మహిళా అధికారికి బీజేపీ ఎమ్మెల్యే బెదిరింపులు | BJP MLA Udaybhan Chaudhary Threatens SDM | Sakshi
Sakshi News home page

మహిళా అధికారిని బెదిరించిన ఎమ్మెల్యే

Published Tue, Dec 18 2018 11:35 AM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

BJP MLA Udaybhan Chaudhary Threatens SDM - Sakshi

ఆగ్రా : యూపీలో పాలక బీజేపీ ఎమ్మెల్యే ఉదయభన్‌ చౌదరి.. కేరావలి సబ్‌ డివిజనల్‌ మేజిస్ర్టేట్‌ (ఎస్‌డీఎం) గరీమ సింగ్‌ను బెదిరిస్తూ వీడియోలో పట్టుబడ్డారు. రాజకీయ నేతగా తన సత్తా ఏంటో చూపిస్తానని అంటూ తాను ఎమ్మెల్యేనని తెలియదా అని ఆమెను గద్దించారు. నా అధికారం ఏంటో నీకు తెలియదని కేకలు వేస్తున్న దృశ్యం ఆ వీడియోలో రికార్డయింది.

గరీమను ఆయన సర్వెంట్‌గా సంబోధిస్తూ దబాయించారు. నీవు ఎస్‌డీఎంననే దర్పం నా వద్ద ప్రదర్శించాలని అనుకుంటున్నావా అంటూ నీవు ఎస్‌డీఎం కాదని, ఓ నౌకరువు మాత్రమేనని అనడం వీడియోలో వినిపించింది. రైతు సమస్యల గురించి మాట్లాడేందుకు ఎమ్మెల్యే ఎస్‌డీఎంను కలిశారు.

ఎస్‌డీఎంపై ఆయన కేకలు వేస్తున్న క్రమంలో అక్కడున్నవారిలో కొందరు ఎస్‌డీఎం జిందాబాద్‌ అనడం వీడియోలో రికార్డయింది. మహిళా అధికారిపై బీజేపీ ఎమ్మెల్యే చిందులు వేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement