సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీల వరకు పెరిగాయి. గత 24 గంటల్లో నల్లగొండ, నిజామాబాద్‌లలో మినహా మిగిలిన ప్రాంతాల్లో పెరిగాయి. ఖమ్మంలో 4 డిగ్రీలు, భద్రాచలంలో 3 డిగ్రీలు ఎక్కువగా 32 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హన్మకొండ, హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, రామగుండంలలో 1 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా 31 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, హకీంపేట, నల్లగొండ, నిజామాబాద్‌లలో 29 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలావుంటే పలుచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలు నమోదుకాగా, మెదక్‌లో 12, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, రామగుండంలలో 14 డిగ్రీల చొప్పున రికార్డు అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment