తన రాజకీయ తెరంగేట్రం ఖాయమని, ఏ పార్టీలో చేరతాననే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని అంటోంది నటి నమిత. వెండితెరపై అందాలు ఆరబోసిన

తన రాజకీయ తెరంగేట్రం ఖాయమని, ఏ పార్టీలో చేరతాననే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని అంటోంది నటి నమిత. వెండితెరపై అందాలు ఆరబోసిన ఈ సూరత్ సుందరి ఎంగళ్ అన్న చిత్రం ద్వారా కోలీవుడ్‌లో రంగ ప్రవేశం చేసింది. టాలీవుడ్‌లోను హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుంది. తాజాగా రియల్ ఎస్టేట్ వ్యాపారంపై దృష్టి సారిస్తున్న ఈ ముద్దుగుమ్మకు సినిమా ఛాన్స్‌లు తగ్గాయి. నటిగా అవకాశాలు కొరవడినా నమిత పేరుకు క్రేజ్ తగ్గలేదన్నది నిజం.
ఆమె ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి అభిమానాన్ని ఈ సంచలన తార ఎన్‌క్యాష్ చేసుకోనున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. నమిత రాజకీయ రంగ ప్రవేశం గురించి ఇప్పటికే చాలా ప్రచారం జరిగింది. తాజాగా ఈ భామ తన రాజకీయ తెరంగేట్రం గురించి స్వయంగా ప్రకటించి రాజకీయంగా కలకలం పుట్టించింది. శుక్రవారం తిరుచ్చిలో విలేకరులతో మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలకు ముందే తన రాజకీయ రంగప్రవేశం ఉంటుందని వెల్లడించింది. ఏ రాజకీయ పార్టీలో చేరనున్నది త్వరలోనే తెలియచేస్తానని పేర్కొంది.
ప్రస్తుత రాజకీయ నాయకుల గురించి ఈ బ్యూటీ వ్యాఖ్యానిస్తూ విజయకాంత్ సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ స్ట్రాంగ్‌గా ఉన్నారని తెలిపింది. ఆయనతో పొత్తులకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని అంది. ముఖ్యమంత్రి జయలలిత మహిళల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ఇది ఆహ్వానించదగ్గ విషయం అని అంది. నరేంద్రమోడి ప్రచారంలో దూసుకుపోతూ ప్రజలను ఆకర్షిస్తున్నారఇ పేర్కొంది. నటుడు శరత్‌కుమార్ సరసన నటించారు. ఆయన పార్టీలో చేరుతారా? అన్న ప్రశ్నకు మొదట అవునన్న నమిత ఆ తర్వాత ఆయన పార్టీ నడుపుతున్నారా? అంటూ అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు.