KGF: Chapter 2 Day 3 Box Office Collection: Yash's Movie Crosses 400 Crore Club: - Sakshi
Sakshi News home page

KGF 2 Day 3 Collections: కేజీఎఫ్‌ 2 దూకుడుకు దద్దరిల్లుతున్న బాక్సాఫీస్‌

Published Sun, Apr 17 2022 4:00 PM | Last Updated on Mon, Apr 18 2022 7:57 AM

KGF Chapter 2: Day 3 Box Office Collection: Yash Movie Crosses 400 Crore Club - Sakshi

'ఒక్కసారి కమిట్‌ అయితే నా మాట నేనే వినను..' టాలీవుడ్‌ ఎంతో ఫేమస్‌ అయిన ఈ డైలాగ్‌ కేజీఎఫ్‌ 2కు కరెక్ట్‌గా సూటవుతుంది. బాక్సాఫీస్‌ మీద దండయాత్ర మొదలుపెట్టిన కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 కలెక్షన్ల సునామీని ఇప్పట్లో ఆపేదేలే అన్నట్లుగా దూసుకుపోతోంది. కన్నడ రాకింగ్‌ స్టార్‌ యశ్‌ హీరోగా, ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 సినిమాకు సౌత్‌ నుంచి నార్త్‌ దాకా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఏప్రిల్‌ 14న రిలీజైన ఈ చిత్రం అటు ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు మంచి వసూళ్లను కూడా రాబడుతోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.250 కోట్ల మేర రాబట్టిన ఈ మూవీ కేవలం మూడో రోజే మరో రూ.150 కోట్లు అలవోకగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా రిలీజైన మూడు రోజుల్లోనే కేజీఎఫ్‌ 2 ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది.

చదవండి: పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి గని, స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

టాలీవుడ్‌లో తొలిరోజు రూ.19 కోట్లకు పైగా షేర్‌ సాధించిన ఈ మూవీ వరుసగా రెండు, మూడు రోజుల్లో రూ.13 కోట్లు, రూ.10 కోట్లు రాబట్టింది. అటు బాలీవుడ్‌లోనూ రాఖీభాయ్‌ హవా కొనసాగుతోంది. హిందీలో రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రానికి మూడో రోజు రూ.43 కోట్ల మేర కలెక్షన్లు వచ్చాయి. వీకెండ్‌లో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

చదవండి: చిరంజీవి-చరణ్‌ వీడియోపై వర్మ సంచలన కామెంట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement