ఢిల్లీ:ఎముకలు కొరికే చలిగాలులు, పొగ మంచు ప్రభావంతో హస్తిన జనజీవనం అస్తవ్యస్తమైంది. మంచినీళ్లు సైతం గడ్డకట్టే స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఢిల్లీలో 2.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఢిల్లీ వాసుల కష్టాలు అంతా ఇంతా కాదు. గత ఐదేళ్లలో తొలిసారి కనిష్టస్థాయికి చేరిన ఉష్ణోగ్రతలతో ఢిల్లీ అల్లాడుతోంది.మరోవైపు పొగమంచు కారణంగా ఢిల్లీలో పలు విమాన సర్వీసులు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
దీంతో 73 విమాన, 70 రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. 50 మీటర్ల వరకే వాహనాలు కనిపిస్తుండటంతో సాధారణ ట్రాఫిక్‌కు కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి. సోమవారం కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.