![Tamil Producer Complaint On Director Atlee For Plagiarized Shah Rukh Jawan - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/7/Director-Atlee12.jpg.webp?itok=kH593ZFi)
‘కింగ్ ఖాన్’ జవాన్ మూవీ చిక్కుల్లో పడింది. ఈ మూవీ డైరెక్టర్ అట్లీపై ఓ కోలీవుడ్ నిర్మాత ఫిర్యాదు చేసినట్లు తమిళ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా బాలీవుడ్ బాద్‌షా షారుక్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో హిందీలో జవాన్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో ఈ మూవీపై సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ తనదని, డైరెక్టర్ అట్లీ దానిని కాపీ కొట్టాడని కోలీవుడ్ నిర్మాత మాణిక్యం నారాయణన్ ఆరోపించాడు.
చదవండి: తండ్రి కాబోతున్న ప్రముఖ కమెడియన్, ‘అసలు పెళ్లెప్పుడు అయింది?’
అంతేకాదు డైరెక్టర్ అట్లీపై నిర్మాత మండలిలో ఫిర్యాదు చేసి జవాన్ టీంకి షాకిచ్చాడు. 2006లో తాము విజయ్ కాంత్ హీరోగా తెరకెక్కించిన ‘పేరరసు’ సినిమా కథనే అట్లీ ‘జవాన్’ పేరుతో హిందీలో నిర్మిస్తున్నాడంటూ ఆయన ఆరోపించాడు. అయితే ఈ సినిమాపై షారుక్ ఖాన్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. తమిళంలోనూ ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జవాన్ మూవీపై కాపీ రైట్ ఆరోపణలు రావడంతో బాద్‌షా ఫ్యాన్స్ ఆందోళన చేందుతున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు డైరెక్టర్ అట్లీ స్పందించకపోవడం గమనార్హం. మరి దీనిపై జవాన్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.
చదవండి: సమంత వ్యాధి గురించి అప్పుడే తెలిసింది, అయినా తానే స్వయంగా..: యశోద నిర్మాత
Comments
Please login to add a commentAdd a comment