అల్లూరి జిల్లాను వణికిస్తున్న చలిగాలులు.. మినుములూరులో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత
సాక్షి, పాడేరు: ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలను చలిగాలులు వణికిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచే చలిగాలులు విజృంభిస్తుండటంతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో గురువారం 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 11.3, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 12.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఏజెన్సీలో అర్ధరాత్రి నుంచి పొగమంచు దట్టంగా కురుస్తోంది. పాడేరులో గురువారం ఉదయం 10 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. పొగమంచుతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు.
2
Comments
Please login to add a commentAdd a comment