enter
-
బీహార్‌లోకి ప్రవేశించిన చలి
పట్నా: బీహార్‌లోకి చలి అప్పుడే ప్రవేశించింది. మరో రెండు మూడు రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని, ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పులు కనిపించబోవని వాతావరణ శాఖ తెలిపింది. అధిక తేమ కారణంగా రాష్ట్రాంలోని పలు జిల్లాల్లో ఉదయం వేళ పొగమంచు కమ్ముకుంటోంది.రాజధాని పట్నాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దీపావళికి ముందే గాలి నాణ్యత క్షీణించింది. పట్నా వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో తుఫాను గాలులు కొనసాగుతున్నాయి. ఫలితంగా బీహార్‌లోని ఈశాన్య ప్రాంతం మేఘావృతమై ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. గాలి దిశ పశ్చిమం వైపు కొనసాగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రత 31 నుండి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 20 నుండి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైంది. ఇది కూడా చదవండి: పుష్కర కాలానికి పూచే నీలకురంజి పుష్పం..! -
ఆ బ్యాటరీలు మన నెత్తిన పడతాయా?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్ఎస్) నుంచి మూడు టన్నుల బరువైన తొమ్మిది బ్యాటరీలు నేడు (శనివారం) భూమిపైకి దూసుకురానున్నాయి. 2021లో ఐఎస్ఎస్ నుంచి వేరుపడిన ఈ బ్యాటరీలు ఇప్పుడు భూమిపై పడనున్నాయి. దీనిపై పలువురు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత బరువైన ఎక్స్పోజ్డ్ ప్యాలెట్ 9 (ఈపీ9)ను 2021, మార్చి లో అంతరిక్ష కేంద్రం నుంచి తొలగించారు. దీనిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి పైకి విసిరిన అత్యంత భారీ వస్తువుగా గుర్తించారు. ఉపయోగించిన లేదా అనవసరమైన పరికరాలను ఈ విధంగా పారవేయడం అంతరిక్ష కేంద్రంలో సాధారణంగా జరుగుతుంటుంది. ఇవి భూ వాతావరణంలో ఎటువంటి హాని లేకుండా కాలిపోతాయి. ఈపీ9 దూసుకువచ్చే ముందు జర్మనీలోని నేషనల్ వార్నింగ్ సెంటర్ పౌర రక్షణ, విపత్తు ఉపశమనం కోసం ఈ సమాచారాన్ని విడుదల చేసింది. ‘మార్చి 8 మధ్యాహ్నం నుంచి, మార్చి 9 మధ్యాహ్నం మధ్య భారీ అంతరిక్ష శకలం భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది’ అని తెలిపింది. హార్వర్డ్-స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డోవెల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌లోని వివరాల ప్రకారం ఈ ఖగోళ వ్యర్థాలు మార్చి 9న ఉదయం 7:30 నుంచి మార్చి 9 ఉదయం 3:30 మధ్య భూ వాతావరణంలోకి ప్రవేశించనున్నాయి. పలు నివేదికల ప్రకారం ఈ బ్యాటరీలు భూమికి ఎటువంటి హాని కలిగించవు. ఎందుకంటే అవి భూ వాతావరణంలోకి ప్రవేశించగానే, కాలిపోయి బూడిదగా మారతాయి. అయితే వాటిలోని కొన్ని శకలాలు భూమికి చేరవచ్చు. అయితే వీటి వలన భూమికి ఎలాంటి హాని జరగదని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చెబుతోంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంతరిక్షం నుంచి దూసుకు వస్తున్న ఈ బ్యాటరీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అయితే ఇవి ఎక్కడ, ఎప్పుడు పడతాయనే దానిపై పలు అంచనాలు వేస్తోంది. దీనిపై ఖచ్చితమైన సమాచారం ఏజెన్సీకి ఇంకా అందుబాటులో రాలేదు. వాతావరణం తీరుతెన్నుల కారణంగా ఈ బ్యాటరీలు భూమిపై పడే ప్రాంతాన్ని ఖచ్చితంగా చెప్పడం శాస్త్రవేత్తలకు అసాధ్యంగా మారింది. అంతరిక్షం నుంచి భూమిపైకి శకలాలు దూసుకు రావడం కొత్తేమీ కాదు. ప్రతిరోజూ ఉపగ్రహాల నుండి వ్యర్థాలు భూమిపై పడుతుంటాయి. కొన్ని వేల సంవత్సరాలుగా ఇలా జరుగుతోంది. అయితే భారీ బ్యాటరీలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి భూమికి దూసుకు వస్తున్నప్పుడు శాస్త్రవేత్తలలోనూ ఆందోళన నెలకొనడం సహజం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇది అంతరిక్ష శాస్త్రవేత్తల పరిశోధనా కేంద్రం. ఇది అమెరికా, రష్యాతో సహా అనేక దేశాల ఉమ్మడి ప్రాజెక్ట్. శాస్త్రవేత్తల బృందం అంతరిక్ష సంబంధిత ప్రయోగాలను ఇక్కడ నిర్వహిస్తుంటుంది. అంతరిక్షంలో మరో అంతరిక్ష కేంద్రం కూడా ఉంది. దానిని చైనా నిర్మించింది. -
కుప్పం నేలపై కృష్ణమ్మ పరవళ్లు
బి.కొత్తకోట (అన్నమయ్య జిల్లా): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. కొండలు, గుట్టలు దాటుకుని ప్రవహిస్తూ.. 672 కిలోమీటర్ల దూరంలోని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గలగలమని పరవళ్లు తొక్కుతూ కృష్ణమ్మ బుధవారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రవేశించింది. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు ప్రజలు కాలువ వద్దకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుప్పానికి కృష్ణా జలాలు తరలించడంలో విఫలమయ్యారు. 2022 సెప్టెంబర్ 23న కుప్పంలో జరిగిన సభకు హాజరైన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చంద్రబాబు హయాంలో ఆగిపోయిన కుప్పం కాలువ పనులను పూర్తి చేస్తామని, కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు ఇస్తే సస్యశ్యామలం అవుతుందని ప్రకటించారు. అన్నట్టుగానే మాట నిలుపుకున్నారు. కృష్ణా జలాలు కుప్పం ఉపకాలువలో ప్రవహిస్తూ బుధవారం ఉదయం 11 గంటలకు రామకుప్పం మండలం వర్దికుప్పం వద్ద (కుప్పం ఉపకాలువ కిలోమీటర్ 64.278 వద్ద) కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించాయి. జనం తండోపతండాలుగా తరలివచ్చి ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించారు. కృష్ణమ్మకు హారతులు పట్టి ఆహా్వనించారు. శ్రీశైలం నుంచి 27 ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని ఎత్తిపోస్తూ కుప్పానికి తరలిస్తున్నారు. బుధవారానికి శ్రీశైలం నుంచి కుప్పం సరిహద్దు వరకు 672 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తూ కృష్ణమ్మ కుప్పం నేలను తడిపింది. సముద్ర మట్టానికి 758 మీటర్ల ఎత్తున నీటిని తరలిస్తూ కాలువలోకి ప్రవహింపజేస్తున్నారు. ప్రస్తుతం చెర్లోపల్లె రిజర్వాయర్ నుంచి 275 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అసంపూర్తి పనులను పూర్తి చేసి.. టీడీపీ హయాంలో 2015లో జరిగిన టెండర్లలో కుప్పం కాలువ పనులను మూడు కాంట్రాక్టు సంస్థల జాయింట్ వెంచర్ 4 శాతం ఎక్సెస్‌తో రూ.430.26 కోట్లకు దక్కించుకుంది. ఒప్పందం మేరకు 123.641 కిలోమీటర్ల కాలువ తవ్వకం, 324 స్ట్రక్చర్స్, 5చోట్ల ఎన్‌హెచ్ క్రాసింగ్ పనులు, మూడుచోట్ల ఎత్తిపోతల పథకాల నిర్మాణం, 110 చెరువులకు నీరందించే పనులు పూర్తి చేయాలి. ఈ పనులను ఇష్టారీతిన నిర్వహించి 2018 నుంచి అసంపూర్తిగా వదిలేశారు. 2019 నుంచి పనులు పూర్తి చేయించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టి కాంట్రాక్టర్లకు నోటీసులిచ్చినా పట్టించుకోలేదు. సీఎం చొరవతో భూ సేకరణకు రూ.40 కోట్లు మంజూరు చేశారు. 4.80 కిలోమీటర్ల పెండింగ్ కాలువ, 103 స్ట్రక్చర్స్, 1,43,130 క్యూబిక్ మీటర్ల మట్టిపని, 22,933 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు, గుడిపల్లె మండలంలో రైల్వే క్రాసింగ్ టన్నెల్ పనులు 45 మీటర్లు జరగాల్సి ఉండేది. వీటి పనులు పూర్తి చేయించడమేకాక గత కాంట్రాక్టర్ల పనుల్లో లోపాలను సరిచేయించి కాలువలో నీటి తరలింపునకు ఇబ్బందులు తొలగించడంతో ప్రస్తుతం కృష్ణా జలాలు ప్రవహిస్తున్నాయి. ఎందుకు నీళ్లివ్వలేదు బాబూ! కుప్పానికి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన చంద్రబాబు తన హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు తరలించానని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. 2019 జనవరి 21న ప్రారంభమై ఏప్రిల్ 11 వరకు పుంగనూరు ఉపకాలువలో కృష్ణా జలాలు పారించారు. 82 రోజులు పారించినా పనులు పూర్తి చేయించకపోవడంతో కుప్పం కాలువలోకి నీళ్లు పారలేదు. బాబు పాలనలో వచి్చన కృష్ణా జలాలు 775 ఎంసీఎఫ్‌టీలు (మిలియన్ క్యూబిక్ ఫీట్స్) మాత్రమే. ఈ నీటిలో 207 కిలోమీటర్ల పుంగనూరు ఉపకాలువ (గడ్డంవారిపల్లె నుంచి బొమ్మరాజుపల్లె వరకు) లో 742.19 ఎంసీఎఫ్‌టీలు, 43 కిలోమీటర్ల కుప్పం కాలువలో 32.81 ఎంసీఎఫ్‌టీల నీరు పారింది. 