remix
-
Raja Saab ఆ హీరో సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నారా?
-
టిక్‌టాక్‌లా మారుతోన్న ఇన్స్టాగ్రామ్
ప్రపంచంలో షార్ట్ వీడియో పరంగా టిక్‌టాక్‌కు ఉన్న క్రెజ్ వేరొక యాప్ కు లేదని చెప్పుకోవాలి. కరోనా సమయంలో దీని వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ టిక్‌టాక్ వల్ల సామాన్యులు కూడా సెలబ్రిటీ లాగా మారిపోయారు. భారత్ లో టిక్‌టాక్‌పై నిషేధం విదించాక ఆ మార్కెట్ ను క్యాష్ చేసుకోవాలని చాలా కంపనీలు ప్రయత్నించాయి. ఇన్స్టాగ్రామ్ కూడా అందులో ఒకటి, అందుకే టిక్‌టాక్ రీతిలో కంటెంట్ అందించడానికి ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే ఇన్స్టాగ్రామ్ రీమిక్స్ అనే క్రొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ రీమిక్స్ ఫీచర్ టిక్‌టాక్‌లో ఉన్న ‘డ్యూయట్’ ఆప్షన్ మాదిరిగానే ఉండటం విశేషం. రీమిక్స్ సహాయంతో టిక్‌టాక్‌ను పోలినట్లే డ్యూయట్ వీడియోలు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ పబ్లిక్ టెస్టింగ్‌లో ఉంది, కాబట్టి కొంతమంది ఇన్స్టాగ్రామ్ యూజర్లు మాత్రమే అందుబాటులో ఉంది. చదవండి: వాళ్లందరికీ పన్ను మినహాయింపు: నిర్మలా సీతారామన్ ఏటీఎం: కార్డు లేకుండానే నగదు విత్ డ్రా -
రెహమాన్‌కి కోపమొచ్చింది
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కి కోపమొచ్చింది. దానికి కారణం ఓ రీమిక్స్ పాట. ‘ఢిల్లీ6’ సినిమా కోసం ‘‘మసక్కలీ మసక్కలీ..’ అనే పాటను రెహమాన్ కంపోజ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ పాట బ్లాక్ బస్టర్. సినిమా క్రేజ్‌ని రెండింతలు చేసిన పాట అది. తాజాగా ‘మసక్కలీ 2.0’ అంటూ ఆ పాటను మ్యూజిక్ డైరెక్టర్ తనిష్క్ బగ్చి రీమిక్స్ చేశారు. ‘నాకు రీమిక్స్ పాటల సంçస్కృతి నచ్చదు’ అని పలు సందర్భాల్లో రెహమాన్ చెప్పారు. తాజాగా ఈ ‘మసక్కలీ 2.0’ ఆయన్ను అసహనానికి గురి చేసినట్టుంది. అందుకే తన ట్వీటర్లో ‘ఒరిజినల్ పాటల్నే ఎంజాయ్ చేయండి’ అని ట్వీట్ చేశారు. అలాగే ‘ఎన్నో నిద్ర లేని రాత్రులు పాటల్ని రాస్తూ, నచ్చకపోతే మళ్లీ రాసి, సుమారు 200 మంది సంగీత కళాకారులు 365 రోజులు గొప్ప సంగీతాన్ని అందించాలని కృషి చేస్తేనే తరాలు నిలబడే పాట పుడుతుంది’ అని చిన్న లేఖ కూడా జత చేశారు. అది మాత్రమే కాదు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘కోపాన్ని నియంత్రించుకునేవారే నిజమైన మనిషి’ అంటూ ఓ ఫొటో షేర్ చేశారు. సాధారణంగా చాలా సౌమ్యంగా ఉండే రెహమాన్ సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేశారంటే ఆయన ఎంత అప్ సెట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. -
కోలీవుడ్‌లో ‘బ్లాక్‌బస్టర్’ రీమిక్స్
ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా టెంపర్. ఈ సినిమాలో విశాల్ హీరోగా అయోగ్య పేరుతో కోలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా స్టిల్స్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. అల్లు అర్జున్ సరైనోడు సినిమాలో బ్లాక్ బస్టర్ సాంగ్‌ను అయోగ్యలో రీమిక్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సరైనోడు సినిమా రీమేక్ రైట్స్ కూడా విశాల్ దగ్గరే ఉండటంతో బ్లాక్ బస్టర్ పాటను రీమిక్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పాటతో విశాల్ తో పాటు శ్రద్ధాదాస్ ఆడిపాడనుంది. -
చిరు పాటకు పవన్ స్టెప్పులు
వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోలు వాళ్ల తండ్రులు, తాతలు చేసిన పాటలను రీమిక్స్ చేయటం టాలీవుడ్లో తరుచుగా కనిపిస్తుంది. నందమూరి, అక్కినేని, మెగా ఫ్యామిలీల నుంచి వచ్చిన అందరు హీరోలు దాదాపుగా ఈ ఫార్ములాను ఫాలో అయిన వాళ్లే. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు మెగాస్టార్ చిరంజీవి పాటను రీమిక్స్ చేయలేదు. స్వతహాగా పాత పాటలను ఇష్టపడే పవర్ స్టార్ పాత సినిమా పాటలను రీమిక్స్ చేసినా ఎప్పుడూ చిరు పాటను మాత్రం వాడలేదు. తన తరువాత ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్‌లు మాత్రం మెగా పాటలను తెగ వాడేస్తున్నారు. దీంతో సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాతో తను కూడా అదే పని చేయడానికి ఫిక్స్ అయ్యాడు పవన్ కళ్యాణ్. 80లలో చిరు ఆడి పాడిన ఓ పాటు తన నెక్ట్స్ సినిమా కోసం రీమిక్స్ చేస్తున్నాడు. చిరంజీవి, రాధ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'కొండవీటి రాజా' సినిమాలోని 'నా కోక బాగుందా.. నా రైక బాగుందా..' అనే పాటను సర్థార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం పవన్ రీమిక్స్ చేస్తున్నాడు. ఈ పాటలో పవన్ సరసన లక్ష్మీ రాయ్ ఆడిపాడుతుంది. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా చిరు పాటకు పవన్ చిందులు కన్ఫామ్ అంటున్నారు మెగా ఫ్యాన్స్. -
మెగా హీరో మరో రీమిక్స్
మొదటి సినిమా నిరాశపరిచినా.. మొదట రిలీజ్ అయిన సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్. మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో మెగా ఇమేజ్ను బాగా క్యాష్ చేసుకుంటున్నాడు. తొలి సినిమా నుంచి ఈ ఫార్ములాను ఫాలో అవుతున్నాడు సాయి. సాయిధరమ్ తేజ్ హీరోగా పరిచయం అయిన 'రేయ్' సినిమాలో చిరంజీవి సూపర్ హిట్ పాట గోలీమార్ను రీమిక్స్ చేశాడు. ఇక రెండో సినిమా కోసం పవర్ స్టార్ పాటలోని పల్లవి 'పిల్లా నువ్వులేని జీవితం' టైటిల్‌గా ఫిక్స్ చేసుకున్నాడు. తరువాత ముచ్చటగా మూడో సినిమా విషయంలోనూ ఇదే ఫార్ములాను ఫాలో అయ్యాడు మెగా వారసుడు. 'ఖైది నెంబర్ 786' సినిమాలో సూపర్ హిట్ అయిన గువ్వా గోరింకతో పాటును 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమా కోసం రీమిక్స్ చేసి మరో సారి సక్సెస్ కొట్టాడు. తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం 'పటాస్' ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో 'సుప్రీమ్' సినిమాలో నటిస్తున్నాడు. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కూడా మరో చిరుపాట రీమేక్ కు రెడీ అవుతున్నాడు. 'యముడికి మొగుడు' సినిమాలో సూపర్ హిట్ అయిన అందం హిందోళం పాటను రీమిక్స్ చేయబోతున్నాడు. మరి ఈ రీమిక్స్ సెంటిమెంట్ సాయికి మరో హిట్ ఇస్తుందేమో చూడాలి.