'సుప్రీమ్'ను మెచ్చిన చిరు! | Chiranjeevi Garu thoroughly enjoyed the movie last night, Sai dharam tej | Sakshi
Sakshi News home page

'సుప్రీమ్'ను మెచ్చిన చిరు!

Published Thu, May 5 2016 10:57 AM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM

'సుప్రీమ్'ను మెచ్చిన చిరు! - Sakshi

'సుప్రీమ్'ను మెచ్చిన చిరు!

హైదరాబాద్: పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల తరువాత మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన మూవీ సుప్రీమ్. ఈ మూవీని మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న రాత్రి స్పెషల్ షో చూశారు. ఈ విశేషాలపై సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. తన లేటెస్ట్ మూవీ 'సుప్రీమ్'ను మావయ్య చిరంజీవి నిన్న రాత్రి చూసి ఎంజాయ్ చేశారని పేర్కొంటూ తన ఆనందాన్ని అభిమానులతో సాయి ధరమ్ పంచుకున్నాడు. ఈరోజు విడుదలవుతున్న తన మూవీ సక్సెస్ అవ్వాలని చిరంజీవి తనను, మూవీ యూనిట్ ను ఆశీర్వదించారని చెప్పాడు. అందుకు మామ చిరుకు ధన్యవాదాలు తెలుపుతూ యంగ్ హీరో ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు.


సాయిధరమ్‌తేజ్, రాశీ ఖన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ‘సుప్రీమ్’  నేడు విడుదల కానున్న విషయం తెలిసిందే. చిరంజీవి హిట్ మూవీ ‘యముడికి మొగుడు’లోని పాపులర్ సాంగ్ 'అందం హిందోళం... అధరం తాంబూలం...' ఇందులో రీమిక్స్ చేయడం అభిమానులను ఆకట్టుకుంటుందని సాయి ధరమ్ తో పాటు యూనిట్ భావిస్తోంది. ఈ మూవీ అందర్నీ అలరించే ఓ మాస్ ఎంటర్‌టైనర్. వేసవి సెలవుల్లో కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని యూనిట్ చెబుతోంది. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 1న రిలీజ్ చేయాలని భావించినా, భారీ సినిమాలు బరిలో ఉండటంతో వాయిదా వేయక తప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement