జవాన్‌ డైరెక్టర్‌పై నయన్ అసంతృప్తి.. కారణం అదేనా..!! | Sakshi
Sakshi News home page

Nayanthara: అట్లీ తీరుపై కోపంగా నయన్.. ఆమెనే హైలెట్‌ కావడంపై చర్చ!

Published Thu, Sep 21 2023 11:06 AM

Nayanthara upset with Atlee Sources say no more Act Bollywood films - Sakshi

లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే జవాన్‌ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ ఖాన్ సరసన కనిపించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. కేవలం ఇండియాలోనే ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ చిత్రంలో నయన్ నటనపై ప్రశంసలు వస్తున్నాయి. ఆమె యాక్షన్‌ సన్నివేశాలతో సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

(ఇది చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి!)

అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె సైతం కీలక పాత్రలో కనిపించింది. ఆమె పాత్ర కొద్దిసేపే అయినప్పటికీ ప్రేక్షకులను మెప్పించింది. ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో ఓ చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో నయనతారకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదనే వార్త వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మూవీ డైరెక్టర్ అట్లీపై నయన్‌ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీపికా పదుకొణె అతిథి పాత్రలో కనిపించినా.. ఆమెకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని కోలీవుడ్‌ లేటెస్ట్ టాక్. 

నయనతార అసంతృప్తిగా ఉందా?

తాజా బజ్‌ ప్రకారం జవాన్‌లో  అతిథి పాత్ర పోషించిన దీపికా పదుకొణెకు దక్కిన ప్రాధాన్యత నయనతారకు ఇవ్వలేదని సమాచారం. ఈ విషయంలో నయనతార అట్లీ తీరు పట్ల కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భవిష్యత్తులో బాలీవుడ్ చిత్రాల్లో నయన్ నటించకూడదని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

అందుకే ప్రమోషన్లకు దూరం?

జావాన్ సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్లలో నయన్ కనిపించక పోవడం ఇదే ప్రధాన కారణమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. షారుక్-నయనతార జవాన్ కాస్తా దీపికా- షారుక్ మూవీగా మారిపోయిందంటున్నారు. అంతే కాకుకండా గత వారం ముంబైలో జరిగిన సక్సెస్ మీట్‌లో విలన్‌గా నటించిన విజయ్ సేతుపతితో సహా అందరూ హాజరైనప్పటికీ నయన్ సక్సెస్ మీట్‌కు కూడా హాజరు కాలేదు.

(ఇది చదవండి: 6 ఏళ్ల తర్వాత పర్సనల్‌ ఫోటోలు బయటకు ఎలా వచ్చాయి?: రాహుల్‌) 

దక్షిణాదిలో ఆమెనే!

అయితే మరికొందరేమో దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. ఇదంతా నిజం కాదని కొట్టి పారేస్తున్నారు. గతంలోనూ నయనతార ఎప్పుడూ సినిమా ఈవెంట్‌లకు వెళ్లలేదంటున్నారు. గతంలో ఆమెకు ఎదురైన చేదు అనుభవాల కారణంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెబుతున్నారు. కేవలం నటించడమే తన పని నయన్ భావిస్తారని అంటున్నారు. అయితే ఈ సినిమాకు నయనతార దాదాపు రూ.10 నుంచి 11 కోట్ల వరకు భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది హీరోయిన్లలో ఇప్పటివరకు ఇంత భారీ పారితోషికం తీసుకోలేదని సమాచారం. 

Advertisement
 
Advertisement
 
Advertisement