మెదక్‌లో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. మెదక్‌లో 12 డిగ్రీల అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడ సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా రికార్డయింది. ఖమ్మంలో 5 డిగ్రీలు తక్కువగా 15 డిగ్రీల ఉష్ణోగ్రత, నిజామాబాద్‌లో 13, హైదరాబాద్, ఆదిలాబాద్, రామగుండంలలో 14 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రాత్రి వేళ నమోదయ్యాయి.
హైదరాబాద్‌లో సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత రికార్డయింది. నల్లగొండలో సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, రాబోయే నాలుగు రోజుల్లో చలి గాలుల తీవ్రతకు సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
రాష్ట్రవ్యాప్తంగా చలిగాలులు
Published Tue, Nov 22 2016 3:17 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM
Advertisement
Advertisement