
బీజింగ్: భూ కక్ష్యలో చైనా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రంలోకి ఆ దేశ వ్యోమగాములు అడుగుపెట్టారు. ఆదివారం ప్రయోగించిన వెంటియాన్ అనే ల్యాబ్ మాడ్యూల్ కక్ష్యలోకి చేరుకుని సోమవారం ఉదయం అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా అనుసంధానం అయింది.
దీంతో మొట్టమొదటి సారిగా నిర్మాణంలో ఉన్న తమ ‘టియాన్‌గాంగ్’ అంతరిక్ష కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములు అడుగుపెట్టారు. వీరు అక్కడ అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయనున్నారని అధికార జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment