దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగడంతో పాటు విపరీతంగా పొగమంచు కమ్ముకుంటోంది. అయితే చాలా రోజుల తర్వాత ఆదివారం కాస్త ఎండ కనిపించింది. అయితే సాయంత్రానికల్లా మళ్లీ చలి వివరీతంగా పెరిగింది.
పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీకి వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సహా 22 రైళ్లు ఆరు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. చలి కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో ఉదయం పూట ఈ వారం పొడవునా తేలికపాటి పొగమంచు కమ్ముకునే అవకాశం ఉంది. జనవరి 9న తేలికపాటి వర్షం లేదా చినుకులు పడవచ్చు.
ఢిల్లీలో శీతాకాల సెలవులను జనవరి 12 వరకు పొడిగించారు. అయితే ఇది ఐదవ తరగతిలోపు విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. 6 నుంచి 12 వ తరగతి విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల తరువాతనే వీరికి తరగతులు నిర్వహిస్తారు.
ఢిల్లీలో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 18.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది శనివారం కంటే మూడు డిగ్రీలు తక్కువ. కనిష్ట ఉష్ణోగ్రత 8.2 డిగ్రీలుగా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత తగ్గడం వల్ల వాయు కాలుష్యం తీవ్రమయ్యింది. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 333గా ఉంది. జమ్మూ డివిజన్‌లో దట్టమైన పొగమంచు కారణంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. 11 విమానాలు ఆలస్యంగా నడిచాయి.
Comments
Please login to add a commentAdd a comment