విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజూకి పెరిగిపోతుంది. విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడు వేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు.
ఏజెన్సీలోని లంబసింగిలో 5 డిగ్రీలు, చింతపల్లి 7 డిగ్రీలు, అరకు, పాడేరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. దీంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.