Tiangong II
-
అంతరిక్ష నడకల్లో చైనా రికార్డు
బీజింగ్: అంతరిక్ష పరిశోధనల్లో చైనా దూసుకెళ్తోంది. చైనా వ్యోమగాములు 16 స్పేస్‌వాక్‌లు నిర్వహించి సరికొత్త రికార్డు సృష్టించారు. భూదిగువ కక్ష్యలోని చైనా అంతరిక్ష కేంద్రం(సీఎస్ఎస్) ‘తియాన్‌గాంగ్’లో షెన్‌జౌ–18 మిషన్‌లో భాగంగా బుధవారం ముగ్గురు వ్యోమగాములు యె గాంగ్ఫు, లీ కాంగ్, లీ గాంగ్‌సూ దాదాపు 6.5 గంటలపాటు స్పేస్‌వాక్ చేశారు. అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచి్చ, శూన్య వాతావరణంలో విహరించడమే స్పేస్‌వాక్. సీఎస్ఎస్ అప్లికేషన్, డెవలప్మెంట్ దశలో ఇది 16వ స్పేస్‌వాక్ అని చైనా అంతరిక్ష పరిశోధకులు తెలిపారు. సంబంధిత వీడియోలను విడుదల చేశారు. ఇందులో వ్యోమగామి లీ కాంగ్ తెల్లరంగు స్పేస్ సూట్ ధరించి చేసిన తొలి స్పేస్ వాక్ కనిపిస్తోంది. లీ కాంగ్ వెనుక భూగోళం స్పష్టంగా దర్శనమిస్తోంది. షెన్‌జౌ–18 మిషన్‌లో ఇది రెండో స్పేస్‌వాక్. ఇదే మిషన్‌లో మే 28వ తేదీన వ్యోమగాములు 8.5 గంటలపాటు స్పేస్‌వాక్ నిర్వహించారు. చైనా అంతరిక్ష పరిశోధనల్లో అత్యంత సుదీర్ఘకాలం జరిగిన స్పేస్‌వాక్ ఇదే కావడం విశేషం. సీఎస్ఎస్ నుంచి మొట్టమొదటి అంతరిక్ష నడక 2021 జూలై నెలలో జరిగింది. షెన్‌జౌ–12 మిషన్ వ్యోమగాములు 7 గంటలపాటు స్పేస్‌వాక్ చేశారు. షెన్‌జౌ–13 మిషన్‌లో మొట్టమొదటిసారిగా ఓ మహిళా వ్యోమగామి స్పేస్‌వాక్‌లో పాల్గొన్నారు. షెన్‌జౌ–14 మిషన్ అస్ట్రోనాట్స్ మూడు స్పేస్‌వాక్‌లు నిర్వహించారు. షెన్‌జౌ–15 మిషన్‌లో భాగంగా ఒకే వ్యోమగామి ఆరు నెలల వ్యవధిలో నాలుగు స్పేస్‌వాక్‌లు చేశారు. ప్రస్తుతం షెన్‌జౌ–18 మిషన్ కొనసాగుతోంది. మరికొన్ని స్పేస్‌వాక్‌లు చేసే, కొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం కనిపిస్తోంది. భూదిగువ కక్ష్యలో పరిశోధనల విషయంలో చైనా ముందంజలో ఉంది. స్పేస్‌వాక్‌లు సునాయాసంగా చేయడం అనేది సాంకేతిక నైపుణ్యాలను నిరూపించుకోవడంతోపాటు భవిష్యత్తులో మరిన్ని సంక్లిష్టమైన అంతరిక్ష పరిశోధనలకు నాంది అని చెప్పొచ్చు. -
ల్యాబ్ మాడ్యూల్‌లోకి ప్రవేశించిన చైనా వ్యోమగాములు
బీజింగ్: భూ కక్ష్యలో చైనా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రంలోకి ఆ దేశ వ్యోమగాములు అడుగుపెట్టారు. ఆదివారం ప్రయోగించిన వెంటియాన్ అనే ల్యాబ్ మాడ్యూల్ కక్ష్యలోకి చేరుకుని సోమవారం ఉదయం అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా అనుసంధానం అయింది. దీంతో మొట్టమొదటి సారిగా నిర్మాణంలో ఉన్న తమ ‘టియాన్గాంగ్’ అంతరిక్ష కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములు అడుగుపెట్టారు. వీరు అక్కడ అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయనున్నారని అధికార జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. -
మరికొన్ని రోజుల్లో.. మహావినాశనం!
చైనాకు చెందిన ఒక అంతరిక్ష కేంద్రం భూమిపై కూలిపోనుందా? భూమికి మహా వినాశనం తప్పదా? స్పేస్స్టేషన్పై సైంటిస్టులు నియంత్రణ కోల్పోయారా? కూలుతున్న అంతరిక్ష కేంద్రం భూ కక్ష్యలోకి ప్రవేశించిందా? భూమిపై విలయం ఎప్పుడు సృష్టిస్తుంది.. వంటి వివరాలు తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. అమెరికా, రష్యా వంటి అగ్రరాజ్యాలతో అంతరిక్ష పరిశోధనల్లో పోటీపడ్డ చైనా.. ఇప్పుడు భూమికి మహా ప్రమాదాన్ని తెచ్చిపట్టింది. అంతరిక్ష పరిశోధనల కోసం చైనా ప్రత్యేకంగా తియాంగాంగ్-1 పేరుతో స్పేస్ స్టేషన్ నిర్మించుకుంది. సుమారు 19 వేల పౌండ్ల బరువున్న ఈ స్పేస్ స్టేషన్ అంతరిక్షం నుంచి భూమిపైన పడబోతోంది. తియాంగాంగ్-1.. 2016 మార్చిలోనే శాస్త్రవేత్తల నియంత్రణ కోల్పోయింది. అప్పటినుంచి ఆకాశంలో పరిభ్రమిస్తూ.. నెమ్మదిగా భూమివైపు ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఇది భూ కక్ష్యలోకి ప్రవేశించిందని సైంటిస్టులు చెబుతున్నారు. ఎక్కడ పడుతుంది? ఉత్తర-దక్షిణ ధృవాల మధ్యలోని 43 డిగ్రీల అక్షాంశాల మధ్య ఎక్కడైనా పడొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. జనవరి నుంచి - మార్చి మధ్యకాలంలో భూమిమీద భీకరంగా కూలిపోయే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఎక్కడ పడొచ్చు? ప్రపంచ ఆర్థిక, వాణిజ్య, దేశ రాజధానులుగా పేరున్న ప్రధాన నగరాలపై పడే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, బీజింగ్, రోమ్, ఇస్తాంబుల్, టోక్యో నగరాలున్నాయి. ప్రమాద స్థాయి తియాంగాంగ్-1 నేల కూలితే.. మన రాజధాని ఢిల్లీ మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. జీవరాశి మొత్తం అంతరించిపోగా, భారీ భవనాలు సైతం నేల మట్టమవుతాయి. తియాంగాంగ్-1 నుంచి భారత్, బ్రిటన్లకు పెద్దగా ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు. చైనా ఏమంటోంది? తియాంగాంగ్ - 1 కూలిపోవడం వల్ల భూమికి వచ్చే నష్టం పెద్దగా ఏం ఉండదని చైనా చెబుతోంది. ఈ స్పేస్ స్టేషన్ నాలుగున్నర సంవత్సరాలు పనిచేసింది. మరో రెండున్నర ఏళ్లు అదనంగా విధులు నిర్వహించింది. ఇప్పటికే స్పేస్ స్టేషన్లోకి కీలక భాగాలన్ని అగ్నికి ఆహుతి అయ్యాయని.. స్పేస్ ఇంజినీరింగ్ డిప్యూటీ డైరెక్టర్ వూ పింగ్ అంటున్నారు. భూ వాతావరణంలోకి ప్రవేశించే సమయంలోనే.. స్పేస్ స్టేషన్ మండిపోతుందని.. ఆయన చెబుతున్నారు. -
మరో స్కైలాబ్?! మహావినాశనం??
చైనాకు చెందిన ఒక స్పేస్ స్టేషన్ మరో స్కైలాబ్ కానుందా? ఇప్పటికే భూ నియంత్రణ కోల్పోయిందా? ఒక మహానగరం మొత్తం సర్వనాశనం కానుందా? దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? భూమిపై ఎప్పుడు విలయం సృష్టిస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ స్టోరీ చదవండి. అంతరిక్ష పరిశోధనల్లో అమెరికా, రష్యాలతో పోటీ పడే చైనా.. ప్రపంచానికి మహా ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది. అంతరిక్ష పరిశోధనల కోసం చైనా పంపిన తియాంగాంగ్-1 పూర్తిగా భూ నియంత్రణ కోల్పోయినట్లు ఐరోపా శాస్త్రవేత్తలు ప్రకటించారు. సైంటిస్టుల నియంత్రణ కోల్పోయిన ఈ స్పేస్ స్టేషన్ వచ్చే ఏడాది లోపు ఉత్తర, దక్షిణార్ధ గోళాల మధ్యలో ఎక్కడైనా పడొచ్చని వారు ప్రకటించారు. భారీ స్పేస్ స్టేషన్ చైనా నిర్మించిన తియాంగాంగ్-1 8.5 టన్నుల బరువు ఉంటుంది. 12 మీటర్ల పొడవున్న తియాంగాంగ్ జనవరి-మార్చి మధ్య కాలంలో ఎప్పుడైనా, ఎక్కడైనా భీకరంగా నేల కూలవచ్చని సైంటిస్టుల హెచ్చరిస్తున్నారు. ప్రమాదంలో ప్రధాన నగరాలు ప్రపంచ ఆర్థిక, వాణిజ్య, దేశ రాజధానులుగా పేరున్న ప్రధాన నగరాలపై పడే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, బీజింగ్, రోమ్, ఇస్తాంబుల్, టోక్యో నగరాలున్నాయి. ప్రమాద స్థాయి తియాంగాంగ్-1 నేల కూలితే.. మన రాజధాని ఢిల్లీ మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. జీవరాశి మొత్తం అంతరించిపోగా, భారీ భవనాలు సైతం నేల మట్టమవుతాయి. మనకు ప్రమాదం? తియాంగాంగ్-1 నుంచి భారత్, బ్రిటన్లకు పెద్దగా ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు. -
చైనా మరో ముందడుగు..
బీజింగ్: అంతరిక్ష రంగంలో చైనా మరో ముందడుగేసింది. తన రెండో స్పేస్ లాబొరేటరీ తియాన్‌గాంగ్-2 ను గురువారం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. గోబి ఎడారిలోని జియక్వాన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్ 2f రాకెట్ ద్వారా శాస్త్రవేత్తలు తియాన్‌గాంగ్-2 ను అంతరిక్షంలోకి పంపారు. ఈ స్పేస్ లాబొరేటరీని అంతరిక్షంలో రెండేళ్లపాటు సేవలందించేలా రూపొందించారు. తియాన్‌గాంగ్-2 పొడవు 10.4 మీటర్లు కాగా, వ్యాసం 3.35 మీటర్లు. దీని బరువు 8.6 మెట్రిక్ టన్నులు ఉందని చైనీస్ స్పేస్ అథారిటీ వెల్లడించింది. రెండు క్యాబిన్లుగా విభజించబడి ఉన్న స్పేస్ లాబ్‌లో.. ఒకటి ప్రయోగాలతో పాటు అంతరిక్ష యాత్రికులకు లివింగ్ క్వార్టర్స్ గా ఉపయోగపడుతుంది. రెండవది రీసోర్స్ క్యాబిన్. దీనిలో సోలార్ ప్యానల్స్, స్టోరేజ్ బ్యాటరీలు తదితర సామాగ్రి ఉంటుందని అధికారులు వెల్లడించారు.