SDM
-
సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్‌పై ఎమ్మెల్యే అభ్యర్థి దాడి
జైపూర్ : పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్న సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్‌పై (ఎస్డీఎం)పై దాడి ఘటన కలకలం రేపుతుంది. పోలింగ్ బూత్‌లో స్వతంత్ర ఎమ్మెల్యేగా అభ్యర్థిగా బరిలోకి దిగిన ఓ వ్యక్తి ఎస్‌డీఎంపై దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.రాజస్థాన్‌లోని డియోలీ-యునియారా నియోజవర్గానికి బుధవారం ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. ఆ నియోజక వర్గంలో సంరవత పోలింగ్ స్టేషన్లో సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా అధికారి అమిత్ చౌదరీ ఎన్నికల పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు.ఆ సమయంలో కాంగ్రెస్ బహిష్క్రుత నేత, డియోలీ-యునియారా ఉప ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థి నరేష్ మీనా పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అనంతరం పోలింగ్ కేంద్రంలో ఉన్న ఎస్డీఎం అమిత్ చౌదరిపై దాడి చేశారు. ఎస్డీఎం అమిత్ చౌదరి.. తనతో సన్నిహితంగా ఉన్న ఓ పార్టీ అభ్యర్థికి ఓట్లు పడేలా ఓటర్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఈ దాడితో అప్రమత్తమైన పోలీసులు నరేష్ మీనాను పోలింగ్ కేంద్రం బయటకు తీసుకువచ్చారు. ఎస్డీఎం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బైటాయించారు. రాజస్థాన్‌లోని ఝుంఝును, దౌసా, డియోలి-ఉనియారా, ఖిన్వ్సర్, చౌరాసి, సాలంబెర్, రామ్‌గఢ్ స్థానాలు ఉప ఎన్నిక కొనసాగుతుంది. కాగా,గతేడాది రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 114 స్థానాల్లో, కాంగ్రెస్ 65 స్థానాల్లో విజయం సాధించాయి. మిగిలిన స్థానాల్లో ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర్య అభ్యర్థులు గెలుపొందారు. मैं देवली उनियारा से नरेश मीणा का समर्थन कर रहा था परंतु आज जिस प्रकार का गंदा रवैया उनके द्वारा देखा गया वह शर्मनाक है।@NareshMeena__ की अभी कोई हैसियत नहीं है कि वह एक एसडीएम के ऊपर हाथ उठाएं, यह लोकतंत्र व भारतीय प्रशासन पर कलंक है। एकतरफ देश की सबसे कठिन परीक्षा देकर आया एक… pic.twitter.com/urAxAjR3BI— Priyanshu Kumar (@priyanshu__63) November 13, 2024 -
డిప్యూటీ కలెక్టర్ వికృత చేష్టలు.. ఆకస్మిక తనిఖీల పేరుతో.. బాలికల గదిలోకి వెళ్లి.. మంచంపై
భోపాల్: ఆకస్మిక తనిఖీల పేరుతో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న ఓ ప్రభుత్వ అధికారి వసతిగృహ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఝాబువా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్డీఎం సునీల్ కుమార్ ఝా ఆదివారం బాలికల ఆశ్రమం ఝబువా హాస్టల్‌కు ఆకస్మిక తనిఖీ కోసం వెళ్లారు. అక్కడికి వెళ్లగానే హాస్టల్ సూపరింటెండెంట్ని గది బయటే ఉండమని.. బాలికలతో తాను ఒంటరిగా మాట్లాడాలని తెలిపారు. తనీఖీలో భాగంగా అనుకున్న ఆ సూపరింటెండెంట్ కూడా సరే అని రూం బయటే ఉండిపోయాడు. బాలికల గదిలోకి వెళ్లగానే.. ఆ అధికారి ముందుగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం గురించి పలు ప్రశ్నలు అడిగారు. తర్వాత బాలికల మంచంపైన కూర్చొని వారిపై చేతులు వేయడం, కౌగిలించుకోవడం వంటి వెకిలి చేష్టలు చేయడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా బాలికలు ఇబ్బందిపడేలా వారి వ్యక్తిగత విషయాలను కూడా అడిగాడు. 11 నుంచి 13 ఏళ్ల వయసున్న విద్యార్థినులతో అతను దారుణంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థినులు సూపరింటెండెంట్‌తో కలిసి సోమవారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. మరోవైపు, బాలికల ఫిర్యాదుని నమోదు చేసుకున్న పోలీసులు ఆ అధికారిపై కేసు నమోదు చేశారు. అదే సమయంలో ఈ విషయం వెలుగులోకి రావడంతో, జిల్లా కలెక్టర్ నివేదిక ఆధారంగా నిందితుడిని విధుల నుంచి కూడా సస్పెండ్ చేశారు. పోలీసులు సునీల్ యాదవ్ ఝాను పోక్సో కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపరచి, జుడిషియల్ కస్టడీకి తరలించారు. చదవండి: ‘ఏమండీ వంటగదిలో డబ్బులు పెట్టాను. తీసుకోండి.. మీరు, పిల్లలు జాగ్రత్త’.. అంటూ -
ఏయ్ ఆపు.. నోర్ముయ్: ప్రభుత్వాధికారిణి జులుం!
బిడ్డ పోయి పుట్టెడు దుఖంలో ఉన్న ఆ తల్లిని ఓదార్చాల్సింది పోయి.. ఆ ప్రభుత్వాధికారిణి వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాటి ఆడదానిగా ఆ తల్లి శోకాన్ని అర్థం చేసుకోలేకపోయిందని, అధికారం ఉందని ఎలా పడితే అలా వ్యవహరిస్తుందా? అని నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ఉత్తర ప్రదేశ్ మోదీనగర్‌లో పదేళ్ల అనురాగ్ భరద్వాజ్ అనే కుర్రాడి మరణం.. రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. బుధవారం ఎప్పటిలాగే తన స్కూల్ బస్సులో వెళ్తుండగా.. డ్రైవర్ నిర్లక్ష్యంగా బండి నడపడం, హఠాత్తుగా మలుపులు తిప్పడంతో.. అనురాగ్ తన తల బయట పెట్టి వాంతులు చేసుకున్నాడు. ఆ సమయంలో డ్రైవర్ మరోసారి మలుపులు తిప్పడంతో.. ఓ స్తంభానికి తల తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో డ్రైవర్, బస్సులో ఉన్న మరో సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఫిట్నెస్ లేని బస్సును నడిపించిన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోనందుకు నిరసనగా.. అనురాగ్ తల్లిదండ్రులతో పాటు మరికొందరు పేరెంట్స్ ధర్నాకు దిగారు. అంతేకాదు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడం మీద ఏప్రిల్ 1వ తేదీనే స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశామని, అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే తన కొడుకు బతికేవాడని రోదిస్తూ నినాదాలు చేసింది అనురాగ్ తల్లి నేహా. ఈ క్రమంలో.. మోదీనగర్ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ శుభాంగి శుక్లా అక్కడికి వచ్చారు. ‘‘ఎందుకు అర్థం చేసుకోవట్లదమ్మా? చెప్తున్నాగా నోరు మూస్కో’’ అని నేహాను గద్దించింది శుభాంగి. ‘చనిపోయింది నీ కొడుకా? నా కొడుకు?’’ అంటూ ఏడుస్తూ బదులిచ్చింది నేహా భరద్వాజ్. దీంతో కోపోద్రిక్తురాలైన శుభాంగి.. ఎన్నిసార్లు చెప్పాలి. అర్థం చేసుకోవా? నేను అర్థం చేసుకున్నా.. నీ కొడుకు చచ్చాడు’’ అంటూ నోరు పారేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. స్కూల్‌యాజమాన్యంపై చర్యలతో పాటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను తక్షణమే స్కూల్ బస్సుల ఫిట్నెస్ను పరిశీలించాలని ఆదేశించాడు. అయితే అధికారిణిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ తరుణంలో.. ఆమెపై వేటు వేయాలని పలువురు పేరెంట్స్ కోరుతున్నారు. అయితే ప్రమాదంలో కుర్రాడి తప్పే ఉందని, వాంతులు వస్తున్న విషయం బస్సులో ఉన్న టీచర్‌కు చెప్పకుండా తల బయటకు పెట్టాడని ఎస్డీఎం శుభాంగి శుక్లా అంటున్నారు. చదవండి: యువకుడ్ని లాగిపెట్టి కొట్టిన ఎమ్మెల్యే -
ఒకే చోట 281 కేసులు.. లాక్డౌన్ విధిస్తారా?!
