, ఆయన రాలేదు. చాలా రోజులైపోయింది కాబట్టి నన్ను మర్చిపోయారనుకున్నాను. ఆయనకు ప్రమాదం జరిగినప్పుడు సురక్షితంగా బయటపడాలని దేవుడిని కోరుకున్నాను. దేవుడి దయ వల్ల అంతా మంచే జరిగింది. అయితే, నన్ను గుర్తుపెట్టుకొని సాయం చేసినందుకు తేజ్‌కు నా ధన్యవాదాలు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఆసుపత్రి ఖర్చులకు కూడా డబ్బు లేదు. దీంతో నా కూతురితో సహా చనిపోదామనుకున్నా..సమయానికి మీరు సాయం చేసి నాకూ, నా కూతురుకు ప్రాణభిక్ష పెట్టారు. అని సాయ్ ధరమ్ తేజ్‌తో వీడియో కాల్ మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు రూ.5 లక్షలు సాయిధరమ్‌తేజ్ విరాళం ఇచ్చారు. దానిలో భాగంగా రూ.లక్షను పావలా శ్యామలకు అందించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన సాయాన్ని కూడా ఆమె మరోసారి గుర్తుచేసుకున్నారు.We extend our heartfelt thanks to the mega supreme hero, @IamSaiDharamTej Garu, for donating 5 lakhs to our @FilmJournalistsWe are grateful. As part of this donation, 1 lakh was given to senior artist #PavalaShyamala Garu through our association, keeping the promise made by you… pic.twitter.com/1FYiUAKoOL— Telugu Film Journalists Association (@FilmJournalists) July 26, 2024 -
సినిమా ఈవెంట్స్ లో పర్సనల్ క్వశ్చన్స్
-
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌కు సుప్రీం హీరో సర్ప్రైజ్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కి మెగా గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. సాయ్ ధరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ప్రతి రోజు పండగే నుంచి విడుదల చేసిన రెండు పాటలు కూడా సూపర్బ్ రెస్పాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన బెస్ట్ ఫ్రెండ్ తమన్‌కు పాపులర్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ‘పెర్ల్ మాలెట్‌స్టేషన్’ ను గిఫ్ట్ గా అందించాడు. తమన్ స్వయంగా దీని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ''నా ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్ లవ్లీ పెర్ల్ మాలెట్ వర్క్‌స్టేషన్‌ను నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది నాకు చాలా పెద్ద సర్ప్రైజ్. ప్రతిరోజూ పండగే అన్న మాటను ఈయన నిజం చేసారు. సాయి చాలా మంచి వ్యక్తి. ఆయన సక్సెస్ కోసం ప్రార్ధిస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు. దీంతోపాటు లవ్లీ గిఫ్ట్ ఫొటోను కూడా షేర్ చేశారు. దీంతో వరుస హిట్లతో దూసుకుపోతున్న తమన్ మెగా హీరో అందించిన ఊహించని కానుకతో తెగ హ్యాపీగా ఫీలవుతున్నాడు. -
జవాన్ ప్రీమియర్ షో
-
ఓ కుర్రాడి కథ ఇది – ‘దిల్’ రాజు
