thretenig
-
ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపు కలకలం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆగంతకుల బాంబు బెదిరింపులు మరోసారి కలకలానికి కారణమయ్యాయి. బాంబులతో పేల్చేస్తామంటూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ)తోపాటు ఎనిమిది ఆస్పత్రులకు ఈ–మెయిల్ హెచ్చరికలు అందాయి. మే ఒకటో తేదీన దేశ రాజధాని పరిధిలోని 150కి పైగా స్కూళ్లకు కూడా ఇదేవిధంగా బెదిరింపు మెయిళ్లు అందడం, పూర్తిస్థాయిలో తనిఖీల అనంతరం అవన్నీ వట్టివేనని తేలడం తెల్సిందే. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఐజీఐ టెరి్మనల్–3లో బాంబులు పెట్టినట్లు మెయిల్ అందడంతో తనిఖీలు చేపట్టారు. భారీగా పోలీసులను మోహరించారు. అంతకుముందు, మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఢిల్లీ ప్రాంతంలోని 8 ఆస్పత్రులకు బెదిరింపులు అందాయి. అదేవిధంగా, గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ అందింది. అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన ఆయాచోట్లకు ఫైరింజన్లను పంపించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసు బృందాలు పూర్తి స్థాయి తనిఖీలు చేపట్టాయి. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు కనిపించలేదని ఢిల్లీ నార్త్‌జోన్ డీసీపీ ఎంకే మీనా చెప్పారు. బురారీ ఆస్పత్రి, సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్, దాదాదేవ్ హాస్పిటల్, గురు తేజ్ బహదూర్ హాస్పిటల్, బారా హిందూరావ్ హాస్పిటల్, జనక్‌పురి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రి, అరుణా అసఫ్ అలీ గవర్నమెంట్ ఆస్పత్రులకు ఈ బెదిరింపులు వచ్చాయి. -
రతన్ టాటాకు ప్రాణ హాని
ముంబై: టాటా సన్స్ మాజీ చైర్మన్, దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు ప్రాణ హాని ఉందంటూ వచ్చి న ఫోన్ కాల్ శనివారం ముంబై పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. రతన్ టాటాకు తక్షణం భద్రత పెంచాలని, లేదంటే టాటా సన్స్ మరో మాజీ చైర్మన్, పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీకి పట్టిన గతే పడుతుందని కాలర్ హెచ్చరించాడు. సైరస్ మిస్త్రీ 2022 సెప్టెంబర్ నాలుగో తేదీన కారు ప్రమాదంలో దుర్మరణం పాలవడం తెలిసిందే. దాంతో పోలీసులు ఆగమేఘాల మీద రతన్ టాటా భద్రతను పెంచారు. కాల్ కర్ణాటక నుంచి వచ్చినట్టు తేల్చారు. కాల్ చేసిన వ్యక్తిని పుణేకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే, అతను ఐదు రోజులుగా ఆచూకీ లేడంటూ భార్య అప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన విషయం పోలీసుల దర్యాప్తు సందర్భంగా వెలుగులోకి వచ్చింది. బంధుమిత్రులను విచారించగా ఇంజనీరింగ్, ఎంబీఏ ఫైనాన్స్ చేసిన అతనికి కొంతకాలంగా మతిస్థిమితం లేదని తేలింది. కర్ణాటకలో వేరొకరి ఇంట్లోంచి ఫోన్ తీసుకుని వారికి చెప్పకుండానే ముంబై కంట్రోల్ రూమ్‌కు ఇతను ఫోన్ చేసి హెచ్చరించినట్లు దర్యాప్తులో తేలింది. మనోవైకల్య బాధితుడు కావడంతో కేసు నమోదు, విచారణ వంటి చర్యలు చేపట్టకూడదని పోలీసులు నిర్ణయించారు. -
Garisenda Tower: వాలుతున్న వెయ్యేళ్ల టవర్
