
వెండితెర ‘జవాన్’కు రీసెంట్‌గా బై బై చెప్పారు హీరోయిన్ దీపికా పదుకొనె. షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘జవాన్’. విజయ్ సేతుపతి, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల చెన్నైలో ప్రారంభించిన ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌లో షారుక్, దీపికా, విజయ్ సేతుపతిలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించింది యూనిట్. ప్రస్తుతం ‘జవాన్’ షూటింగ్ జరుగుతున్నప్పటికీ దీపిక పాత్ర చిత్రీకరణ పూర్తయింది.
దీంతో యూనిట్‌కి బై బై చెప్పారామె. ఈ సినిమాలో షారుక్ ద్విపాత్రాభినయం చేశారనీ, అందులో ఒక షారుక్‌కి భార్య పాత్రలో దీపికా నటించార ని టాక్. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర ఎక్కువగా ఉండదట. ఓ అతిథి పాత్ర అని బాలీవుడ్ టాక్. కాగా ‘జవాన్’ కాకుండా ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, షారుక్ ఖాన్ ‘పఠాన్’, రణ్‌వీర్ సింగ్ ‘సర్కస్’, హృతిక్ రోషన్ ‘ఫైటర్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు దీపికా పదుకొనె.
Comments
Please login to add a commentAdd a comment