‘ఆర్ఎస్ఎస్కు చెందిన ఓ కుర్రాడు తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఏం చేశాడన్నదే ‘జవాన్’ కథ. మంచి లవ్ అండ్ ఎంటర్టైనర్ మూవీ. ఇది దేశానికి సంబంధించిన కథ కాదు.. ఓ కుర్రాడి కుటుంబానికి చెందిన కథ. మా ప్రయత్నం డిసెంబర్ 1న ‘జవాన్’ రూపంలో విడుదలవుతుంది’’ అని చిత్ర సమర్పకుడు ‘దిల్’ రాజు అన్నారు. సాయిధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా బీవీయస్ రవి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జవాన్’. ‘దిల్’ రాజు సమర్పణలో కృష్ణ నిర్మించిన ఈ సినిమాలోని ఒక పాటని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. బీవీయస్ రవి మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు ఇటీవల చనిపోయారు. ఆయన తర్వాత నన్ను అలా గైడ్ చేసిన ‘దిల్’ రాజుగారికి థ్యాంక్స్. చాలా గ్యాప్ తర్వాత ‘జవాన్’ సినిమా డైరెక్ట్ చేయడానికి సాయిధరమ్ కూడా ఓ కారణం. కథ వినగానే ‘మీరు డైరెక్ట్ చేయండి, నేను సినిమా చేస్తా’ అన్నారు. తమన్ ఈ సినిమాకి ప్రత్యేక శ్రద్ధతో ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ అందించాడు’’ అన్నారు. ‘‘రాజుగారు, కృష్ణగారు అవసరమైనవి యూనిట్‌కి సకాలంలో అందించి ఓ మంచి సినిమా చేయడానికి అందర్నీ ముందుకు నడిపారు’’ అని సాయిధరమ్ తేజ్ అన్నారు. ‘‘కృష్ణ అన్న తొలి సినిమాకు నేను సంగీతం అందించడం ఆనందంగా ఉంది. తమ్ముడు తేజూతో నాకిది నాలుగో సినిమా. పాటలు, సినిమా... ప్రేక్షకులను అలరిస్తాయి’’ అన్నారు తమన్. -
సాయిధరమ్‌తేజ్ కొత్త సినిమా ఓపెనింగ్
-
అందుకే దృశ్యకావ్యం బాగా నచ్చింది
బెల్లం రామకృష్ణారెడ్డి ‘దృశ్యకావ్యం’ సినిమా దర్శకునిగా నా తొలి ప్రయత్నం. అయినా ప్రేక్షకులు కొత్తా పాతా అనే తేడా చూపకుండా నా ప్రయత్నాన్ని ఆదరించారు. అందుకు వారికి నా కృతజ్ఞతలు’’ అని బెల్లం రామకృష్ణారెడ్డి అన్నారు. కార్తీక్, కశ్మీర జంటగా స్వీయ దర్శకత్వంలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన ‘దృశ్యకావ్యం’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతున్న సందర్భంగా బెల్లం రామకృష్ణారెడ్డి చెప్పిన విశేషాలు... నేనీ సినిమా కోసం అనుకున్న స్క్రిప్ట్ వేరు... తీసిన సినిమా వేరు. నేను షూటింగ్ స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకున్నాక ‘రాజుగారి గది’ విడుదలైంది. అందుకే ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటే బాగుంటుందనుకున్నాను. పోస్టర్స్ ద్వారానే ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్పాలనుకున్నాను. అందుకే, పోస్టర్స్‌లో దెయ్యాన్ని చూపించాను. దాంతో ఇది హారర్, థ్రిల్లర్ మూవీ అని ఫిక్స్ అయి ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చారు. దెయ్యాన్ని పోస్టర్స్‌లో చూసి, సినిమాకు వచ్చిన వాళ్లల్లో కొంత మంది నిరాశ చెందిన మాట వాస్తవమే. వాళ్ల సంగతలా ఉంచితే, ఈ సినిమా చూసి నాకు తెలిసిన వాళ్లు, తెలియనవాళ్లు ఫోన్ చేసి నన్ను అభినందిస్తున్నారు. నేను స్వయంగా థియేటర్‌కు వెళ్లి సినిమా చూశాను. సెంటిమెంట్ సీన్స్‌కు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమాలో చిన్నపిల్లలను చూస్తూ ఉంటే తమ ఇంట్లోవాళ్లను చూస్తున్నట్టే అనిపిస్తోందని చాలామంది అన్నారు. ఆ విషయాన్ని కొంత మంది నా దగ్గర ప్రస్తావించారు కూడా. హీరో శ్రీకాంత్‌గారు కూడా నా ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. నేను దేనికైతే ప్రేక్షకులు రియాక్ట్ అవుతారనుకున్నానో, దానికే కనెక్ట్ అయ్యారు. హీరోయిన్ దృక్కోణంలో సినిమా చూపించడం చాలా మందికి బాగా నచ్చింది. ముఖ్యంగా సంగీత దర్శకుడు ‘ప్రాణం’ ఫేమ్ కమలాకర్ స్వరపరిచిన ఫ్లూట్ బిట్ అయితే చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. దర్శకుణ్ణి కావాలనే కోరికతోనే సినీ పరిశ్రమలో అడుగుపెట్టాను. నిర్మాతగా నాకిది మూడో చిత్రం. ‘భద్రమ్’ అనే తమిళ డబ్బింగ్ చిత్రం తర్వాత శ్రీకాంత్ హీరోగా ‘వీడికి దూకుడెక్కువ’ అనే చిత్రాన్ని నిర్మించాను. కానీ, ఆ చిత్రం విషయంలో డిస్ట్రిబ్యూటర్లు కొంత నిరాశ వ్యక్తం చేశారు. ఇక... నా లాంటి కొత్తవాళ్లు దర్శకత్వం వహించే చిత్రాలను ఎవరు చూడరు కదా. అందుకే ఎవరికీ నష్టం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని నేనే స్వయంగా పంపిణీ చేశాను. ‘దృశ్యకావ్యం’ కథకు మంచి స్కోప్ ఉంది. చివరికి ఎవరు చనిపోయారు? అనే విషయాన్ని రివీల్ చేశాక, దానికి తగ్గ కారణాలను కూడా డిస్కస్ చేయాలి. అందుకే ఫుల్ కన్‌క్లూషన్ ఇవ్వకుండా సీక్వెల్ తీస్తామని ప్రకటించాను. అయితే ఈ సినిమా తర్వాత వెంటనే మళ్లీ అదే జానర్లో సినిమా వస్తే కొత్త దర్శకుణ్ణి కాబట్టి నా మీద ఓ ముద్ర పడిపోతుంది. అందుకే సీక్వెల్‌ని ఇప్పట్లో తీయదల్చుకోలేదు. కొంత గ్యాప్ ఇచ్చి తీస్తాను. ప్రస్తుతం నా దగ్గర మూడు, నాలుగు కథలున్నాయి. నిఖిల్, సాయిధరమ్‌తేజ్‌లతో సినిమాలు చేద్దామనుకుంటున్నా. ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే అన్ని వివరాలూ వెల్లడిస్తాను. -
'సుప్రీమ్'గా ఇరగదీశాడు
-
'సుప్రీమ్'గా ఇరగదీశాడు
మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ లు సాధిస్తున్న యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలతో ఆకట్టుకున్న సాయి, 2016లోనూ అదే జోరు కొనసాగించడానికి ట్రై చేస్తున్నాడు. మెగా ఇమేజ్ కు తగ్గ మాస్ కథతో మరోసారి ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. అందుకే కొత్త సంవత్సరం కానుకగా తన కొత్త సినిమాను టీజర్ ను అభిమానులకు గిఫ్ట్ గా అందించాడు. ఫుల్ ఎనర్జీతో నిండిన ఈ టీజర్ మెగా అభిమానులను ఖుషి చేస్తోంది. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంతో సుప్రీమ్ సినిమాలో నటిస్తున్నాడు. మామయ్య చిరంజీవి స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో ఉన్న ట్యాగ్ ను ఇప్పుడు తను సొంతం చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే మాస్ లుక్స్ తో పాటు కామెడీ టైమింగ్ తోనూ ఆకట్టుకున్న సాయి మరోసారి తన మార్క్ చూపిస్తున్నాడని భావిస్తున్నారు. న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ అయిన టీజర్ తోనే అదే సిగ్నల్స్ ఇచ్చాడు. స్టైలిష్ యాక్షన్ సీక్వన్స్ లతో రూపొందిన సుప్రీమ్ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. -
సర్థార్ గబ్బర్‌సింగ్‌లో సుబ్రమణ్యం
-
సర్థార్ గబ్బర్‌సింగ్‌లో సుబ్రమణ్యం
లాంగ్ గ్యాప్ తరువాత పవర్ స్టార్ హీరోగా నటిస్తున్న'సర్థార్ గబ్బర్‌సింగ్' షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పవన్ మరోసారి పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాకు 'పవర' ఫేం బాబీ దర్శకుడు. పవన్ మిత్రుడు శరత్ మరార్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తొలిసారిగా కాజల్, పవన్‌తో జోడి కడుతుంది. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించి ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్లో హల్ చల్ చేస్తుంది. బ్రూస్ లీ రిలీజ్ సందర్భంగా పవన్‌ను కలవడానికి వెళ్లాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే ఆ సమయంలో సెట్లో పవన్, చరణ్‌లు దిగిన ఫోటోలు ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాయి. ఈ ఫోటోస్‌లో గబ్బర్‌సింగ్ యూనిట్ తో పాటు సాయిధరమ్ తేజ్ కూడా కనిపించటంతో అభిమానులు ఆలోచనలో పడ్డారు. సాయి మామూలు డ్రెస్ లోనే కనిపించి ఉంటే ఇంత చర్చ జరిగేది కాదేమో, చరణ్లాగా పవన్‌ను కలవడానికి వెళ్లాడని సరిపెట్టుకునేవారు. కానీ ఈ ఫోటోలలో సాయి కూడా పవన్ లాగే పోలీస్ డ్రెస్‌లో కనిపిస్తున్నాడు. దీంతో సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాలో సాయి కూడా నటిస్తున్నాడా అన్న టాక్ మొదలైంది. ఇప్పటి వరకు యూనిట్ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా అభిమానులు మాత్రం ఈ ఫోటోలతో పండగ చేసుకుంటున్నారు. -
మెగా హీరో మరో రీమిక్స్
మొదటి సినిమా నిరాశపరిచినా.. మొదట రిలీజ్ అయిన సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్. మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో మెగా ఇమేజ్ను బాగా క్యాష్ చేసుకుంటున్నాడు. తొలి సినిమా నుంచి ఈ ఫార్ములాను ఫాలో అవుతున్నాడు సాయి. సాయిధరమ్ తేజ్ హీరోగా పరిచయం అయిన 'రేయ్' సినిమాలో చిరంజీవి సూపర్ హిట్ పాట గోలీమార్ను రీమిక్స్ చేశాడు. ఇక రెండో సినిమా కోసం పవర్ స్టార్ పాటలోని పల్లవి 'పిల్లా నువ్వులేని జీవితం' టైటిల్‌గా ఫిక్స్ చేసుకున్నాడు. తరువాత ముచ్చటగా మూడో సినిమా విషయంలోనూ ఇదే ఫార్ములాను ఫాలో అయ్యాడు మెగా వారసుడు. 'ఖైది నెంబర్ 786' సినిమాలో సూపర్ హిట్ అయిన గువ్వా గోరింకతో పాటును 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమా కోసం రీమిక్స్ చేసి మరో సారి సక్సెస్ కొట్టాడు. తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం 'పటాస్' ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో 'సుప్రీమ్' సినిమాలో నటిస్తున్నాడు. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కూడా మరో చిరుపాట రీమేక్ కు రెడీ అవుతున్నాడు. 'యముడికి మొగుడు' సినిమాలో సూపర్ హిట్ అయిన అందం హిందోళం పాటను రీమిక్స్ చేయబోతున్నాడు. మరి ఈ రీమిక్స్ సెంటిమెంట్ సాయికి మరో హిట్ ఇస్తుందేమో చూడాలి. -
సత్తా చాటుతున్న సుబ్రమణ్యం
మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ ఎంటర్టైనర్ 'సుబ్రమణ్యం ఫర్ సేల్'. తొలి రోజు నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా మంచి కలెక్షన్లను సాధిస్తోంది. తొలి వారంలో రూ. 12.5 కోట్లు వసూలు చేసిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్' ఈ వీకెండ్ కు అన్ని ఏరియాల్లో లాభాలు సాధిస్తోందంటున్నారు ట్రేడ్ ఎనలిస్టులు. జూనియర్ ఎన్టీఆర్ తో 'రామయ్య వస్తావయ్యా..' లాంటి ఫ్లాప్ సినిమాను చేసిన దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇప్పటివరకు రెండు సినిమాలు మాత్రమే చేసిన సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ప్రస్తుతం 'సుబ్రమణ్యం ఫర్ సేల్' విజయాన్న ఎంజాయ్ చేస్తున్న సాయి త్వరలోనే అనీల్ రావిపూడి డైరెక్షన్ లో 'సుప్రీమ్' సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.