ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల వల్ల మన్యంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. దీంతో ఎజెన్సీ ప్రాంతాలు మంచు దుప్పటిని కప్పుకున్నాయి. ఉదయం పది గంటలైనా.. పొగమంచు వీడకపోవడంతో.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటి ల్లుతుండటంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం రాత్రి లంబసింగిలో 4 డిగ్రీలు, చింతపల్లి, పాడేరులో 5 డిగ్రీలు, అరకులో 7.5 డిగ్రీలు, పోతురాజుగుడి వద్ద 6 డిగ్రీలు, మినుములూరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.