చైనా మరో ముందడుగు..
చైనా మరో ముందడుగు..
Published Thu, Sep 15 2016 8:35 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
బీజింగ్: అంతరిక్ష రంగంలో చైనా మరో ముందడుగేసింది. తన రెండో స్పేస్ లాబొరేటరీ తియాన్గాంగ్-2 ను గురువారం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. గోబి ఎడారిలోని జియక్వాన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్ 2f రాకెట్ ద్వారా శాస్త్రవేత్తలు తియాన్గాంగ్-2 ను అంతరిక్షంలోకి పంపారు. ఈ స్పేస్ లాబొరేటరీని అంతరిక్షంలో రెండేళ్లపాటు సేవలందించేలా రూపొందించారు.
తియాన్గాంగ్-2 పొడవు 10.4 మీటర్లు కాగా, వ్యాసం 3.35 మీటర్లు. దీని బరువు 8.6 మెట్రిక్ టన్నులు ఉందని చైనీస్ స్పేస్ అథారిటీ వెల్లడించింది. రెండు క్యాబిన్లుగా విభజించబడి ఉన్న స్పేస్ లాబ్లో.. ఒకటి ప్రయోగాలతో పాటు అంతరిక్ష యాత్రికులకు లివింగ్ క్వార్టర్స్ గా ఉపయోగపడుతుంది. రెండవది రీసోర్స్ క్యాబిన్. దీనిలో సోలార్ ప్యానల్స్, స్టోరేజ్ బ్యాటరీలు తదితర సామాగ్రి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
Advertisement