సబ్‌ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌పై ఎమ్మెల్యే అభ్యర్థి దాడి | Ex Congress leader Naresh Meena slaps SDM outside polling booth in Rajasthan | Sakshi
Sakshi News home page

సబ్‌ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌పై ఎమ్మెల్యే అభ్యర్థి దాడి

Published Wed, Nov 13 2024 4:18 PM | Last Updated on Wed, Nov 13 2024 4:43 PM

Ex Congress leader Naresh Meena slaps SDM outside polling booth in Rajasthan

జైపూర్‌ : పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్న సబ్‌ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌పై (ఎస్‌డీఎం)పై  దాడి ఘటన కలకలం రేపుతుంది. పోలింగ్‌ బూత్‌లో స్వతంత్ర ఎమ్మెల్యేగా అభ్యర్థిగా బరిలోకి దిగిన ఓ వ్యక్తి ఎస్‌డీఎంపై దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

రాజస్థాన్‌లోని డియోలీ-యునియారా నియోజవర్గానికి బుధవారం ఉప ఎన్నిక పోలింగ్‌ జరుగుతుంది. ఆ నియోజక వర్గంలో సంరవత పోలింగ్ స్టేషన్‌లో సబ్‌ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌ (ఎస్‌డీఎం)గా అధికారి అమిత్‌ చౌదరీ ఎన్నికల పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు.

ఆ సమయంలో కాంగ్రెస్‌ బహిష్క్రుత నేత, డియోలీ-యునియారా ఉప ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థి నరేష్‌ మీనా పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. అనంతరం పోలింగ్‌ కేంద్రంలో ఉన్న ఎస్‌డీఎం అమిత్‌ చౌదరిపై దాడి చేశారు. ఎస్‌డీఎం అమిత్‌ చౌదరి.. తనతో సన్నిహితంగా ఉన్న ఓ పార్టీ అభ్యర్థికి ఓట్లు పడేలా ఓటర్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.  ఈ దాడితో అప్రమత్తమైన పోలీసులు నరేష్‌ మీనాను పోలింగ్‌ కేంద్రం బయటకు తీసుకువచ్చారు. ఎస్‌డీఎం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బైటాయించారు.  

రాజస్థాన్‌లోని  ఝుంఝును, దౌసా, డియోలి-ఉనియారా, ఖిన్వ్‌సర్, చౌరాసి, సాలంబెర్, రామ్‌గఢ్ స్థానాలు ఉప ఎన్నిక కొనసాగుతుంది. కాగా,గతేడాది రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 114 స్థానాల్లో, కాంగ్రెస్‌ 65 స్థానాల్లో విజయం సాధించాయి. మిగిలిన స్థానాల్లో ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర్య అభ్యర్థులు గెలుపొందారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement