
దేశానికి మనమేమిచ్చాం!
దేశం మనకేమిచ్చిందన్నది కాదు. దేశానికి మనమేమిచ్చాం అన్నది ముఖ్యం. అయినా మనలోని దేశభక్తి ఒకడు చెప్తే గుర్తుకు రాకూడదు. దేశభక్తి అనేది కిరీటం కాదు.. కృతజ్ఞత. ఇలా ఆలోచించే ఓ కుర్రాడు తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు జవాన్‌లా మారి శత్రువులపై యుద్ధం చేస్తాడు.
జవాన్ దేశభక్తి, దేశం కోసం అతనేం చేశాడు? అనేది సెప్టెంబర్ 1న విడుదల కానున్న ‘జవాన్’ని చూస్తే తెలుస్తుంది. సాయిధరమ్ తేజ్, మెహరీన్ జంటగా బీవీయస్ రవి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో కృష్ణ నిర్మించిన చిత్రం ‘జవాన్’. ‘‘ప్రతి ఇంటికీ మా హీరోలా ఒకరు ఉండాలని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. ఎమోషన్స్‌తో కూడిన చిత్రం. తేజ్ యాక్టింగ్ సూపర్బ్. తమన్ సంగీతం ప్రేక్షకులను అలరిస్తుంది. వచ్చే నెలలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శకుడు రవి.