దేశరాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉదయం దట్టమైన పొగమంచు అలముకుంది. న్యూఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 6.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువ.
డిసెంబర్‌లో రెండోసారి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా శనివారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత తొమ్మిది డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది. శనివారం ఢిల్లీలో నాలుగు నుండి 10 కిలోమీటర్ల వేగంతో ఆగ్నేయ దిశ నుండి ఓ మోస్తరు గాలులు వీచే అవకాశం ఉంది. ఢిల్లీలో డిసెంబర్ 28 వరకు ఉదయం పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
గాలి దిశలో మార్పు, తగ్గిన వేగం కారణంగా రాజధాని మరోసారి గ్యాస్ ఛాంబర్‌గా మారింది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా జనం కళ్ల మంటలతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఎన్‌సిఆర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 409గా నమోదయ్యింది. ఇది తీవ్రమైన విభాగంలో ఉంది. ఇది గురువారం కంటే 48 సూచీలు ఎక్కువ. శుక్రవారం మధ్యాహ్నానికి కూడా సూర్యుడు కనిపించలేదు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఢిల్లీలోని 24 ప్రాంతాల్లో గాలి తీవ్రమైన కేటగిరీలో నమోదైంది.
ఇది కూడా చదవండి: ‘జనవరి 22.. ఆగస్టు 15 లాంటిదే’
Comments
Please login to add a commentAdd a comment