Will Nayanthara wear a Bikini in Jawaan Movie? - Sakshi
Sakshi News home page

Nayanthara: ఆ హీరో కోసం బికినీకి నయనతార గ్రీన్ సిగ్నల్.. అందుకే భారీ రెమ్యునరేషన్‌

Published Wed, Mar 22 2023 2:16 PM | Last Updated on Wed, Mar 22 2023 3:37 PM

Nayanthara Wear Bikini In Jawaan Movie - Sakshi

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఏ సన్నివేశంలో నటించటానికైనా రెడీగా ఉండాలి. ఇక కమర్షియల్ సినిమాలకు హీరోయిన్ గ్లామర్ బాగా ప్లస్ అవుతుంది. ఈ నాటి స్టార్‌ హీరోయిన్స్ అందరూ కెరీర్ స్టార్టింగ్ లో అందాలు ఒలకబోసివారే. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు.....ఇంటిమేట్ సీన్స్ లో వారి టాలెంట్ చూపించారు. గ్లామర్ షో చేయటానికి ఇష్టపడే హీరోయిన్స్ కూడా బికినీ డ్రెస్ లో నటించటానికి నో చెబుతారు. కొంతమంది హీరోయిన్స్ మాత్రమే బికినీ ధరించి ప్రేక్షకులకి ట్రీట్ ఇస్తారు. 

వారిలో సౌతిండియా లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకరు. అయితే గత కొంతకాలంగా నయనతార రోమాంటిక్ సన్నివేశాలకు...బోల్డ్ అటెంప్ట్ లకు దూరంగా ఉంటుందనే చెప్పాలి. అయితే నయనతార కెరీర్ స్టార్టింగ్ లో యూత్ ను తన గ్లామర్ తోనే ఆకట్టుకుంది. ఎక్కువ కమర్షియల్ మూవీస్ లో నటించిన నయనతార తన అందాలతో కనువిందు చేయటానికి ఏ మాత్రం వెనకడుగు వేసేది కాదు. అజిత్  బిల్లా సినిమాలో నయనతార బికినీ ధరించి కనిపించింది. 

అలాగే శింబు వల్లభ సినిమాలో లిప్ లాక్ సీన్స్ తో నటించటమే కాదు..ఇంటిమేట్ సన్నివేశాల్లో కూడా నటించింది. అలా నయనతార తనని తాను స్టార్ హీరోయిన్ గా ఎస్టాబ్లిస్ చేసుకుంది. ఆ తర్వాత వుమెన్ సెంట్రిక్ సినిమాలవైపు టర్న్ తీసుకుని తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.  ఇన్నాళ్లు సౌత్ మూవీస్ చేసిన నయన్.. షారుఖ ఖాన్ జవాన్  సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెడుతోంది.

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్‌ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నయనతార గతంలో ఎప్పుడూ లేని విధంగా జవాన్ సినిమాలు కనిపించబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆమె గ్లామర్ షో కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతుందట. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లోనే ఆమె స్టన్ అయ్యేలా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. షారూఖ్‌ ప్రతి సినిమాలో ఇంటిమేట్ సీన్స్ తప్పకుండా కనిపిస్తాయి.

రీసెంట్ గా పఠాన్‌ సినిమాలో హీరోయిన్ దీపికా పదుకునేతో చాలా ఘాటు సీన్స్ ఉన్నాయి. అలాగే బేషరమ్ సాంగ్ లో దీపికా బికినీ వేసుకుని నటించింది. అలాగే జవాన్ లో కూడా హీరోయిన్ క్యారెక్టర్ లో ఆ రేంజ్ గ్లామర్ షో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దీంతో నయన్ బికినీ సీన్ చేయబోతుందనే టాక్  బీటౌన్ లోనే కాదు చెన్నైలో కూడా వినిపిస్తోంది. బికినీ సీన్లు ఉన్నాయి కాబట్టే.. రెమ్యునరేషన్‌ కూడా భారీగా తీసుకుందట నయన్‌. ప్రతి సినిమాకు రూ.6 నుంచి 7 కోట్ల వరకు తీసుకునే నయన్‌.. జవాన్‌ కోసం ఏకంగా రూ. 10 కోట్లు డిమాండ్‌ చేసిందట. ఇందులో నిజమెంత ఉందనేది తెలియదు. ఒకవేళ నయన్ జవాన్ లో బికినీ కనిపిస్తే ..సిల్వర్ స్క్రీన్ షేక్ అయిపోవటం మాత్రం గ్యారెంటీ. జవాన్ మూవీని అక్టోబర్  లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement