cool winds
-
కూల్ జోన్లో రాజధాని
సాక్షి,న్యూఢిల్లీ: మంచుదుప్పటి కప్పుకున్న దేశ రాజధాని రాబోయే వారం రోజుల్లో మరింత వణకనుంది. పొగమంచు, చలిగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాజధానిలో వచ్చే వారం ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) పేర్కొంది. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత ఐదు డిగ్రీలకు పడిపోతుందని ఐఎండీ తెలిపింది. రాజధాని ప్రాంతంలో శనివారం కనిష్ట ఉష్ణోగ్రత 7.2 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. జనవరి 4 తర్వాత కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు దిగివస్తాయని పేర్కొంది. ఉత్తరాది నుంచి శీతలగాలులు ఢిల్లీని తాకుతున్నాయని, గాలుల ఉధృతి అధికమయ్యే కొద్దీ ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని ఐఎండీ అధికారులు తెలిపారు. -
మెదక్, నల్లగొండల్లో చలి ప్రతాపం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. ఉత్తర, ఈశాన్య భారతం నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని, మరో నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని, చలి తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో మెదక్, నల్లగొండల్లో చలి ప్రతాపం చూపింది. మెదక్‌లో సాధారణం కంటే ఐదు డిగ్రీల తక్కువగా 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. నల్లగొండలో ఆరు డిగ్రీలు తక్కువగా 15 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో నాలుగు డిగ్రీలు తక్కువగా 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, హన్మకొండల్లో 3 డిగ్రీలు తక్కువగా 17 డిగ్రీల చొప్పున, హైదరాబాద్‌లో 17 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
విశాఖ ఏజెన్సీలో కొనసాగుతోన్న చలి తీవ్రత
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజూకి పెరిగిపోతుంది. విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడు వేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీలోని పాడేరులో 12 డిగ్రీలు.... అలాగే మినుములూరులో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. దీంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. -
విశాఖ ఏజెన్సీలో కొనసాగుతున్న చలి తీవ్రత
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజూకి పెరిగిపోతుంది. విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడు వేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీలోని అరుకు, పాడేరులో 10 డిగ్రీలు.... అలాగే మినుములూరులో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. దీంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. -
విశాఖ ఏజెన్సీలో కొనసాగుతున్న చలి తీవ్రత
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజూకి పెరిగిపోతుంది. విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడు వేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీలోని లంబసింగిలో 7 డిగ్రీలు, చింతపల్లి 9.5 డిగ్రీలు, అరకు, పాడేరులో కూడా ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. దీంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. -
విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజూకి పెరిగిపోతుంది. విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడు వేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీలోని లంబసింగిలో 5 డిగ్రీలు, చింతపల్లి 7 డిగ్రీలు, అరకు, పాడేరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. దీంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. -
నెల్లూరులో చలి గాలులకు ఆరుగురు మృతి