Safdarjung
-
‘సఫ్దర్‌జంగ్’లో మంటలు.. అద్దాలు పగులగొట్టి..
దేశ రాజధాని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలోని పాత ఎమర్జెన్సీ విభాగంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 10 అగ్నిమాపక వాహనాలతో సహా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.వారు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి 70 మంది రోగులు, ముగ్గురు నర్సులను బయటకు తీసుకొచ్చారు. అయితే ఇందుకోసం జేసీబీ సాయంతో భవనంలోని అద్దాలు పగలగొట్టవలసి వచ్చింది. ఈ విభాగంలో కుక్కకాటు బాధితులకు ఇంజక్షన్ ఇస్తుంటారు. మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. షార్ట్‌సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. -
చలితో గజ గజ! ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: ఉత్తర భారతంలో చలి తీవ్రత ఉధృతమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ చలికి గజ గజ వణుకుతోంది. ఆదివారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేసింది. వెలుతురులేమి కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలోని సఫ్తార్‌జంగ్ ప్రాంతంలో అత్యల్పంగా 1.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితులు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 20 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు.. సఫ్తార్‌జంగ్ (1.9), పాలమ్(5.2), లోథిరోడ్ (2.8), రిడ్జ్(2.2), అయా నగర్(2.6) డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు.. గాలి నాణ్యత సైతం ప్రమాదకరస్థాయిలోనే ఉంది. గాలినాణ్యత సూచీ 359గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్న క్రమంలో నిరాశ్రయుల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది ఢిల్లీ ప్రభుత్వం. తమ ప్రాంతాల్లోని శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు.. పంజాబ్‌లోని అమృత్సర్, పాటియాలా, అంబాలా, చండీగఢ్, రాజస్థాన్‌లోని గంగానగర్‌లో చలి తీవ్రత అధికంగా ఉంది. పొగమంచు కారణంగా వెలుతురులేమితో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. Delhi | Severe cold wave and fog conditions continue to prevail in the national capital. Visuals from Kartavya Path pic.twitter.com/hpahVIAtXY — ANI (@ANI) January 8, 2023 ఇదీ చదవండి: స్తోమత లేక బడి మానేసి బీడీలు.. ఇప్పుడు అమెరికాలో జడ్జీగా తీర్పులు -
సఫ్దర్‌జంగ్‌వాసుల గోడు వినరా
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనా ప్రభుత్వమైనా, రాష్ట్రపతి పాలనలో అయినా ప్రభుత్వ పనితీరు మందకొడిగానే ఉంటుందని సఫ్దర్‌జంగ్‌వాసులు విమర్శిస్తున్నారు. కపషేరాకు దాకా వెళ్లడం కష్టమవుతున్నందున, సబ్ డివి జనల్ మెజిస్ట్రేట్ (ఎస్డీఎం), సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కపషేరా నుంచి ఆర్కేపురానికి మార్చాలన్ని విజ్ఞప్తికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఒక జీఓ కూడా జారీ అయింది. ఏడాది గడుస్తున్నా ఇది అమలు కాకపోవడంపై సఫ్దర్‌జంగ్, వసంత్‌విహార్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్డీఎం కార్యాలయ తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)కు లేఖ రాశామని తెలిపారు. ఈ జీఓ ప్రకారం వసంత్‌విహార్ ఎస్డీఎం ఇక నుంచి న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనర్ పాలనా పరిధిలోకి వస్తారు. ప్రస్తుతం ఈ ఎస్డీఎం నైరుతిఢిల్లీ డిప్యూటీ కమిషనర్ అధీనంలో పనిచేస్తున్నారు. ‘గత ఏడాది జీఓను విడుదల చేసినా ఇది ఇప్పటికీ అమలు కావడం లేదు. దీని ప్రకారం వసంత్‌విహార్ ఎస్డీఎం న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనర్ పాలనా పరిధిలోకి వచ్చా రు కానీ కార్యాలయాన్ని మాత్రం తరలించలేదు. దీనివల్ల సఫ్దర్జంగ్వాసులంతా ప్రభుత్వ పనుల నిమిత్తం కచ్చితంగా కపషేరా దాకా వెళ్లాల్సి వస్తోంది. అంటే దాదాపు 35 కిలోమీటర్ల వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. సబ్‌రిజి స్ట్రార్ కార్యాలయం కూడా అక్కడే ఉంది. కార్యాలయాన్ని తరలించాలని ప్రభు త్వ ఆదేశాలు ఉన్నప్పుడు.. ఆ పని ఎందుకు చేయడం లేదు?’ అని నివాసుల సంక్షేమ సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి పంకజ్ అగర్వాల్ అన్నారు. ముఖ్యంగా వయోధికులు కపషేరా వరకు వెళ్లడం కష్టసాధ్యమవుతున్నందున ఎస్డీఎం కార్యాలయ తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ఈసమాఖ్య ఎల్జీకి లేఖ రాసింది. దీనిపై సంబంధిత అధికారవర్గాల వివరణ కోర గా, విధానపరమైన జాప్యాల వల్లే ఎస్డీఎం కార్యాలయ తరలింపు ఆల స్యమవుతోందని చెప్పారు. సదరు జీఓ ప్రకారం సబ్ రిజిస్ట్రార్, ఎస్డీఎం కార్యాలయాలను ఆర్కేపురంలోని పాలికా భవన్‌కు తరలించాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఆర్థిక, రెవెన్యూశాఖలు లాంఛనాలు పూర్తి చేసినా, పీడబ్ల్యూడీ అద్దె స్థిరీకరణ కమిటీ వద్ద ఈ అంశం పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం వల్లే కార్యాలయాల తరలింపులో ఆలస్యం జరుగుతోందని సఫ్దర్‌జంగ్‌వాసులు ఆరోపిస్తున్నారు.