టిక్‌టాక్‌లా మారుతోన్న ఇన్‌స్టాగ్రామ్ | Instagram officially launches Remix on Reels | Sakshi
Sakshi News home page

టిక్‌టాక్‌లా మారుతోన్న ఇన్‌స్టాగ్రామ్

Published Fri, Apr 2 2021 7:39 PM | Last Updated on Fri, Apr 2 2021 9:05 PM

Instagram officially launches Remix on Reels - Sakshi

ప్రపంచంలో షార్ట్ వీడియో పరంగా టిక్‌టాక్‌కు ఉన్న క్రెజ్ వేరొక యాప్ కు లేదని చెప్పుకోవాలి. కరోనా సమయంలో దీని వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ టిక్‌టాక్‌ వల్ల సామాన్యులు కూడా సెలబ్రిటీ లాగా మారిపోయారు. భారత్ లో టిక్‌టాక్‌పై నిషేధం విదించాక ఆ మార్కెట్ ను క్యాష్ చేసుకోవాలని చాలా కంపనీలు ప్రయత్నించాయి. ఇన్‌స్టాగ్రామ్ కూడా అందులో ఒకటి, అందుకే టిక్‌టాక్‌ రీతిలో కంటెంట్ అందించడానికి ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే ఇన్‌స్టాగ్రామ్ రీమిక్స్ అనే క్రొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ రీమిక్స్ ఫీచర్ టిక్‌టాక్‌లో ఉన్న ‘డ్యూయట్‌’ ఆప్షన్‌ మాదిరిగానే ఉండటం విశేషం. రీమిక్స్‌ సహాయంతో టిక్‌టాక్‌ను పోలినట్లే డ్యూయట్‌ వీడియోలు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ పబ్లిక్ టెస్టింగ్‌లో ఉంది, కాబట్టి కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు మాత్రమే అందుబాటులో ఉంది.

చదవండి:

వాళ్లందరికీ పన్ను మినహాయింపు: నిర్మలా సీతారామన్

ఏటీఎం: కార్డు లేకుండానే నగదు విత్ డ్రా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement