న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనా ప్రభుత్వమైనా, రాష్ట్రపతి పాలనలో అయినా ప్రభుత్వ పనితీరు మందకొడిగానే ఉంటుందని సఫ్దర్‌జంగ్‌వాసులు విమర్శిస్తున్నారు. కపషేరాకు దాకా వెళ్లడం కష్టమవుతున్నందున, సబ్ డివి జనల్ మెజిస్ట్రేట్ (ఎస్‌డీఎం), సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కపషేరా నుంచి ఆర్కేపురానికి మార్చాలన్ని విజ్ఞప్తికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఒక జీఓ కూడా జారీ అయింది. ఏడాది గడుస్తున్నా ఇది అమలు కాకపోవడంపై సఫ్దర్‌జంగ్, వసంత్‌విహార్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌డీఎం కార్యాలయ తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)కు లేఖ రాశామని తెలిపారు. ఈ జీఓ ప్రకారం వసంత్‌విహార్ ఎస్డీఎం ఇక నుంచి న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనర్ పాలనా పరిధిలోకి వస్తారు.
ప్రస్తుతం ఈ ఎస్డీఎం నైరుతిఢిల్లీ డిప్యూటీ కమిషనర్ అధీనంలో పనిచేస్తున్నారు. ‘గత ఏడాది జీఓను విడుదల చేసినా ఇది ఇప్పటికీ అమలు కావడం లేదు. దీని ప్రకారం వసంత్‌విహార్ ఎస్డీఎం న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనర్ పాలనా పరిధిలోకి వచ్చా రు కానీ కార్యాలయాన్ని మాత్రం తరలించలేదు. దీనివల్ల సఫ్దర్‌జంగ్‌వాసులంతా ప్రభుత్వ పనుల నిమిత్తం కచ్చితంగా కపషేరా దాకా వెళ్లాల్సి వస్తోంది. అంటే దాదాపు 35 కిలోమీటర్ల వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. సబ్‌రిజి స్ట్రార్ కార్యాలయం కూడా అక్కడే ఉంది. కార్యాలయాన్ని తరలించాలని ప్రభు త్వ ఆదేశాలు ఉన్నప్పుడు.. ఆ పని ఎందుకు చేయడం లేదు?’ అని నివాసుల సంక్షేమ సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి పంకజ్ అగర్వాల్ అన్నారు.
ముఖ్యంగా వయోధికులు కపషేరా వరకు వెళ్లడం కష్టసాధ్యమవుతున్నందున ఎస్డీఎం కార్యాలయ తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ఈసమాఖ్య ఎల్జీకి లేఖ రాసింది. దీనిపై సంబంధిత అధికారవర్గాల వివరణ కోర గా, విధానపరమైన జాప్యాల వల్లే ఎస్డీఎం కార్యాలయ తరలింపు ఆల స్యమవుతోందని చెప్పారు. సదరు జీఓ ప్రకారం సబ్ రిజిస్ట్రార్, ఎస్డీఎం కార్యాలయాలను ఆర్కేపురంలోని పాలికా భవన్‌కు తరలించాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఆర్థిక, రెవెన్యూశాఖలు లాంఛనాలు పూర్తి చేసినా, పీడబ్ల్యూడీ అద్దె స్థిరీకరణ కమిటీ వద్ద ఈ అంశం పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం వల్లే కార్యాలయాల తరలింపులో ఆలస్యం జరుగుతోందని సఫ్దర్‌జంగ్‌వాసులు ఆరోపిస్తున్నారు.
సఫ్దర్‌జంగ్‌వాసుల గోడు వినరా
Published Mon, Jun 30 2014 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM
Advertisement