123 కిలోమీటర్లు మేర ఉండే కుప్పం కాలువలో పలమనేరు నియోజకవర్గంలోని అప్పినపల్లె నుంచి 43వ కిలోమీటర్‌లోని వి.కోట మండలం నారి్నపల్లె వరకు జలాలు సాగి ఆగిపోయాయి. తన పాలనలో కుప్పం కాలువ పనులు పూర్తి చేయించలేకపోయిన చంద్రబాబు.. వైఎస్ జగన్ పనులు చేయించలేదని గగ్గోలు పెట్టారు. అయితే.. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనులు పూర్తి చేయించి కుప్పానికి కృష్ణా జలాలు పారిస్తున్నారు. -
సీఎం నివాసంలోకి చొరబాటుకు దుండగుడి యత్నం.. మారణాయుధాలతో..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లోకి దుండగుడు చొరబడేందుకు ప్రయత్నించాడు. ఆయుధాలతో కూడిన కారులో సీఎం ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కోల్‌కతా కాళీఘాట్‌లోని మమతా నివాసంలోకి ప్రవేశించేందుకు నిందితుడు యత్నించాడు. పోలీస్ స్టిక్కర్‌తో కూడిన వాహనంతో వచ్చిన ఆ వ్యక్తిని నూర్ ఆలంగా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో దీదీ తన నివాసంలోనే ఉన్నారు. నగరంలో ఓ ర్యాలీలో పాల్గొనేందుకు మమతా బెనర్జీ తన నివాసం నుంచి బయల్దేరడానికి కొద్ది గంటల ముందు ఈ ఘటన జరిగింది. మమత ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పాడని కోల్‌కతా సీపీ వినీత్ గోయల్ తెలిపారు. నిందితుడి వద్ద ఒక చాకుతోపాటు వివిధ ఆయుధాలు, గంజాయి కూడా దొరికాయని వెల్లడించారు. బీఎస్ఎఫ్ తదితర ఏజెన్సీలకు సంబంధించిన అనేక గుర్తింపు కార్డులు అతని వద్ద లభ్యమయ్యాయని సీపీ వినీత్ గోయల్ పేర్కొన్నారు. ఘటనకు పాల్పడిన నిందితుడి అసలు ఉద్దేశం కనుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: రద్దీ రోడ్డు.. ట్రాఫిక్ జామ్ కాకూడదని.. బస్ డ్రైవర్‌గా మారిన బెంగళూరు ఏసీపీ! -
అక్రమాలకు పాల్పడున్న భారతీయ అమెరికన్‌కు జైలు.. వివరాలివే..
న్యూయార్క్: అక్రమాలకు పాల్పడుతున్న 49 ఏళ్ల భారతీయ అమెరికన్‌కు అమెరికా కోర్టు జైలు శిక్ష విధించింది. అతను అక్రమంగా భారతీయ పౌరులను ఉబెర్ సాయంతో కెనడా నుంచి అమెరికా సరిహద్దులలోకి ప్రవేశించేందుకు అవకాశం కల్పించడం, అలాగే వారిని మిడ్వెస్ట్, అక్కడి కన్నా ముందుకు తీసుకురావడం చేస్తున్నాడన్న ఆరోపణలతో అతనికి మూడేళ్లకు పైబడిన జైలు శిక్ష విధించింది. మనీలాండరింగ్‌కు పాల్పడుతూ.. కాలిఫోర్నియాకు చెందిన ఎల్మ్గ్రోవ్ నివాసి రాజిందర్ పాల్ సింగ్ ఉరఫ్ జస్పాల్ గిల్ మనీలాండరింగ్‌కు పాల్పడుతూ విదేశీయులను అక్రమంగా రవాణా చేయడం, వారికి ఆశ్రయం కల్పించడం చేస్తున్నాడన్న ఆరోపణలు రుజువు కావడంతో సియెటల్ జిల్లా కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. అక్రమంగా సరిహద్దులలోకి ప్రజలను తరలించేందుకు ఉబెర్‌ను ఉపయోగించిన స్మగ్లింగ్ రింగ్‌లో కీలక సభ్యుడైన రాజిందర్ సింగ్ తాను అర మిలియన్ డాలర్లకు పైగా మొత్తాన్ని అందుకున్నట్లు గత ఫిబ్రవరిలో నేరాన్ని అంగీకరించాడు. సరిహద్దులు దాటించేందుకు ఉబెర్.. తీర్పు సందర్భంగా యూఎస్ తాత్కాలిక అటార్నీ టెస్సా ఎం. గోర్మాన్ మాట్లాడుతూ ‘నాలుగేళ్ల వ్యవధిలో సింగ్ 800 మందికి పైగా ప్రజలను ఉత్తర సరిహద్దుల గుండా యునైటెడ్ స్టేట్స్‌లోని వాషింగ్టన్ రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించేలా అవకాశం కల్పించాడన్నారు. 2018 జూలై ప్రారంభంలో సింగ్, అతని సహచరులు కెనడా నుండి సియెటల్ ప్రాంతానికి ప్రజలను అక్రమంగా సరిహద్దులు దాటించేందుకు ఉబెర్‌ను ఉపయోగించారని’ తెలిపారు. 2018 నుండి 2022 మే మధ్యకాలంలో భారతీయ పౌరులను యునైటెడ్ స్టేట్స్కు అక్రమంగా పంపేందుకు సింగ్ 600 ఉబెర్ ట్రిప్పులను ఏర్పాటు చేశాడు. ఇలా వారిని యూఎస్‌లోకి అక్రమంగా తరలించిన తర్వాత సింగ్ తన సహచరుల సాయంతో వాషింగ్టన్ రాష్ట్రం వెలుపలి నుంచి వారిని గమ్యస్థానాలకు తరలించేందుకు ప్లాన్ చేసిన మార్గాలకు ఒక్కొక్కటి చొప్పున పలు వాహనాలను అద్దెకు తీసుకున్నాడు. సింగ్, అతని సహచరులు నల్ల ధనాన్ని వైట్‌గా మార్చేందుకు అధునాతన పద్ధతులను ఉపయోగించారని రుజువయ్యింది. మహమ్మారి తర్వాత వేగవంతం.. వీరి అక్రమ రవాణా వ్యవహారాలు 2018 నుండి కొనసాగుతున్నాయని న్యాయవాద కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మహమ్మారి సమయంలో వీరి అక్రమ కార్యకలాపాలు మందగించాయి. మహమ్మారి పరిమితులు ఎత్తివేసిన తరువాత వారు తిరిగి తమ అక్రమ కార్యకలాపాలను వేగవంతం చేశారు. జూలై 2018- ఏప్రిల్ 2022 మధ్య ఈ స్మగ్లింగ్ రింగ్‌తో లింక్ అయిన 17 ఉబెర్ ఖాతాల ద్వారా $80,000కు పైగా మొత్తాన్ని ఖర్చు చేసినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. ఇది కూడా చదవండి: గుడ్లను యూరిన్‌లో ఉడికించి, ఉప్పుకారం జల్లి.. -
ల్యాబ్ మాడ్యూల్‌లోకి ప్రవేశించిన చైనా వ్యోమగాములు
బీజింగ్: భూ కక్ష్యలో చైనా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రంలోకి ఆ దేశ వ్యోమగాములు అడుగుపెట్టారు. ఆదివారం ప్రయోగించిన వెంటియాన్ అనే ల్యాబ్ మాడ్యూల్ కక్ష్యలోకి చేరుకుని సోమవారం ఉదయం అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా అనుసంధానం అయింది. దీంతో మొట్టమొదటి సారిగా నిర్మాణంలో ఉన్న తమ ‘టియాన్గాంగ్’ అంతరిక్ష కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములు అడుగుపెట్టారు. వీరు అక్కడ అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయనున్నారని అధికార జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. -
టాలీవుడ్లోకి మరో వారసురాలు!
-
గజరాజుల బెడద మళ్లీమొదలైంది
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా వంగర మండలం వీవీఆర్‌పేట పంచాయతీ జేకే గుమ్మడ గ్రామ సమీపంలోకి మంగళవారం ఆరు ఏనుగుల గుంపు ప్రవేశించింది. కొంతకాలంగా విజయనగరం జిల్లాలోని కొమరాడ, గరుగుబిల్లి మండలాల్లో సంచరిస్తున్న ఈ ఏనుగుల గుంపు ఒక్కసారిగా వంగర మండలంలోకి ప్రవేశించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏనుగుల ఘీంకార శబ్దాలకు భయపడి ప్రజలు పరుగులు పెట్టారు. ఇప్పటికే వీరఘట్టం తదితర మండలాల్లోని గిరిజనులు ఏనుగుల వల్ల పంటలు నష్టపోయారు. ఇప్పుడు వంగర మండల వాసులు ఏం చేస్తాయోనని భయపడుతున్నారు. ఆ గుంపే మళ్లీ వచ్చింది.. 2007 నుంచి నాలుగు ఏనుగుల గుంపు జిల్లాలో సంచరిస్తున్న విషయం తెలిసిందే. వీటితో సతమతమవుతున్న తరుణంలో 2017 మే 17న మరో 8 ఏనుగుల గుంపు ఒడిశా రాష్ట్రం రాయగఢ జిల్లా నుంచి మన జిల్లా కళింగదళ ప్రదేశంలోకి చొరబడింది. అప్పట్లో పెద్ద ఎత్తున హల్చల్ చేlశాయి. ఆ తర్వాత దూసి రైల్వే లైను దాటు తూ కనుగులవానిపేట వద్ద, ఎల్.ఎన్.పేట మండలం కడగండి వెస్ట్ బీట్ వద్ద సంచరించాయి. ఈ క్రమంలో మెళియాపుట్టి మండలం హిరాపురం వద్ద ఇద్దరు గిరిజనులను హతమార్చాయి. దీంతో ఏనుగులు తరలించేందుకు రూ.2 కోట్లు నిధులతో ఆపరేషన్ గజేంద్రను జిల్లా అటవీ శాఖాధికారులు చేపట్టారు. వాటిని ఒడిశా తరలించారు. అందులో రెండు చనిపోగా, మిగతా ఆరు మళ్లీ వెనక్కి వచ్చేశాయి. మొన్నటి వరకు విజయనగరం జిల్లాలో సంచరించగా, ఇప్పుడవి మళ్లీ మన జిల్లాలోని వంగర మండలం వీవీఆర్‌పేట పంచాయతీ జేకే గుమ్మడ గ్రామ సమీపంలోని మెట్ట భూముల్లోకి చొచ్చుకొచ్చాయి. గతంలో ఏం జరిగిందంటే..? 2007 మార్చిలో ఒడిశా లఖేరీ అడవుల నుంచి 9 ఏనుగుల గుంపు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల సరిహద్దులో ప్రవేశించింది. 2007 అక్టోబర్‌లో ఏనుగుల గుంపును తరలించేందుకు అప్పటి అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు తీసుకున్న నిర్ణయం మేరకు ఆపరేషన్ గజ చేపట్టారు. చిత్తూరు, బెంగళూరుకు సంబంధించిన తర్ఫీదు పొందిన మావటీలతోపాటు జయంతి, గణేష్ అనే శిక్షణ పొందిన ఏనుగులను రంగంలోకి దించారు. ఆశించినంతగా ఫలితం ఇవ్వకపోయినప్పటికీ రెండు ఏనుగులను అదుపులోకి తీసుకొని ప్రత్యేక వాహనాలతో ఒడిశా అడవుల్లోకి పంపించే ప్రయత్నం చేశారు. ఇందులో ఒక ఏనుగు మార్గమధ్యంలోనే మృతి చెందింది. మరో ఏనుగు కూడా తరలించిన అనంతరం మృతి చెందింది. ఇలా వరుసగా ఏనుగుల మృతి చెందిన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంతో ఆపరేషన్ గజ నిలిచింది. వీటిలో ఏడు ఏనుగులు సంచరించగా వీరఘట్టం మండలం కుంబిడి ఇచ్ఛాపురం వద్ద కొంతమంది రెండు ఏనుగులను హతమర్చారు. అనంతరం ఎస్.గోపాలపురం వద్ద విద్యుత్ షాక్ తగిలి మరో ఏనుగు మతి చెందింది. ప్రస్తుతం వాటిలో నాలుగు ఏనుగులు మాత్రమే జిల్లా అడవుల్లో సంచరిస్తున్నాయి. వాటికి తోడు తాజాగా చొచ్చుకొచ్చిన ఆరు ఏనుగులతో ఆ సంఖ్య పదికి చేరింది. భయపెడుతున్న గత సంఘటనలు.. గత 12 ఏళ్ల నుంచి నేటి వరకు ఏనుగుల బారిన పడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 13 మంది దుర్మణం చెందారు. ఇప్పుడు మళ్లీ ఆరు ఏనుగుల గుంపు రావడంతో గిరిజన గ్రామాల ప్రజలతో పాటు ప్రస్తుతం సంచరిస్తున్న ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సూదిరాయిగూడ సమీపంలో ఏనుగులు.. సీతంపేట: సీతంపేట ఏజెన్సీలో కడగండి పంచాయతీ పరిధిలోని సూదిరాయిగూడ సమీపంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. మంగళవారం వేకువజామున ఆ ప్రాంతానికి ఏనుగులు వచ్చి ఘీంకారాలు చేయడంతో ఆ ప్రాంత గిరిజనులు ఆందోళన చెందారు. ఫైనాపిల్, అరటి తదితర పంటలను నాశనం చేస్తున్నాయని గిరిజనులు తెలిపారు. కొండపోడు పనులకు సైతం వెళ్లలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. -
కట్టుబాట్లు - సవాళ్లు
-
మసీదులోకి మహిళలకు అనుమతి
కొట్టాయం: కేరళలోని ప్రముఖ సున్నీ మసీదులోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని మసీదు పెద్దలు చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. కొట్టాయంలో గల 8వ శతాబ్దానికి చెందిన ఈ మసీదును చూడడానికి దేశ, విదేశాలనుంచి ఎంతో మంది పర్యాటకులు నిత్యం వస్తుంటారు. ఇప్పటి వరకు ఈ మసీదులోకి మహిళలకు ప్రవేశం లేదు. అయితే రెండు రోజులు స్థానికంగా ఉన్న మహిళలకు ప్రవేశం కల్పించాలని మత పెద్దలు నిర్ణయించారు. ఇస్లాంలోని సున్నీ సంప్రదాయంలో మహిళలు మసీదులో ప్రవేశించడం గానీ, ప్రార్థనలు చేయడం గానీ సాంప్రదాయాలకు విరుద్ధం. మే 8న ఈ సాంప్రదాయానికి మహిళలు బద్దలు కొట్టనున్నారు. ఈ మసీదులోని అద్భుత నిర్మాణాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఇక్కడి వస్తుంటారు. స్థానికంగా ఉన్న మహిళలు తమకు కూడా మసీదును చూసే అవకాశం కల్పించాలని కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో వారికి రెండు రోజులు ప్రవేశానికి అనుమతినిస్తున్నట్టు మసీదు మౌల్వి సిరాజుద్దీన్ పేర్కొన్నారు. మసీదు పెద్దలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్థానిక ముస్లిం మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అమెరికా వెళ్తారా.. వీసా ఒక్కటే సరిపోదు!
ఢిల్లీ: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే వారికి ఇక వీసా ఒక్కటే సరిపోదు. అందుకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు పక్కాగా ఉండాలి. ఇటీవల పలువురు విద్యార్థులు అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి వీసా దొరికినా కూడా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ దేశ ఎంబసీ మంజూరు చేసిన వీసాల పట్ల అమెరికా బాధ్యత వహించాలని భారత్ కోరింది. అయితే అమెరికా అధికార వర్గాలు మాత్రం విద్యార్థుల సమస్యలకు వీసా స్టేటస్ తో గానీ, యూనివర్సిటీలతో గానీ ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా విద్యార్థుల వ్యక్తిగతమైన అంశమని చెబుతున్నాయి. బార్డర్ పెట్రోల్ ఏజెంట్‌కు అందించిన వివరాల్లో స్పష్టత లేకపోవడం వలనే విద్యార్థులు డిపోర్టేషన్ సమస్యలు ఎదుర్కొన్నారని, వీసా స్టేటస్‌కు దీనికి సంబంధం లేదని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. ప్రయాణ డాక్యుమెంట్లతో పాటు ఎక్కడ చదువుతారు, ఎక్కడ ఉంటారు, ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆరోగ్యరక్షణకు ఏం చేస్తారు.. ఇలాంటి అంశాలను విద్యార్థులు చూపించడంలో విఫలమైనందునే వారిని వెనక్కి పంపిస్తున్నట్లు తెలిపారు. పారిస్ దాడుల నేపథ్యంలో భద్రతను సీరియస్‌గా తీసుకున్న అమెరికా అధికారులు తమ దేశంలోకి ప్రవేశించే వారి విషయంలో నిబంధనలు కఠినతరం చేశారు. తాజా పరిణామాల దృష్ట్యా.. వీసా ఉన్నంత మాత్రాన అమెరికాకు వెళ్లడం కుదరదు.. అన్ని డాక్యుమెంట్లను పక్కాగా ఏర్పాటు చేసుకుంటేనే అమెరికా ప్రయాణం సాఫీగా సాగుతోందని నిపుణులు చెబుతున్నారు. -
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వరదనీరు
-
ఇంట్లోకి చొరబడిన చిరుత
-
గుడిలో మహిళల ప్రవేశం పై నిషేదం
-
అధికారిక నివాసంలో కేసీఆర్ పూజలు
-
నా రాజకీయ తెరంగేట్రం ఖాయం
తన రాజకీయ తెరంగేట్రం ఖాయమని, ఏ పార్టీలో చేరతాననే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని అంటోంది నటి నమిత. వెండితెరపై అందాలు ఆరబోసిన ఈ సూరత్ సుందరి ఎంగళ్ అన్న చిత్రం ద్వారా కోలీవుడ్‌లో రంగ ప్రవేశం చేసింది. టాలీవుడ్‌లోను హీరోయిన్గా మంచి పేరు సంపాదించుకుంది. తాజాగా రియల్ ఎస్టేట్ వ్యాపారంపై దృష్టి సారిస్తున్న ఈ ముద్దుగుమ్మకు సినిమా ఛాన్స్‌లు తగ్గాయి. నటిగా అవకాశాలు కొరవడినా నమిత పేరుకు క్రేజ్ తగ్గలేదన్నది నిజం. ఆమె ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి అభిమానాన్ని ఈ సంచలన తార ఎన్‌క్యాష్ చేసుకోనున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. నమిత రాజకీయ రంగ ప్రవేశం గురించి ఇప్పటికే చాలా ప్రచారం జరిగింది. తాజాగా ఈ భామ తన రాజకీయ తెరంగేట్రం గురించి స్వయంగా ప్రకటించి రాజకీయంగా కలకలం పుట్టించింది. శుక్రవారం తిరుచ్చిలో విలేకరులతో మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలకు ముందే తన రాజకీయ రంగప్రవేశం ఉంటుందని వెల్లడించింది. ఏ రాజకీయ పార్టీలో చేరనున్నది త్వరలోనే తెలియచేస్తానని పేర్కొంది. ప్రస్తుత రాజకీయ నాయకుల గురించి ఈ బ్యూటీ వ్యాఖ్యానిస్తూ విజయకాంత్ సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ స్ట్రాంగ్‌గా ఉన్నారని తెలిపింది. ఆయనతో పొత్తులకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని అంది. ముఖ్యమంత్రి జయలలిత మహిళల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ఇది ఆహ్వానించదగ్గ విషయం అని అంది. నరేంద్రమోడి ప్రచారంలో దూసుకుపోతూ ప్రజలను ఆకర్షిస్తున్నారఇ పేర్కొంది. నటుడు శరత్‌కుమార్ సరసన నటించారు. ఆయన పార్టీలో చేరుతారా? అన్న ప్రశ్నకు మొదట అవునన్న నమిత ఆ తర్వాత ఆయన పార్టీ నడుపుతున్నారా? అంటూ అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు.