మెగా హీరో మరో రీమిక్స్ | Saidharamtej another chiranjeevi song remix for suprem | Sakshi
Sakshi News home page

మెగా హీరో మరో రీమిక్స్

Published Sun, Oct 11 2015 1:54 PM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

మెగా హీరో మరో రీమిక్స్ - Sakshi

మెగా హీరో మరో రీమిక్స్

మొదటి సినిమా నిరాశపరిచినా.. మొదట రిలీజ్ అయిన సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్. మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో మెగా ఇమేజ్ను బాగా క్యాష్ చేసుకుంటున్నాడు. తొలి సినిమా నుంచి ఈ ఫార్ములాను ఫాలో అవుతున్నాడు సాయి.

సాయిధరమ్ తేజ్ హీరోగా పరిచయం అయిన 'రేయ్' సినిమాలో చిరంజీవి సూపర్ హిట్ పాట గోలీమార్ను రీమిక్స్ చేశాడు. ఇక రెండో సినిమా కోసం పవర్ స్టార్ పాటలోని పల్లవి 'పిల్లా నువ్వులేని జీవితం' టైటిల్గా ఫిక్స్ చేసుకున్నాడు. తరువాత ముచ్చటగా మూడో సినిమా విషయంలోనూ ఇదే ఫార్ములాను ఫాలో అయ్యాడు మెగా వారసుడు. 'ఖైది నెంబర్ 786' సినిమాలో సూపర్ హిట్ అయిన గువ్వా గోరింకతో పాటును 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమా కోసం రీమిక్స్ చేసి మరో సారి సక్సెస్ కొట్టాడు.

తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం 'పటాస్' ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో 'సుప్రీమ్' సినిమాలో నటిస్తున్నాడు. దిల్రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కూడా మరో చిరుపాట రీమేక్ కు రెడీ అవుతున్నాడు. 'యముడికి మొగుడు' సినిమాలో సూపర్ హిట్ అయిన అందం హిందోళం పాటను రీమిక్స్ చేయబోతున్నాడు. మరి ఈ రీమిక్స్ సెంటిమెంట్ సాయికి మరో హిట్ ఇస్తుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement