remunarative price
-
ఒక్క రూపాయి ఇవ్వకపోయినా ఆయనతో కలిసి నటించేవాడిని: విజయ్ సేతుపతి
‘‘షారుక్ ఖాన్ కోసమే ‘జవాన్’ చిత్రంలో నటిస్తున్నాను. నాకు ఒక్క రూపాయి పారితోషికం ఇవ్వకపోయినా కూడా ఆయనతో కలిసి నటించేవాణ్ణి’’ అన్నారు నటుడు విజయ్ సేతుపతి. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వైవిధ్యమైన పాత్రలతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ‘ముంబైకర్’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల (జూన్ 2) విడుదలైంది. ప్రస్తుతం ఆయన షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న హిందీ సినిమా ‘జవాన్’ లో విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ–‘‘షారుక్ అంటే నాకు అభిమానం. ఆయన కోసమే ‘జవాన్’లో విలన్‌గా చేస్తున్నా. నాకు పారితోషికం ఇవ్వకున్నా ఆయనతో కలిసి నటించేవాణ్ణి’’ అంటూ షారుక్ ఖాన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ‘జవాన్’ సినిమా సెప్టెంబర్ 7న విడుదలకానుంది. కాగా త్యాగరాజన్ కుమార్ రాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’ (2019) లో విజయ్ సేతుపతి నటనపై షారుక్ ఖాన్ గతంలో ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. -
ఆచార్య: 20 నిమిషాల కోసం రూ. కోటి
ముంబై భామ పూజా హెగ్డే ఈ మధ్య కాలంలో పట్టిందంతా బంగారమే అవుతోంది. గతేడాది అలవైకుంఠపురములో సినిమాతో విజయం అందుకున్న ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం వరుసపెట్టి ఆఫర్లు వచ్చి వాలుతున్నాయి. ఇప్పటికే పూజా నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా.. ప్రభాస్‌తో కలిసి రాధే శ్యామ్ చిత్రంలో నటిస్తోంది. హిందీలో సల్మాన్ ఖాన్ తో ‘కభీ ఈద్ కభీ దీవాలి’, రణ్వీర్ సింగ్‌తో ‘సర్కస్’ చేస్తోంది. వీటితోపాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలోనూ ఈ బుట్టబొమ్మ తళుకున్న మెరవనున్న విషయం తెలిసిందే. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించనుండగా..ఆయన తనయుడు రామ్ చరణ్‌కు జోడీగా పూజా నటించనుంది. చదవండి: ఆ హీరోయిన్ కావాలంటున్న త్రివిక్రమ్! ఇదిలా ఉండగా వచ్చే అవకాశాలకు తగ్గట్టుగానే పూజా తన రెమ్యూనరేషన్‌ను కూడా సెట్ చేసుకుంటోంది. ఆచార్య స్క్రీన్ మీద ఆమె పాత్ర కేవలం 20 నిమిషాలే ఉండనుంది. అయితే సమయంతో సంబంధం లేకుండా 20 నిమిషాల పాత్ర కోసం పూజా కోటి రూపాయలు తీసుకోబోతుందటా. వినడానికి కొంచెం ఆశ్యర్యంగానే ఉన్నా ఇదే నిజం. ఇప్పుడు ఈ భామకు ఉన్న డిమాండ్ అలాంటిది మరి. ఇక ఆచార్యలో అందరూ బడా స్టార్స్ నటిస్తుండటంతో తను కూడా భారీగానే రెమ్యూనరేషనర్ తీసుకోవాలని పూజా భావించి కోటి డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు చిత్ర యూనిట్ కూడా సుముఖంగానే ఉండటంతో అక్షరాల కోటి రూపాయలకు ఆమెకు సమర్పించుకోనున్నారు. మరి అంత మొత్తంలో అందుకున్న పూజా క్యారెక్టర్ సినిమాలో ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఆచార్య విడుదలయయ్యే వరకు వేచి చూడాలి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. మే 7 విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. -
బిగ్‌బాస్: అభిజిత్ రెమ్యునరేషన్ ఎంతంటే..
తెలుగు బుల్లితెరపై 106 రోజులు వినోదాన్ని అందించిన బిగ్‌బాస్ సీజన్ 4 డిసెంబర్ 20న శుభంకార్డు పడిన విషయం తెలిసిందే. కరోనా కష్ట కాలంలో అసలు ఈ ఏడాది బిగ్‌బాస్ ఉంటుందో లేదో అనుకుంటున్న సమయంలో ఎంట్రీ ఇచ్చి అందరిని అలరించింది. 29 మంది కంటెస్టులతో ప్రారంభమైన బిగ్‌బాస్ సక్సెస్‌ఫుల్‌గా నాలుగో సీజన్‌ను పూర్తి చేసుకుంది. స్టార్ మా ప్రసారం చేసిన ఈ రియాలిటీ షో విజేతగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం ఫేమ్ అభిజిత్ నిలిచాడు. ఆదివారం అంగరంగ వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అభిజత్ బిగ్‌బాస్–4 ట్రోఫీ అందుకున్నాడు. 25 లక్షల ప్రైజ్‌మనీతోపాటు ఓ బైక్ గెలుచుకున్నాడు. అఖిల్ సార్థక్ రన్నరప్‌గా నిలిచాడు. మూడో స్థానంలో సోహైల్, నాలుగు, అయిదు స్థానాల్లో అరియానా, హారిక నిలిచారు. టాప్ 5 కంటెస్టెంట్లందరికిరు హౌజ్ నుంచి బయటకు వచ్చిన అనంతరం గ్రాండ్‌గా బ్యాండ్ బాజాలతో ఇంటికి పయనమయ్యారు. చదవండి: బిగ్‌బాస్: అభి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా కాగా అభిజిత్ తన వ్యక్తిత్వంతో షో ప్రారంభం నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులను దక్కించుకున్నాడు. చివరి వరకు అభిజిత్‌పై అదే అభిమానం కురిపిస్తూ అతన్ని విజయ తీరానికి నడిపించింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో కూడా అభిజిత్‌దే గెలుపు అంటూ పలువురు చెప్పిన జోస్యం, అంచనాలకు అనుగుణంగానే తుది ఫలితం ఉండడం విశేషం. ఇదిలా ఉండగా బిగ్‌బాస్ ముగిసినప్పటికీ ఈ షోకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా విన్నర్‌గా నిలిచిన అభిజిత్ షో మొత్తం రెమ్యునరేషన్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా విజేతగా నిలిచిన అభిజిత్ బిగ్‌బాస్ షో కోసం వారానికి 4 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం 106 రోజులకు 60 లక్షలు, ప్రైజ్ మనీ 25 లక్షలు కలిపి మొత్తం 85 లక్షలు అభికి మూటజెప్పినట్లు టాక్. వాస్తవానికి బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ కంటే హౌజ్‌లో ఉన్నందుకే అభి అధికంగా రెమ్యునరేషన్ అందుకున్నాడు. అదే విధంగా టీవీ యాంకర్ లాస్యకు ఒక వారానికి లక్ష రూపాయల చొప్పున తీసుకుంటున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ కూడా వారానికి ఏకంగా 2 లక్షలు డిమాండ్ చేసినట్లు వదంతులు వ్యాపించాయి. -
ఏదీ.. ధరల స్థిరీకరణ నిధి
దెందులూరు: ’రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం.. ఏడాదికి రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తాం..’ ఇవి ఎన్నికల ముందు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పిన మాటలు, మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలు. అయితే ఈ మాటలు నీటిమీద రాతలుగానే మిగిలాయి. టీడీపీ ప్రభుత్వ పాలనకు మూడేళ్లు నిండినా ధరల స్థిరీకరణ ఊసేలేదు. దీంతో జిల్లాలోని సుమారు 6 లక్షల మంది రైతులకు అప్పుల బాధలు తప్పడం లేదు. జిల్లాలో 6 లక్షల మంది రైతులు జిల్లాలో దాదాపు 6 లక్షల మంది రైతులు పలు రకాల పంటలు సాగుచేస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టో ప్రకారం మూడేళ్లకు రూ.15 వేల కోట్లు కేటాయించాల్సి ఉంది. అయితే ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. జిల్లాలో సుమారుగా వరి 5.50 లక్షల ఎకరాలు, మొక్కజొన్న లక్ష ఎకరాలు, మిర్చి 10 వేల ఎకరాలు, పొగాకు 30 వేల ఎకరాలు, కొబ్బరి 30 వేల ఎకరాలు, అరటి 25 వేల ఎకరాలు, నిమ్మ 25 వేల ఎకరాలు, పత్తి 8 వేల ఎకరాలు, ఆయిల్‌పామ్ 50 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ ధరను పరిగణనలోకి తీసుకోకుండా మద్దతు ధర ప్రకటిస్తోంది. ఆ మద్దతు ధర రైతుల వ్యవసాయ ఉత్పత్తుల ధర కంటే తక్కువ కావటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి తోడు కమీషన్‌దారులు, దళారుల వ్యవహారం మార్కెట్లో కీలకం కావడంతో వారిద్దరూ కుమ్మక్కై ధరలు తగ్గించి రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల వారీగా సమీక్ష, నియంత్రణ కొరవడటంతో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. దళారుల చేతిలో చిక్కుకుని.. మార్కెట్ వ్యవస్థ దళారుల చేతిలో చిక్కుకుపోయింది. ఓ పక్క గిట్టుబాటు ధర లేకపోవడం, మరో పక్క ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేయకపోవడంతో రైతులు, కౌలు రైతులు దళారుల చేతిలో బందీలుగా మారారు. జిల్లాకు వచ్చిన ప్రతిసారి సీఎం చంద్రబాబు జిల్లా రుణం తీర్చుకుంటాం అని పదేపదే చెబుతున్నా కనీసం స్థిరీకరణ నిధి ఏర్పాటుచేయకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ సంస్థలే కొనుగోలు చేయాలి రైతులు పండిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వ సంస్థలైన ఎఫ్‌సీఐ, మార్క్‌ఫెడ్, సివిల్ సప్లైస్ సంస్థలే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. వ్యవసాయంపైనే ఆధారపడ్డ లక్షలాది మంది రైతులకు, వారి కుటుంబాలకు న్యాయం చేయాలి. బి.నాని, రైతు, పోతునూరు నిల్వ సదుపాయం లేదు రైతు పండింని పంటకు నిల్వ చేసుకునే సౌకర్యం లేదు. ఈ దిశగా అధికారులు, ప్రజా ప్రతినిధులు తీవ్ర నిర్లక్ష్యాన్ని అవలంబిస్తున్నారు. దీంతో దళారులు, కమీషన్‌దారులు కుమ్మక్కై వారి చెప్పిన ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి తీసుకువస్తున్నారు. టి.జమలయ్య, రైతు శాశ్వత పరిష్కారం చూపాలి గిట్టు భాటు ధర అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులకు వ్యవసాయం భారంగా మారింది. రైతు పండించే ఉత్పత్తులకు ఆమోదయోగ్యమైన గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలి. తిరుపతి రంగారావు, కౌలు రైతు ఏడాదికి వెయ్యి కోట్లు నష్టం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయకపోవడంతో ఏటా జిల్లాలో ఆరు లక్షల మంది రైతులు సుమారు వెయ్యి కోట్ల వరకూ నష్టాన్ని చవిచూస్తున్నారు. దళారీ వ్యవస్థను నిరోధించటానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ప్రతి వ్యవసాయ ఉత్పత్తికి కష్టానికి తగ్గ ఫలితంగా గిట్టుబాటు ధర కల్పించాలి. కె.శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, కౌలు రైతుల సంఘం