సర్థార్ గబ్బర్సింగ్లో సుబ్రమణ్యం | Saidharamtej on Pawankalyan sarddar gabbarsingh set | Sakshi
Sakshi News home page

సర్థార్ గబ్బర్సింగ్లో సుబ్రమణ్యం

Published Sun, Oct 18 2015 8:50 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

సర్థార్ గబ్బర్సింగ్లో సుబ్రమణ్యం - Sakshi

సర్థార్ గబ్బర్సింగ్లో సుబ్రమణ్యం

లాంగ్ గ్యాప్ తరువాత పవర్ స్టార్ హీరోగా నటిస్తున్న'సర్థార్ గబ్బర్సింగ్' షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పవన్ మరోసారి పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాకు 'పవర' ఫేం బాబీ దర్శకుడు. పవన్ మిత్రుడు శరత్ మరార్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తొలిసారిగా కాజల్, పవన్తో జోడి కడుతుంది.

భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించి ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్లో హల్ చల్ చేస్తుంది. బ్రూస్ లీ రిలీజ్ సందర్భంగా పవన్ను కలవడానికి వెళ్లాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే ఆ సమయంలో సెట్లో పవన్, చరణ్లు దిగిన ఫోటోలు ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాయి. ఈ ఫోటోస్లో గబ్బర్సింగ్ యూనిట్ తో పాటు సాయిధరమ్ తేజ్ కూడా కనిపించటంతో అభిమానులు ఆలోచనలో పడ్డారు.

సాయి మామూలు డ్రెస్ లోనే కనిపించి ఉంటే ఇంత చర్చ జరిగేది కాదేమో, చరణ్లాగా పవన్ను కలవడానికి వెళ్లాడని సరిపెట్టుకునేవారు. కానీ ఈ ఫోటోలలో సాయి కూడా పవన్ లాగే పోలీస్ డ్రెస్లో కనిపిస్తున్నాడు. దీంతో సర్థార్ గబ్బర్సింగ్ సినిమాలో సాయి కూడా నటిస్తున్నాడా అన్న టాక్ మొదలైంది. ఇప్పటి వరకు యూనిట్ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా అభిమానులు మాత్రం ఈ ఫోటోలతో పండగ చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement