హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడగా మేఘాలు ఆవరించి ఉన్నాయి. అయితే రాత్రిపూట మాత్రం అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. తగ్గిన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి... అనంతపురం 41.2 డిగ్రీలు, కాకినాడ 34.6 డిగ్రీలు, కళింగపట్నం 33.5 డిగ్రీలు, కర్నూలు 11 డిగ్రీలు, మచిలీపట్నం 33.6 డిగ్రీలు, నెల్లూరు 36.3 డిగ్రీలు, ఒంగోలు 34.1 డిగ్రీలు, తిరుపతి 40.4 డిగ్రీలు, విజయవాడ 37.3 డిగ్రీలు, విశాఖపట్నం 31.7 డిగ్రీలు నమోదు అయింది.
అలాగే హైదరాబాద్ 39.2 డిగ్రీలు, నిజామాబాద్ 41.5 డిగ్రీలు, రామగుండం 40.2 డిగ్రీలు నమోదు అయింది.