ఔటర్‌పై నేటి నుంచి పెరగనున్న టోల్‌ చార్జీలు NHAI has announced a 5% increase in toll taxes effective from June 3. Sakshi
Sakshi News home page

ఔటర్‌పై నేటి నుంచి పెరగనున్న టోల్‌ చార్జీలు

Published Mon, Jun 3 2024 4:14 AM | Last Updated on Mon, Jun 3 2024 12:09 PM

increase road toll charges from June 3: Telangana

లక్డీకాపూల్‌: ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై టోల్‌ చార్జీలు భారీగా పెరగనున్నాయి. సోమవారం నుంచి పెంచిన టోల్‌ చార్జీలు 5 శాతం అమలులోకి రానున్నాయి. కారు, జీపు, వ్యాన్‌లకు ప్రతి కిలోమీటర్‌కి రూ.2.34 పైసలు, ఎల్‌సివి, మినీ బస్‌లకు రూ.3.77, బస్, 2–యాగ్జిల్‌ ట్రక్‌లకు రూ.6.69, భారీ నిర్మాణ మెషినరీ, ఎర్త్‌ మూ వింగ్‌ ఎక్విప్‌మెంట్‌లకు రూ.12.40, ఓవర్‌సైజ్డ్‌ వాహనాలకు రూ.15.09 చొప్పున టోల్‌ చార్జీలు పెరగనున్నాయి.

కొత్త టోల్‌ రేట్లు, రో జువారీ పాసులు, నెలవారీ పాసులు తదితరాలకు హెచ్‌ఎండిఏ వైబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా ఐఆర్‌బి గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే ప్రైవేట్‌ సంస్ధ నిర్వాహకులు సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement