
‘‘షారుక్ ఖాన్ కోసమే ‘జవాన్’ చిత్రంలో నటిస్తున్నాను. నాకు ఒక్క రూపాయి పారితోషికం ఇవ్వకపోయినా కూడా ఆయనతో కలిసి నటించేవాణ్ణి’’ అన్నారు నటుడు విజయ్ సేతుపతి. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వైవిధ్యమైన పాత్రలతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ‘ముంబైకర్’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల (జూన్ 2) విడుదలైంది.
ప్రస్తుతం ఆయన షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న హిందీ సినిమా ‘జవాన్’ లో విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ–‘‘షారుక్ అంటే నాకు అభిమానం. ఆయన కోసమే ‘జవాన్’లో విలన్‌గా చేస్తున్నా. నాకు పారితోషికం ఇవ్వకున్నా ఆయనతో కలిసి నటించేవాణ్ణి’’ అంటూ షారుక్ ఖాన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ‘జవాన్’ సినిమా సెప్టెంబర్ 7న విడుదలకానుంది. కాగా త్యాగరాజన్ కుమార్ రాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’ (2019) లో విజయ్ సేతుపతి నటనపై షారుక్ ఖాన్ గతంలో ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment