
చర్ల: తెలంగాణ– ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాలకు చెందిన సుమారు 100 మంది ఆదివాసీ గిరిజనులను మావోయిస్టులు అదుపులోకి తీసుకున్నారు. ఐదు రోజులు గడిచినా వారిని వదలకపోవడంతో ఆదివాసీల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ– ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న పోలీసు క్యాంపులను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనల్లో అన్ని గ్రామాల ఆదివాసీలు, గిరిజనులు పాల్గొనాలని మావోయిస్టులు గతంలో పిలుపునిచ్చారు.
అయితే, వారు స్పందించకపోవడంతోనే మావోయిస్టులు ఆగ్రహించినట్లుగా తెలుస్తోంది. కాగా, మావోయిస్టులు పలువురిని బంధించిన విషయాన్ని తమకు చెప్పలేదనే కారణంతో శనివారం ఉదయం కుర్నపల్లికి వెళ్లిన సీఐ అశోక్, ఎస్సై రాజువర్మ పలువురు యువకులను చర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే సాయంత్రం వారిని విడుదల చేసి నట్లు విలేకరులకు సమాచారం ఇచ్చారు.
జవాన్‌ను హతమార్చిన మావోయిస్టులు
బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరో దారుణానికి ఒడిగట్టారు. గంగుళూరు పోలీ స్ స్టేషన్‌కు చెందిన జవాన్ అందో పోయం ను (49) శుక్రవారం కిడ్నాప్ చేసి తీసుకెళ్లా రు. శనివారం అతడిని హతమార్చి మృతదేహాన్ని గంగుళూరు రహదారిపై పడేశారు.
Comments
Please login to add a commentAdd a comment