ఇటలీ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది పీసా నగరంలోని ప్రపంచ ప్రఖ్యాత లీనింగ్ టవరే. నాలుగు డిగ్రీల కోణంలో ఒకవైపు వాలిపోయి అందరికీ ఆకట్టుకుంటూ కని్పస్తుందా కట్టడం. అయితే ఇటలీలోనే మరో లీనింగ్ టవర్ కూడా ఉంది. అది కూడా కాస్త అటూ ఇటుగా పీసా టవర్ అంత ఎత్తు ఉంటుంది. అలాంటి టవర్ కాస్తా ఇప్పుడు ఏ క్షణమైనా కుప్పకూలేలా కని్పస్తూ గుబులు రేపుతోంది....! ఇటలీలోని బొలోగ్నా నగరంలో గారిసెండా టవర్ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. పీసా టవర్ మాదిరిగానే ఇది కూడా నానాటికీ ఓ పక్కకు వాలిపోతుండటమే ఇందుకు కారణం. అలా ఈ టవర్ ఇప్పటిదాకా 4 డిగ్రీల కోణంలో పక్కకు ఒరిగింది. దీనికి తోడు దాని పునాదులు కొంతకాలంగా బాగా బలహీనపడుతూ వస్తున్నట్టు అధికారులు తేల్చారు. దాంతో నగర కౌన్సిల్ హుటాహుటిన సమావేశమై దీని గురించి కూలంకషంగా చర్చించింది. టవర్ ఏ క్షణమైనా కుప్పకూలే ప్రమాదముందని ధ్రువీకరించింది. అదే జరిగితే శిథిలాల ధాటికి పరిసర చుట్టుపక్కల అతి సమీపంలో ఉన్న పలు నివాస, వాణిజ్య సముదాయాలు తీవ్రంగా దెబ్బ తినే ప్రమాదముంది. దీన్ని నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా టవర్ చుట్టూ యుద్ధ ప్రాతిపదికన 5 మీటర్ల ఎత్తున బారియర్ నిర్మిస్తున్నారు. 2024 ఏప్రిల్ లోపు దాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతోపాటు టవర్ చుట్టూ మెటల్ రాక్ ఫాల్ వలలను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా అది కూలినా పరిసర నిర్మాణాలకు ఎలాంటి నష్టమూ లేకుండా చూసేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి టవర్, దాని గ్రౌండ్ ఫ్లోర్‌లోని ప్లాజాలోకి సందర్శకులకు అనుమతి నిరాకరించారు. సందర్శనపై నిషేధం మరికొన్నేళ్ల దాకా (టవర్ కూలని పక్షంలో) కొనసాగుతుందని ఇప్పటికే ప్రకటించారు. బారియర్ నిర్మాణ వ్యయం 37 లక్షల పౌండ్లు(దాదాపు రూ.39.10 కోట్లు)గా అంచనా వేశారు. దీనికోసం ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తుండటం విశేషం! ‘‘నగరవాసులతో పాటు బొలోగ్నా నగరాన్ని, దాని ప్రఖ్యాత పర్యాటక చిహా్నలను కాపాడాలని తపిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రియులందరూ ఈ బృహత్తర యజ్ఞంలో భాగస్వాములు కావాలి’’ అంటూ నగర కౌన్సిల్ పిలుపునిచి్చంది. నిలబెట్టేందుకు తీవ్ర యత్నాలు గారిసెండా టవర్ కూలిపోకుండా కాపాడేందుకు ఇటలీ శాయశక్తులా ప్రయతి్నస్తోంది. పీసా టవర్ కూడా క్రమంగా మరింత పక్కకు వాలి త్వరలో కూలిపోవడం ఖాయమని కొన్నేళ్ల క్రితం వార్తలొచ్చాయి. కానీ ప్రభుత్వం ఏళ్ల తరబడి నానా ప్రయత్నాలూ చేసి దాని ఒంపును కొంతమేర సరిచేసింది. ప్రస్తుతానికి అది కుప్పకూలే ముప్పు లేదని తేలి్చంది. అలా పీసా టవర్‌ను కాస్త సురక్షితంగా మార్చిన అనుభవాన్నంతా గారిసెండా విషయంలో రంగరిస్తున్నారు. ఇందుకోసం సివిల్ ప్రొటెక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. తొలి దశలో దీన్ని వీలైనంత సురక్షితంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. సంబంధిత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రెట్టింపు ఎత్తైన జంట టవర్ గారిసెండా నిజానికి బొలోగ్నా నగరానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిన జంట టవర్లలో ఒకటి మాత్రమే! పైగా చిన్నది. ఎందుకంటే, దీని పక్కనే ఉన్న అసినెల్లీ టవర్ దీనికంటే దాదాపు రెట్టింపు పొడవైంది! అంటే దాదాపు 90 మీటర్లన్నమాట. ప్రఖ్యాత పీసా టవర్ ఎత్తు 56 మీటర్లే. అంటే, ఇది పీసాను తలదన్నేంత ఎత్తుందన్నమాట! అసినెల్లీ టవర్ నిర్మాణం గారిసెండా తర్వాత పదేళ్లకే, అంటే 1,119లో జరిగింది. ఇది కూడా కాస్త పక్కకు ఒరిగే ఉండటం విశేషం. అయితే ఆ ఒంపు మరీ పీసా, గారిసెండా అంతగా లేదు గనుక ప్రస్తుతానికి దీనికి వచి్చన ముప్పేమీ లేనట్టే! దాదాపు వెయ్యేళ్ల నాటిది! ► గారిసెండా టవర్ ఇప్పటిది కాదు. మధ్య యుగానికి చెందినది. ►దీన్ని దాదాపు వెయ్యేళ్ల క్రితం, అంటే క్రీస్తుశకం 1,109 సంవత్సరంలో నిర్మించారు. ►టవర్ ప్రస్తుత ఎత్తు 47 మీటర్లు (154 అడుగులు). ►నిర్మించినప్పుడు ఇది చాలా ఎత్తుండేది. ►200 ఏళ్లకే టవర్ ఒక పక్కకు ఒరగడం మొదలైంది. ►దాంతో 14వ శతాబ్దంలో దాని ఎత్తును బాగా తగ్గించారు. ►డాంటే 1321 సంవత్సరంలో ముగించిన అజరామర పద్య కావ్యం ‘ది డివైన్ కామెడీ’లో కూడా గారిసెండా టవర్ ప్రస్తావన ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ
సాక్షి, హైదరాబాద్: డీజీపీ అంజనీకుమార్‌కి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. పలు ఫోన్ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఎమ్మెల్యే రాజాసింగ్ తనకు పాకిస్తాన్ నుంచి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ట్విట్టర్ ద్వారా రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వాట్సాప్ ద్వారా పాకిస్థాన్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి తన ఆచూకీ, కుటుంబ వివరాలు చెబుతూ... హైదరాబాద్‌లో ఉన్న యాక్టివ్ స్లీపర్ సెల్ ద్వారా చంపేస్తామని బెదిరించినట్లు రాజాసింగ్ తెలిపారు. ప్లస్ 923105017464 నెంబర్ ద్వారా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరచూ ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. చదవండి: 11 గంటలు .. 14 ప్రశ్నలు.. కవిత సమాధానాలు పూర్తిగా వీడియో రికార్డింగ్ -
మహిళా అధికారికి బీజేపీ ఎమ్మెల్యే బెదిరింపులు
ఆగ్రా : యూపీలో పాలక బీజేపీ ఎమ్మెల్యే ఉదయభన్ చౌదరి.. కేరావలి సబ్ డివిజనల్ మేజిస్ర్టేట్ (ఎస్డీఎం) గరీమ సింగ్‌ను బెదిరిస్తూ వీడియోలో పట్టుబడ్డారు. రాజకీయ నేతగా తన సత్తా ఏంటో చూపిస్తానని అంటూ తాను ఎమ్మెల్యేనని తెలియదా అని ఆమెను గద్దించారు. నా అధికారం ఏంటో నీకు తెలియదని కేకలు వేస్తున్న దృశ్యం ఆ వీడియోలో రికార్డయింది. గరీమను ఆయన సర్వెంట్‌గా సంబోధిస్తూ దబాయించారు. నీవు ఎస్డీఎంననే దర్పం నా వద్ద ప్రదర్శించాలని అనుకుంటున్నావా అంటూ నీవు ఎస్డీఎం కాదని, ఓ నౌకరువు మాత్రమేనని అనడం వీడియోలో వినిపించింది. రైతు సమస్యల గురించి మాట్లాడేందుకు ఎమ్మెల్యే ఎస్డీఎంను కలిశారు. ఎస్‌డీఎంపై ఆయన కేకలు వేస్తున్న క్రమంలో అక్కడున్నవారిలో కొందరు ఎస్డీఎం జిందాబాద్ అనడం వీడియోలో రికార్డయింది. మహిళా అధికారిపై బీజేపీ ఎమ్మెల్యే చిందులు వేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. -
ఎస్ఆర్ నగర్లో తుపాకితో బెదిరింపులు
హైదరాబాద్: నగరంలోని ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో కలకలం రేగింది. శనివారం రాత్రి ఓ అపార్టుమెంటు వద్ద ఒక వ్యక్తి తుపాకితో రోడ్డుపైకి వచ్చాడు. 'ఇక్కడ ఎందుకు నిల్చున్నారు?' అంటూ పలువురిని తుపాకితో బెదిరించాడు. దీంతో బెబేలెత్తిపోయిన స్థానికులు ఎస్ఆర్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.