బెంగళూరు: కొత్త రకం కరోనా వేరియంట్ బీ.1.1.529. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ‘ఒమిక్రాన్’గా పేరు పెట్టిన ఈ వేరియంట్.. గతంలో వెలుగు చూసిన డెల్టా, మిగతా వేరియంట్లకన్నా చాలా ప్రమాదకరం అని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజాగా యూరప్ దేశాల్లో కేసుల సంఖ్య ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. మన దగ్గర కూడా కరోనా కేసుల్లో పెరుగదల కనిపిస్తోంది. గత రెండు మూడు రోజులుగా రెండు డోసులు తీసుకున్న మెడికల్ సిబ్బంది కరోనా బారిన పడ్డారనే వార్తలు చూశాం. ఈ క్రమంలో కర్ణాటక, ధార్వాడ్ మెడికల్ కాలేజీలో శనివారం 99 మంది మెడికల్ కాలేజీ స్టూడెంట్స్, అధ్యాపకులు కరోనా బారిన పడటంతో వీరి సంఖ్య 281కి చేరుకుంది. ఈ సందర్భంగా కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కే. సుధాకర్ ఎస్డీఎం మెడికల్ సైన్స్ కాలేజీ కోవిడ్ క్లస్టర్‌గా మారిందని తెలిపారు. (చదవండి: ప్రపంచాన్ని వణికిస్తున్న బి.1.1.529.. డబ్ల్యూహెచ్ఓ ఏమంటోంది?) బారి ఎత్తున వైద్య విద్యార్థులు, అధ్యాపకులు కోవిడ్ బారిన పడటంతో.. రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై సుధాకర్ స్పందించారు. ‘‘ప్రస్తుతం కరోనా బారిన పడ్డ విద్యార్థులు, అధ్యాపకులు కొన్ని రోజుల క్రితం ఓ కార్యక్రమానికి హాజరయ్యారని తెలిసింది. దాని వల్ల ఇన్ని కేసులు వెలుగు చూశాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్ ఆంక్షలు విధించే పరిస్థితిలో లేము. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి’’ అని సుధాకర్ తెలిపారు. ప్రస్తుతం మరో 1,822 పరీక్ష ఫలితాలు రావాల్సి ఉన్నందున ఈ సంఖ్య పెరగవచ్చని ధార్వాడ్ జిల్లా కలెక్టర్ నితీష్ పాటిల్ తెలిపారు. 281 మందిలో కేవలం ఆరుగురు రోగులకు మాత్రమే తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, ఇతరుల్లో ఎలాంటి లక్షణాలు వెలుగు చూడలేదని తెలిపారు. ప్రస్తుతం వారందరినీ క్వారంటైన్ చేసి చికిత్స అందిస్తున్నామన్నారు. (చదవండి: భారీ శబ్దం కలకలం : ‘భూకంపం సంభవించిందా ఏంటి’) ప్రస్తుతం కరోనా బారిన పడ్డ వైద్య విద్యార్థులు, అధ్యాపకులు నవంబర్ 17న కాలేజ్ క్యాంపస్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరిలో చాలా మందిలో అసలు లక్షణాలు కనిపించలేదు. పైగా అందరు వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం కాలేజీకి 500 మీటర్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని విద్యాసంస్థలకు ఆదివారం వరకు సెలవు ప్రకటించారు. చదవండి: దక్షిణాఫ్రికా ‘దడ’.. కొమ్ములు విరుచుకుంటున్న కొత్త వేరియెంట్ -
మహిళా అధికారికి బీజేపీ ఎమ్మెల్యే బెదిరింపులు
ఆగ్రా : యూపీలో పాలక బీజేపీ ఎమ్మెల్యే ఉదయభన్ చౌదరి.. కేరావలి సబ్ డివిజనల్ మేజిస్ర్టేట్ (ఎస్డీఎం) గరీమ సింగ్‌ను బెదిరిస్తూ వీడియోలో పట్టుబడ్డారు. రాజకీయ నేతగా తన సత్తా ఏంటో చూపిస్తానని అంటూ తాను ఎమ్మెల్యేనని తెలియదా అని ఆమెను గద్దించారు. నా అధికారం ఏంటో నీకు తెలియదని కేకలు వేస్తున్న దృశ్యం ఆ వీడియోలో రికార్డయింది. గరీమను ఆయన సర్వెంట్‌గా సంబోధిస్తూ దబాయించారు. నీవు ఎస్డీఎంననే దర్పం నా వద్ద ప్రదర్శించాలని అనుకుంటున్నావా అంటూ నీవు ఎస్డీఎం కాదని, ఓ నౌకరువు మాత్రమేనని అనడం వీడియోలో వినిపించింది. రైతు సమస్యల గురించి మాట్లాడేందుకు ఎమ్మెల్యే ఎస్డీఎంను కలిశారు. ఎస్‌డీఎంపై ఆయన కేకలు వేస్తున్న క్రమంలో అక్కడున్నవారిలో కొందరు ఎస్డీఎం జిందాబాద్ అనడం వీడియోలో రికార్డయింది. మహిళా అధికారిపై బీజేపీ ఎమ్మెల్యే చిందులు వేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. -
సఫ్దర్‌జంగ్‌వాసుల గోడు వినరా
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనా ప్రభుత్వమైనా, రాష్ట్రపతి పాలనలో అయినా ప్రభుత్వ పనితీరు మందకొడిగానే ఉంటుందని సఫ్దర్‌జంగ్‌వాసులు విమర్శిస్తున్నారు. కపషేరాకు దాకా వెళ్లడం కష్టమవుతున్నందున, సబ్ డివి జనల్ మెజిస్ట్రేట్ (ఎస్డీఎం), సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కపషేరా నుంచి ఆర్కేపురానికి మార్చాలన్ని విజ్ఞప్తికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఒక జీఓ కూడా జారీ అయింది. ఏడాది గడుస్తున్నా ఇది అమలు కాకపోవడంపై సఫ్దర్‌జంగ్, వసంత్‌విహార్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్డీఎం కార్యాలయ తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)కు లేఖ రాశామని తెలిపారు. ఈ జీఓ ప్రకారం వసంత్‌విహార్ ఎస్డీఎం ఇక నుంచి న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనర్ పాలనా పరిధిలోకి వస్తారు. ప్రస్తుతం ఈ ఎస్డీఎం నైరుతిఢిల్లీ డిప్యూటీ కమిషనర్ అధీనంలో పనిచేస్తున్నారు. ‘గత ఏడాది జీఓను విడుదల చేసినా ఇది ఇప్పటికీ అమలు కావడం లేదు. దీని ప్రకారం వసంత్‌విహార్ ఎస్డీఎం న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనర్ పాలనా పరిధిలోకి వచ్చా రు కానీ కార్యాలయాన్ని మాత్రం తరలించలేదు. దీనివల్ల సఫ్దర్జంగ్వాసులంతా ప్రభుత్వ పనుల నిమిత్తం కచ్చితంగా కపషేరా దాకా వెళ్లాల్సి వస్తోంది. అంటే దాదాపు 35 కిలోమీటర్ల వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. సబ్‌రిజి స్ట్రార్ కార్యాలయం కూడా అక్కడే ఉంది. కార్యాలయాన్ని తరలించాలని ప్రభు త్వ ఆదేశాలు ఉన్నప్పుడు.. ఆ పని ఎందుకు చేయడం లేదు?’ అని నివాసుల సంక్షేమ సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి పంకజ్ అగర్వాల్ అన్నారు. ముఖ్యంగా వయోధికులు కపషేరా వరకు వెళ్లడం కష్టసాధ్యమవుతున్నందున ఎస్డీఎం కార్యాలయ తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ఈసమాఖ్య ఎల్జీకి లేఖ రాసింది. దీనిపై సంబంధిత అధికారవర్గాల వివరణ కోర గా, విధానపరమైన జాప్యాల వల్లే ఎస్డీఎం కార్యాలయ తరలింపు ఆల స్యమవుతోందని చెప్పారు. సదరు జీఓ ప్రకారం సబ్ రిజిస్ట్రార్, ఎస్డీఎం కార్యాలయాలను ఆర్కేపురంలోని పాలికా భవన్‌కు తరలించాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఆర్థిక, రెవెన్యూశాఖలు లాంఛనాలు పూర్తి చేసినా, పీడబ్ల్యూడీ అద్దె స్థిరీకరణ కమిటీ వద్ద ఈ అంశం పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం వల్లే కార్యాలయాల తరలింపులో ఆలస్యం జరుగుతోందని సఫ్దర్‌జంగ్‌వాసులు ఆరోపిస్తున్నారు.