ప్రతీకాత్మక చిత్రం
బీజింగ్ : చైనాకు చెందిన తొలి అంతరిక్ష పరిశోధనా కేంద్రం టియాంగాంగ్-1 ఎక్కడ కూలుతుందోనని చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఒకింత ఆందోళనకు గురువుతున్నారు. ఈ విషయం గురించి చైనా శాస్త్రవేత్తలు స్పందించారు. ఈ నెల మార్చి 31 నుంచి ఏప్రిల్ 4 తేదీల మధ్య కూలిపోనున్నట్లు చైనా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. భూమి ఆవరణలోకి రాగానే టియాంగాంగ్-1 మండిపోతుందని తెలిపారు.
మార్చి 16 నుంచి టియాంగాంగ్-1 నుంచి సమాచారం అందడం లేదని చైనా అంతరిక్ష ఇంజనీరింగ్ అధికారి సోమవారమే తెలిపారు. భూమికి 216.2 కిలోమీటర్ల దూరంలో భూమి చుట్టూ తిరుగుతోంది. కచ్చితంగా భూమిపై ఎక్కడ కూలుతుందో శాస్త్రవేత్తలకు అంచనావేయడం కష్టతరంగా మారిందని ప్రకటనలో పేర్కొన్నారు. భూమిని సమీపించే రెండు గంటల ముందు మాత్రమే ఎక్కడ పడుతుందో చెప్పగలమని తెలిపారు. టియాంగాంగ్-1 ను 2011లో రెండు సంవత్సరాల జీవితకాలం ఉండేలా రూపొందించారు. ఈ టియాంగాంగ్-1ను షెన్జో-8, షెన్జో-9, షెన్జో-10 స్పేష్‌క్రాప్ట్‌లతో లోడింగ్ చేశారు.
టియాంగాంగ్-1 గురించి కొన్ని వాస్తవాలు
- కక్ష్యలో ఉన్న కాలం 6 సంవత్సరాల 178 రోజులు( మార్చి 26 వరకు)
- భూకక్ష్య చుట్టూ 37, 287 సార్లు పరిభ్రమించింది
- బరువు 8,506 కేజీలు
- పొడవు10.4 మీటర్లు(34.1 అడుగులు)
- వ్యాసం 3.35 మీటర్లు(11 అడుగులు)
Comments
Please login to add a commentAdd a comment