
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన చిత్రం విడుదలై చాలా రోజులైంది. కనెక్ట్ చిత్రం తర్వాత నయనతార తెరపై కనిపించలేదు. ఈ చిత్రం కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. అదే సమయంలో పారితోషికాన్ని పెంచుకుంటూనే పోతున్నారు.
(ఇది చదవండి: స్టార్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక మిమ్మల్ని చూడలేనంటూ!)
ఈ సంచలన భామ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి నటించిన తొలి చిత్రం జవాన్. షారుక్ ఖాన్ కథానాయకుడిగా నటించిన ఇందులో ప్రతినాయకుడిగా నటించారు. ఇక క్రేజీ బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొనే కూడా ఈ చిత్రంలో నటించడం విశేషం. కాగా కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
దర్శకుడు అట్లీకి నటి నయనతార లక్కీ హీరోయిన్ అనే చెప్పాలి. ఈయన తొలి చిత్రం రాజారాణిలో నయనతారనే కథానాయకి. ఆ తర్వాత విజయ్ కథానాయకుడిగా రూపొందించిన బిగిల్ చిత్రంలోని ఈమెనే హీరోయిన్. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా తన తొలి హిందీ చిత్రంలోను నయనతారనే కథానాయికగా తీసుకున్నారు. ఈ చిత్రంలో ఆమెకు రూ. 8 నుంచి 10 కోట్ల వరకు పారితోషికం ముట్ట జెప్పినట్లు సమాచారం. బాలీవుడ్ హీరోయిన్లతో పోస్తే ఇది తక్కువే అయినా దక్షిణాది హీరోయిన్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. కాగా జవాన్ తన తొలి హిందీ చిత్రం కావడంతో రిజల్ట్ కోసం లేడీ సూపర్ స్టార్ నయనతార ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
(ఇది చదవండి: జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు )
Comments
Please login to add a commentAdd a comment