ఎస్ఆర్ నగర్లో తుపాకితో బెదిరింపులు
హైదరాబాద్: నగరంలోని ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో కలకలం రేగింది. శనివారం రాత్రి ఓ అపార్టుమెంటు వద్ద ఒక వ్యక్తి తుపాకితో రోడ్డుపైకి వచ్చాడు. 'ఇక్కడ ఎందుకు నిల్చున్నారు?' అంటూ పలువురిని తుపాకితో బెదిరించాడు.
దీంతో బెబేలెత్తిపోయిన స్థానికులు ఎస్ఆర్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.