Delhi Fog
-
విమాన ప్రయాణికులు మాతో సహకరించాలి: సింధియా
న్యూఢిల్లీ: ఢిల్లీని తీవ్రమైన పొగ మంచు కప్పేయటంతో ఆదివారం సుమారు వంద విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. కొన్ని విమానాలు గంటల కొద్ది ఆలస్యంగా బయలుదేరాయి కూడా. ఈ వ్యవహారంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ‘ఎక్స్’ ట్విటర్ వేదిక స్పందించారు. ‘‘నిన్న(ఆదివారం) ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా కొన్ని గంటలపాటు విజిబిలిటీ సమస్య ఎదురైంది. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు జీరో విజిబిలిటీ ఉంది. ఈ కారణంగానే ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు ప్రయాణికుల రక్షణ, భద్రత విషయాన్ని దృష్టిలో పెట్టుకొని విమాన సర్వీసులను కొన్ని గంటల పాటు నిలిపివేసింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటాం. ఎయిర్‌పోర్టులోని CAT-IIIలో భాగంగా ప్రారంభించిన నాలుగో రన్‌వేను కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తాం. వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు విమానాల రద్దు, ఆలస్య అసౌర్యాన్ని తగ్గించడానికి, ప్రయాణికుల సరైన సమాచారం అందజేయాలని కూడా విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి క్లిష్టమైన సమయంలో ప్రయాణికులంతా సహకరించాలని కోరుతున్నా. ప్రయాణికలు అసౌకర్యాన్ని తగ్గించడానికి ఎయిర్‌పోర్టు సిబ్బంది ఎప్పటికప్పుడు కృషి చేస్తోంది. ఈ సమయంలో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించడం సరికాదు. అలా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోకతప్పదు’’ అని మంత్రి సింధియా పేర్కొన్నారు. Yesterday, Delhi witnessed unprecedented fog wherein visibility fluctuated for several hours, and at times, dropped to zero between 5 AM to 9 AM. The authorities, therefore, were compelled to enforce a shut-down of operations for some time even on CAT III runways (CAT III… — Jyotiraditya M. Scindia (@JM_Scindia) January 15, 2024 మరోవైపు.. విమానం ఆలస్యానికి సంబంధించి ఓ ప్రయాణికుడు ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన కెప్టెన్‌పై దాడికి యత్నంచిన విషయం తెలిసిందే. కెప్టెన్ చెంప చెల్లుమనిపించాడు. ఇంతలో ఇతర ప్రయాణికులు అడ్డుతగలడంతో వెనక్కి తగ్గాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. చదవండి: Ram Mandir: అయోధ్యలో భూములు కొన్న అమితాబ్.. రేట్లు ఎలా ఉన్నాయి? -
చలితో గజ గజ! ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: ఉత్తర భారతంలో చలి తీవ్రత ఉధృతమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ చలికి గజ గజ వణుకుతోంది. ఆదివారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేసింది. వెలుతురులేమి కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలోని సఫ్తార్‌జంగ్ ప్రాంతంలో అత్యల్పంగా 1.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితులు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 20 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు.. సఫ్తార్‌జంగ్ (1.9), పాలమ్(5.2), లోథిరోడ్ (2.8), రిడ్జ్(2.2), అయా నగర్(2.6) డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు.. గాలి నాణ్యత సైతం ప్రమాదకరస్థాయిలోనే ఉంది. గాలినాణ్యత సూచీ 359గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్న క్రమంలో నిరాశ్రయుల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది ఢిల్లీ ప్రభుత్వం. తమ ప్రాంతాల్లోని శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు.. పంజాబ్‌లోని అమృత్సర్, పాటియాలా, అంబాలా, చండీగఢ్, రాజస్థాన్‌లోని గంగానగర్‌లో చలి తీవ్రత అధికంగా ఉంది. పొగమంచు కారణంగా వెలుతురులేమితో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. Delhi | Severe cold wave and fog conditions continue to prevail in the national capital. Visuals from Kartavya Path pic.twitter.com/hpahVIAtXY — ANI (@ANI) January 8, 2023 ఇదీ చదవండి: స్తోమత లేక బడి మానేసి బీడీలు.. ఇప్పుడు అమెరికాలో జడ్జీగా తీర్పులు -
52 రైళ్ల ఆలస్యం, 5 రైళ్ల రీ షెడ్యూల్
న్యూఢిల్లీ: పొగమంచు ప్రభావం కారణంగా గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీకి వచ్చే రైళ్ల రాకపోకలకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. నేడూ అదే సమస్య తలెత్తింది. పొగమంచు ప్రభావం వల్ల ఢిల్లీకి వెళ్లవలసిన 52 రైళ్లు ఆలస్యం కానున్నాయి. మరో 5 రైళ్ల వేళలను రీ షెడ్యూల్ చేయగా, ఒక రైలు సర్వీస్‌ను రైల్వే అధికారులు రద్దుచేశారు.