వాషింగ్టన్: నిద్రలో కలలు రావడం సాహజం. ఒక్కోసారి అవి కలలా కాకుండా నిజ జీవితంలో జరిగినట్లు అనిపిస్తుంటుంది. ఒక పీడ కలల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవి వస్తే చాలు దెబ్బకు భయపడి లేచి చూసేసరికి మంచం మీద నుంచి కిందపడిపోయి ఉంటాం. ఇలాంటి వింత అనుభవాలు ఎప్పుడో ఒకప్పుడు మనకి ఎదురై ఉంటాయి. ఇదే తరహాలోనే ఓ వ్యక్తికి విచిత్రమైన కల కని.. నిజం తుపాకితో తననే కాల్చుకున్నాడు. అమెరికాలోని ఇల్లినాయిస్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఆ కల ఏంటంటే...
నిద్ర మత్తులో అలా జరిగిపోయింది
అమెరికా ఇల్లినాయిస్‌లోని లేక్ బారింగ్టన్‌లో మార్క్ డికారా నివసిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతను నిద్రపోతుండగా ఓ కల వచ్చింది. ఆ కలలోజ... ఎవరో ఓ వ్యక్తి తలుపులు బద్దలుకొట్టుకుని ఇంట్లోకి చొరబడినట్లు అనిపించింది. దీంతో డికారా భయాందోళనకు గురయ్యాడు. దొంగ నుంచి కాపాడుకోవాడానికి కాల్పులు జరిపేందుకు సిద్ధమయ్యాడు. అయితే నిద్ర మత్తులో ఉన్న డికారా తన దగ్గర ఉన్న 357-క్యాలిబర్ రివాల్వర్‌తో నిజంగానే కాల్చాడు. అయితే అది నేరుగా అతని కాలిలోకే దూసుకెళ్లింది. దెబ్బకు అతని నిద్రంతా ఎగరిపోయింది. బుల్లెట్ కారణంగా తీవ్ర రక్తస్రావం అయ్యింది. గాయం కారణంగా విలవిల్లాడుతూ.. గట్టి అరవడం మొదలుపెట్టాడు. మరో వైపు రివాల్వర్ పేలిన శబ్దం విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. చివరకు దొంగతనం జరిగినట్లు కల రావడం.. ఆ నిద్ర మబ్బులోనే కాల్పులు జరిపినట్లు నిర్ధారించుకున్నారు. ఆ ప్రాంతంలో తుపాకీ కలిగి ఉండాలంటే ప్రభుత్వం నుంచి ఫైర్‌ఆర్మ్ ఓనర్స్ ఐడెంటిఫికేషన్ కార్డు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. కానీ చాలా రోజుల కిందటే అతని ఐడెంటిఫికేషన్ డికార కార్డు రద్దయ్యింది. అయినా అతను రివాల్వర్‌ను వాడుతుండడంతో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం నేరాల కింద పోలీసులు అతనిపై కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment