Temperature decreases
-
గడ్డకట్టిన జలపాతం.. ఎక్కడో కాదు మన దగ్గరే..!
సిమ్లా: కొద్ది రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉత్తర భారత్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొగమంచు దట్టంగా కురవడంతో రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలకు ఆటంకం ఏర్పడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం అత్యల్పంగా 3.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో నీరు గడ్డకట్టుకుపోతోంది. హిమాలయాలకు సమీపంలోని హిమాచల్‌లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతుండటంతో నీళ్లు గడ్డకట్టుకుపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు.. హిమాచల్ కులూలోని ఓ జలపాతం గడ్డకట్టుకుపోయింది. అతి శీతల వాతావరణంతో గడ్డకట్టి మంచుతో చెక్కిన శిల్పాలుగా ఆకట్టుకుంటోంది. గడ్డకట్టిన జలపాతం అందాలను చూసేందుకు పర్యటకులు తరలివస్తున్నారు. On #Udaipur - #Tindi road... Near Bhim bagh 🥶 7th January 2023#Lahaul , #HimachalPradesh@SkymetWeather @jnmet @Mpalawat @JATINSKYMET pic.twitter.com/IqLve8xh1I — Gaurav kochar (@gaurav_kochar) January 7, 2023 హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూలో అతి శీతల వాతావరణంతో గడ్డకట్టిన జలపాతం ఇదీ చదవండి: Joshimath: కుంగుతున్నా వదలట్లేదు -
చలితో గజ గజ! ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: ఉత్తర భారతంలో చలి తీవ్రత ఉధృతమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ చలికి గజ గజ వణుకుతోంది. ఆదివారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేసింది. వెలుతురులేమి కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలోని సఫ్తార్‌జంగ్ ప్రాంతంలో అత్యల్పంగా 1.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితులు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 20 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు.. సఫ్తార్‌జంగ్ (1.9), పాలమ్(5.2), లోథిరోడ్ (2.8), రిడ్జ్(2.2), అయా నగర్(2.6) డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు.. గాలి నాణ్యత సైతం ప్రమాదకరస్థాయిలోనే ఉంది. గాలినాణ్యత సూచీ 359గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్న క్రమంలో నిరాశ్రయుల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది ఢిల్లీ ప్రభుత్వం. తమ ప్రాంతాల్లోని శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు.. పంజాబ్‌లోని అమృత్సర్, పాటియాలా, అంబాలా, చండీగఢ్, రాజస్థాన్‌లోని గంగానగర్‌లో చలి తీవ్రత అధికంగా ఉంది. పొగమంచు కారణంగా వెలుతురులేమితో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. Delhi | Severe cold wave and fog conditions continue to prevail in the national capital. Visuals from Kartavya Path pic.twitter.com/hpahVIAtXY — ANI (@ANI) January 8, 2023 ఇదీ చదవండి: స్తోమత లేక బడి మానేసి బీడీలు.. ఇప్పుడు అమెరికాలో జడ్జీగా తీర్పులు -
Winter Temperature Peaks: కోడి కూసినా తెల్లారట్లే..
సాక్షి, నెట్వర్క్: కోడి కూయకముందే నిద్ర లేచే ఊర్లు.. ఎండపొడ మొదలైనా మబ్బు వీడటం లేదు. ఉదయం తొమ్మిదైనా కమ్ముకునే ఉంటున్న పొగమంచుతో.. ఇంట్లో ఉన్నా వణికిస్తున్న చలితో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉదయమేకాదు పగటివేళ కూడా చలిగా ఉం టోంది. ఇంట్లోంచి కాలు బయటపెట్టాలంటే భయపడుతున్న పరిస్థితి. రాష్ట్రంలో కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయిన నేపథ్యంలో ఊర్లలో పరిస్థితి, జనం ఇబ్బందులపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం దాకా పలు జిల్లాల్లో పరిస్థితిని గమనించింది. ఆ వివరాలతో ప్రత్యేక కథనం.. పశువులకు ‘గోనె సంచుల’ రక్షణ ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదవుతుండటంతో మనుషులతోపాటు పశువులు కూడా ఇబ్బందిపడుతున్నాయి. చలి నుంచి వాటిని రక్షించేందుకు యజమానులు ప్రయత్నిస్తున్నారు. అలా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి(టి) గ్రామంలో ఓ రైతు తన పశువులకు ఇలా గోనె సంచులు, వస్త్రాలు కప్పాడు. మంచు దుప్పటిలో అర్లి (టి) ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ఆదిలాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాలు మంచు దుప్పటిలో మునిగిపోయాయి. ఉదయం పది గంటల వరకూ పొగ మంచు కమ్ముకునే ఉంటోంది. బుధవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఇక్కడి భీంపూర్ మండలం అర్లి(టి) గ్రామంలో కమ్ముకున్న పొగమంచు ఇది. దీనితోపాటు బోథ్ మండలం సొనాల, బేల మండల కేంద్రంలోనూ ఇలాగే పొగమంచు కమ్ముకుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ నడి ఇంట్లో చలి మంటలు గజగజా వణికిస్తున్న చలి నుంచి ఉపశమనం పొందేందుకు నడి ఇంట్లోనే చలి మంటలు వేసుకున్న వృద్ధులు వీరు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి(టి)లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. 2018లో ఈ గ్రామంలో 2.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా.. గత ఏడాది 4 డిగ్రీలు నమోదైంది. ఈసారి మంగళవారం 3.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత వచ్చింది. మరికొద్దిరోజులు ఇదే పరిస్థితి ఉండనుండటంతో.. ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతాయని అంచనా వేస్తున్నారు. – తాంసి, బేల 30 ఏళ్లకింద ఇలా చూశా.. ఈ చిత్రంలోని వృద్ధురాలు జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్వాయికి చెందిన శాకపురం గంగమ్మ. రెండు, మూడు రోజులుగా చలి భయపెడుతోందన్న ఆమె.. ఎప్పుడో 30 ఏళ్ల కింద ఇంత చలిని చూశానని చెప్పింది. పగలు రాత్రి తేడా లేకుండా చెద్దరి కప్పుకుని ఉండాల్సి వస్తోందంది. – సారంగపూర్ (జగిత్యాల) సాక్షి, కామారెడ్డి/గాంధారి: ఈ చిత్రంలోని రైతు కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రామలక్ష్మణ్పల్లికి చెందిన చాకలి సాయిలు. రోజూ తెల్లవారుజామునే పొలం వద్దకు వెళ్లేవాడు. ఒక్కసారిగా చలి తీవ్రత పెరగడంతో ఎనిమిది గంటలు దాటాకే ఇంట్లోంచి బయటికి వెళ్తున్నానని చెప్పాడు. మళ్లీ సాయంత్రం చీకటిపడేలోపే ఇంటికి వచ్చేస్తున్నామని తెలిపాడు.‘‘పొద్దటిపూట పొలం కాడికి పోవాలంటెనే భయమవుతోంది. చేతులు తిమ్మిరి ఎక్కుతున్నయి. ఎండ పొడ వచ్చినా చలి వదుల్తలేదు. ప్రతీ ఏడాది చలి ఉంటుందిగానీ ఈసారి చాలా ఎక్కువ అనిపిస్తోంది. చాలా ఇబ్బంది అవుతోంది..’’ అని సాయిలు పేర్కొన్నాడు. దారి వెంట చలిమంటలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో చెరుకు కోతల సీజన్ నడుస్తోంది. రైతులు చెరుకును ఎడ్ల బండ్లపై ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. చలికి తట్టుకోలేక.. దారి మధ్యలో రెండు, మూడు కిలోమీటర్లకోసారి ఆగి చలిమంటలు వేసుకుంటూ ప్రయాణిస్తున్నారు. 15 ఏళ్లుగా చెరుకు తరలిస్తున్నామని, కానీ ఎన్నడూ ఇంతగా చలిని చూడలేదని చెరుకు కొట్టే కూలీ రాజునాయక్ వాపోయారు. వణుకుతూ.. రోడ్లూడుస్తూ.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సోనాలలో బుధవారం ఉదయం చలికి గజగజా వణుకుతూ రోడ్లు ఊడుస్తున్న పారిశుధ్య కార్మికులు వీరు. రోజూ తెల్లవారకముందే విధుల్లోకి రావాల్సిన పరిస్థితిలో చలికి తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. సోనాలలో రెండు మూడు రోజులుగా సగటున 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. – బోథ్ చలి దరువు.. బతుకు బరువు బుధవారం ఉదయం ఎనిమిది దాటుతున్నా వణికిస్తున్న చలిలో నడుచుకుంటూ వెళుతున్న చిరు వ్యాపారులు ఓ వైపు.. చలికి తట్టుకోలేక చలి మం టలు వేసుకుని ఉపశమనం పొందు తున్న పశువుల కాపరులు మరోవైపు.. రాజన్న సిరిసిల్ల జిల్లా గజసింగవరంలో కనిపించిన దృశ్యాలివి. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్న సిరిసిల్ల జిల్లా మరిన్ని రోజులు వణుకుడే సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. చాలాచోట్ల సాధారణం కంటే ఐదారు డిగ్రీల మేర తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రానికి ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండడంతో చలి పెరుగుతోందని పేర్కొంది. రాష్ట్రంలో ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో 4.6 డిగ్రీల అతితక్కువ ఉష్ణోగ్రత నమోదైనట్టు వెల్లడించింది. ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 5.8, బేల, అర్లి(టి)లో 5.9, సిర్పూర్లో 6, కోహీర్‌లో 7.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ప్రకటించింది. మరో మూడు రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. -
రాష్ట్రంలో పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్టంగా నమోదవుతున్నాయి. అదిలాబాద్‌లో మంగళవారం రాత్రి ఏకంగా 13.2 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రత తగ్గింది. సోమవారం రాత్రి 15.5 డిగ్రీలు నమోదు కాగా.. ఒక్కరోజులోనే దాదాపు రెండు డిగ్రీలు తగ్గిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 12 స్టేషన్లలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలను వాతావరణ శాఖ నమోదు చేసింది. ఇందులో ఎనిమిది స్టేషన్లలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. హైదరాబాద్, హన్మకొండ, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రామగుండంలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే స్వల్పంగా తగ్గినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రెండ్రోజుల్లో తేలికపాటి వర్షాలు నైరుతి బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల రెండ్రోజుల్లో రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. -
చలిరాత్రి
సాక్షి, హైదరాబాద్: ఉత్తర భారతం నుంచి చలిగాలులు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. గత నెలలో ప్రవేశించాల్సిన చలి గాలులు ఆలస్యంగా రావడంతో పలు చోట్ల ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. ఇప్పటివరకు తూర్పు దిశ నుంచి తేమ గాలులు వచ్చాయి. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదైన సంగతి తెలిసిందే. చలి గాలులు ప్రవేశించడంతో రాష్ట్రంలో పలుచోట్ల ఒక్కసారిగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లా భీమ్‌పూర్ మండలం అర్లిలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 5.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా తంసిలో 6.2 డిగ్రీలు, కొమురం భీం జిల్లా సిర్పూరులో 6.6 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బరంపూర్‌లో 7 డిగ్రీలు, జైనాడ్, బేలాలలో 7.1 డిగ్రీల చొప్పున, భోరాజ్‌లో 7.2 డిగ్రీలు, ఆదిలాబాద్ పట్టణం, రాంనగర్‌లలో 7.3 డిగ్రీల చొప్పున, తలమడుగులో 7.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. వచ్చే నెలలోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. వాతావరణ మార్పుల కారణంగానే ఈసారి గతం కంటే చలి తీవ్రత తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. నేడు పలు జిల్లాల్లో చలిగాలులు.. పొడి వాతావరణం కారణంగా సోమవారం ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని రాజారావు వెల్లడించారు. సోమ, మంగళవారాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
రెండు రాష్ట్రాల్లో తగ్గిన గరిష్ట ఉష్ణోగ్రతలు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడగా మేఘాలు ఆవరించి ఉన్నాయి. అయితే రాత్రిపూట మాత్రం అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. తగ్గిన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి... అనంతపురం 41.2 డిగ్రీలు, కాకినాడ 34.6 డిగ్రీలు, కళింగపట్నం 33.5 డిగ్రీలు, కర్నూలు 11 డిగ్రీలు, మచిలీపట్నం 33.6 డిగ్రీలు, నెల్లూరు 36.3 డిగ్రీలు, ఒంగోలు 34.1 డిగ్రీలు, తిరుపతి 40.4 డిగ్రీలు, విజయవాడ 37.3 డిగ్రీలు, విశాఖపట్నం 31.7 డిగ్రీలు నమోదు అయింది. అలాగే హైదరాబాద్ 39.2 డిగ్రీలు, నిజామాబాద్ 41.5 డిగ్రీలు, రామగుండం 40.2 డిగ్రీలు నమోదు అయింది. -
విశాఖ ఏజెన్సీలో కొనసాగుతున్న చలి తీవ్రత
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజూకి పెరిగిపోతుంది. విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడు వేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీలోని అరుకు, పాడేరులో 10 డిగ్రీలు.... అలాగే మినుములూరులో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. దీంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. -
విశాఖ ఏజెన్సీలో కొనసాగుతున్న చలి తీవ్రత
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజూకి పెరిగిపోతుంది. విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడు వేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీలోని లంబసింగిలో 7 డిగ్రీలు, చింతపల్లి 9.5 డిగ్రీలు, అరకు, పాడేరులో కూడా ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. దీంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. -
విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజూకి పెరిగిపోతుంది. విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడు వేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీలోని లంబసింగిలో 5 డిగ్రీలు, చింతపల్లి 7 డిగ్రీలు, అరకు, పాడేరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. దీంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.