
సత్తా చాటుతున్న సుబ్రమణ్యం
మెగా మేనల్లుడు సాయిధరమ్తేజ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ ఎంటర్టైనర్ 'సుబ్రమణ్యం ఫర్ సేల్'. తొలి రోజు నుంచే హిట్ టాక్తో దూసుకుపోతున్న ఈ సినిమా మంచి కలెక్షన్లను సాధిస్తోంది. తొలి వారంలో రూ. 12.5 కోట్లు వసూలు చేసిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్' ఈ వీకెండ్ కు అన్ని ఏరియాల్లో లాభాలు సాధిస్తోందంటున్నారు ట్రేడ్ ఎనలిస్టులు.
జూనియర్ ఎన్టీఆర్ తో 'రామయ్య వస్తావయ్యా..' లాంటి ఫ్లాప్ సినిమాను చేసిన దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇప్పటివరకు రెండు సినిమాలు మాత్రమే చేసిన సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. ప్రస్తుతం 'సుబ్రమణ్యం ఫర్ సేల్' విజయాన్న ఎంజాయ్ చేస్తున్న సాయి త్వరలోనే అనీల్ రావిపూడి డైరెక్షన్ లో 'సుప్రీమ్' సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.